మీరు క్రిప్టో కరెన్సీ నుండి డబ్బు సంపాదిస్తున్నారా.. అయితే ప్రభుత్వ ప్రణాళిక ఏంటో తెలుసుకోండి

First Published Nov 10, 2021, 6:10 PM IST

మీరు బిట్‌కాయిన్, ఎథెరియం లేదా టెథర్‌తో సహా ఇతర క్రిప్టో కరెన్సీ ద్వారా కూడా డబ్బు సంపాదిస్తున్నరా.. అయితే  ఈ వార్త మీకోసమే. డిజిటల్ కరెన్సీ(digital currency) ద్వారా డబ్బు సంపాదించే వారు ఇప్పుడు పన్ను చెల్లించాల్సి ఉంటుంది.

రెవిన్యూ సెక్రటరీ తరుణ్ బజాజ్ ఈ మేరకు సూచనలు చేశారు. దేశంలో క్రిప్టోకరెన్సీలు నియంత్రత ఉన్న లేకపోయినా దాని ద్వారా వచ్చే ఆదాయాలపై పన్ను విధించాలని బజాజ్ ఒక టీవీ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్నారు.

క్రిప్టోకరెన్సీల నుండి డబ్బు సంపాదించినప్పుడు ప్రజలు పన్నులు చెల్లించేలా చూసేందుకు మంత్రిత్వ శాఖ ఒక విధమైన ఆలోచనతో పనిచేస్తోందని రెవెన్యూ కార్యదర్శి బజాజ్ సూచించారు. మీరు క్రిప్టోకరెన్సీలలో లాభం పొందినట్లయితే, మీరు నిర్దిష్ట ఒప్పందం నుండి డబ్బు సంపాదిస్తే భారత ప్రభుత్వం దాని నుండి పన్ను వసూలు చేయాలనుకుంటున్నట్లు రెవెన్యూ కార్యదర్శి చెప్పారు. ఇది చట్టబద్ధంగా చెల్లుబాటు అవుతుందా లేదా అనేది  పక్కన పెడితే మా పన్ను ఆదాయం కావాలి అని అన్నారు.

శీతాకాల సమావేశాల్లో బిల్లు ప్రవేశపెట్టే అవకాశం
అయితే క్రిప్టోకరెన్సీలకు సంబంధించి ఆర్థిక మంత్రిత్వ శాఖ ఎలాంటి నిర్దిష్ట చర్యలు తీసుకోబోతుందో రెవెన్యూ కార్యదర్శి పేర్కొనలేదు. మూలాధారాలను విశ్వసిస్తే పార్లమెంటు శీతాకాల సమావేశాల ప్రారంభంలో ప్రభుత్వం క్రిప్టోకరెన్సీకి సంబంధించిన బిల్లును ప్రవేశపెట్టవచ్చు. క్రిప్టోకరెన్సీ బిల్లు  పాత ముసాయిదా దానిని నిషేధించడం గురించి పేర్కొంది అయితే మంత్రిత్వ శాఖ ఇప్పుడు బిల్లును సవరించడాన్ని పరిశీలిస్తోంది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కూడా క్రిప్టోకరెన్సీలపై పూర్తి నిషేధాన్ని పరిగణించడం లేదని, అయితే ఈ  డిజిటల్ కరెన్సీల పట్ల ప్రభుత్వం జాగ్రత్తగా వ్యవహరిస్తుందని ఒక ప్రకటనలో తెలిపారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీని ప్రారంభించవచ్చని కూడా ఆయన సూచించారు.
 

బిట్‌కాయిన్ అత్యంత ప్రజాదరణ పొందిన క్రిప్టో కరెన్సీ
క్రిప్టోకరెన్సీ అనేది వర్చువల్ కరెన్సీ అయితే సాధారణ కరెన్సీలా చూడడం లేదా తాకడం సాధ్యం కాదు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చలామణిలో ఉన్న అన్ని క్రిప్టోకరెన్సీలలో బిట్‌కాయిన్ అత్యంత ప్రజాదరణ పొందినది. దీనిని 2008లో సతోషి నకమోటో రూపొందించారు. అయితే, దీని చలామణి 2009 సంవత్సరంలో ప్రారంభమైంది. మార్కెట్‌లోకి వచ్చినప్పటి నుంచి వీటి ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. మంగళవారం, ఈ క్రిప్టో కరెన్సీ ధర దాని ఆల్-టైమ్ గరిష్ట స్థాయి $ 67,800ని దాటింది. 
 

click me!