German Silver: వెండి కొనలేకపోతే జర్మన్ సిల్వర్ కొనేయండి, అదే మెరుపు అందం

Published : Dec 30, 2025, 01:13 PM IST

German Silver: వెండి, బంగారం ధరలు విపరీతంగా పెరిగిపోవడంతో పేద, మధ్యతరగతి వారు చాలా ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా పెళ్లిళ్లు, వేడుకలు సమయంలో వెండి సామాన్ల అవసరం ఉంటుంది. అలాంటివారు జర్మన్ సిల్వర్ కొనుక్కుంటే ఇది వెండి లాగే కనిపిస్తుంది.  

PREV
14
జర్మన్ సిల్వర్లో నో వెండి

జర్మన్ సిల్వర్ పేరులో సిల్వర్ అని ఉంటుంది. కానీ దీనికీ, వెండికీ ఎలాంటి సంబంధం లేదు. కానీ వెండి మెరుపుతోనే, రంగుతోనే వస్తుంది. పూజా సామగ్రి జర్మన్ సిల్వర్‌తో అధికంగానే తయారవుతున్నాయి. వెండి కొనలేని వారి కోసమే పేదవారి వెండిగా జర్మన్ సిల్వర్ అందుబాటులోకి వచ్చింది. ఇప్పుడు అదే విపరీతమైన పాపులారిటీని తెచ్చుకుంది. ఎందుకంటే బంగారంతో పోటీ పడుతూ వెండి పరుగులు తీస్తోంది. ఇలాంటి సమయంలో వేడుకలకు జర్మన్ సిల్వర్ ప్లేట్లు, పూజా సామగ్రి వాడుతున్న వారి సంఖ్య అధికంగా ఉంది. అంతేకాదు ఎవరికైనా బహుమతులు ఇచ్చేందుకు కూడా జర్మన్ సిల్వర్ అందుబాటు ధరల్లో ఉంటున్నాయి.

24
జర్మన్ సిల్వర్ ఎలా తయారు చేస్తారు?

జర్మన్ సిల్వర్లో వెండి ఒక్క శాతం కూడా ఉండదు. పూర్తిగా కాపర్, నికిల్, జింక్ వంటి లోహాలను కలిపి చేస్తారు. కానీ ఇది వెండిలాగా మెరుస్తూ ఉంటుంది. అందుకే దీన్ని సిల్వర్ అనే పేరుతోనే పిలుస్తారు. అయితే దీన్ని తొలిసారి అభివృద్ధి చేసింది జర్మనీలో. అందుకే దీనికి జర్మన్ సిల్వర్ అనే పేరు వచ్చింది. కొంత మంది నికెల్ సిల్వర్ అని కూడా పిలుచుకుంటూ ఉంటారు. వెండి ధరలు విపరీతంగా పెరుగుతున్న కాలంలో ఇప్పుడు జర్మన్ సిల్వర్ కి అభిమానులు ఎక్కువైపోయారు. ఇది తక్కువ ధరకే రావడం, వెండిలాగే కనపించడంతో జర్మన్ సిల్వర్ వస్తువులను ఎక్కువగా పెళ్లిళ్లలో వాడుతున్నారు.

34
జర్మన్ సిల్వర్ ధర ఎంత?

వెండితో చేసిన వస్తువులు ఇప్పుడు కొనాలంటే చాలా కష్టం. కేజీ వెండి రెండు లక్షల రూపాయల వరకు చేరుకుంటుంది. రెండు లక్షల రూపాయలతో వచ్చే వెండి వస్తువు జర్మన్ సిల్వర్లో కేవలం 15 వేల రూపాయల్లోనే లభిస్తుంది. పైగా వెండిలాగే మెరుస్తూ ఉంటుంది. చూసేందుకు చాలా అందంగా ఉంటుంది. అందుకే పేద, మధ్యతరగతి వారు జర్మన్ సిల్వర్ వైపే ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. అయితే దీనిలో కూడా క్వాలిటీ అనేది చాలా ముఖ్యం. మంచి క్వాలిటీ ఉన్న జర్మన్ సిల్వర్ కేజీ రూ. 6,000 వరకు ఉంటుంది. అదే చీప్ క్వాలిటీ అయితే రూ.1500 రూపాయల వరకు దొరుకుతుంది. జర్మన్ సిల్వర్ దుకాణాలకు వెళ్లే సంఖ్య ఇప్పుడు విపరీతంగా పెరిగిపోయింది. డెకరేటివ్ వస్తువులు, జువెలరీ, పూజా సామగ్రి, రిటర్న్ బహుమతులు కొనే వారి సంఖ్య అధికంగా ఉంది.

44
ఈ గిన్నెల్లో తినకూడదు

చూసేందుకు వెండికి, జర్మన్ సిల్వర్ కు పెద్దగా తేడా కనిపించదు. జర్మన్ సిల్వర్ వస్తువులపై ఏదైనా పదునైన లోహంతో గీస్తేనే దాని రంగు బయట పడుతుంది. అంతవరకు దాన్ని వెండి గానే అందరూ అనుకుంటారు. కాకపోతే వెండి వస్తువులకు రీసేల్ ఉంటుంది. జర్మన్ సిల్వర్ కి మాత్రం ఎలాంటి రీసేల్ ఉండదు. వాడినంత కాలం వాడిన తర్వాత పడేయడమే దానివల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు. దాన్ని అమ్మినా కూడా కొనేవారు ఎవరూ ఉండరు. మిడిల్ క్లాస్ వెండిగానే చెప్పుకోవచ్చు. జర్మన్ సిల్వర్ పాత్రలలో మాత్రం ఎలాంటి ఆహారాలు తినడం మంచిది కాదు. దీనిలో నికెల్ ఉంటుంది. నికెల్ చర్మ ఆరోగ్యానికి హానికరం. అలాగే నికెల్ వల్ల ఎంతో మందికి అలెర్జీలు కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి జర్మన్ సిల్వర్ గిన్నెలలో ఆహారం పెట్టుకుని తినడం వంటి పనులు చేయకపోవడమే మంచిది. కేవలం డెకరేటివ్, గిఫ్టింగ్, జువెలరీ వంటి వాటికే పరిమితం చేయడం ఉత్తమం. ఇప్పుడు జర్మన్ సిల్వర్ తో ఎక్కువగా ట్రైబల్ జ్యువెలరీ తయారవుతుంది. మధ్య మధ్యలో నలుపు కనిపిస్తూ ఉన్నా ఈ జువెలరీ చూసేందుకు కూడా మంచి యాంటిక్ లుక్‌ను ఇస్తుంది.

Read more Photos on
click me!

Recommended Stories