నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్: 112 పాయింట్లు పడిపోయిన సెన్సెక్స్, రెడ్ మార్క్‌లో నిఫ్టీ..

First Published Nov 9, 2021, 6:11 PM IST

నేడు  మంగళవారం దేశీయ స్టాక్ మార్కెట్ (stock marrket) నష్టాలతో ముగిసింది. ఉదయం నుండి రోజంతా ట్రేడింగ్ ఒడిదుడుకుల తర్వాత 30 షేర్ల బిఎస్‌ఇ సెన్సెక్స్ (sensex)112.16 పాయింట్లు (0.19 శాతం) క్షీణించి 60433.45 వద్ద ముగిసింది. దీనితో పాటు ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ(nifty) కూడా  24.30 పాయింట్లు (0.13 శాతం) పడిపోయి 18844 స్థాయి వద్ద ముగిసింది. 

నేటి ట్రేడింగ్‌లో ఎఫ్‌ఎంసిజి, మెటల్స్ షేర్లు ఒత్తిడిలో ఉండగా, మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ సూచీలు అర శాతం చొప్పున పెరిగాయి. ఉదయం ట్రేడింగ్ ప్రారంభంలో సెన్సెక్స్ నష్టాలలో  ప్రారంభమైంది, నిఫ్టీ కూడా స్వల్ప లాభాలతో ప్రారంభమైంది. ఆరంభంలో సానుకూలంగా ప్రారంభమైన సూచీలు  కాసేపటికే నష్టాల్లోకి జారుకున్నాయి. అంతర్జాతీయ మిశ్రమ సంకేతాలతో దేశీయ స్టాక్​ మార్కెట్లు నష్టాల్లోనే ముగిశాయి. ముఖ్యంగా హెచ్‌డీఎఫ్‌సీ జంట షేర్లు, బజాజ్ ఫినాన్స్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, వంటి భారీ కంపెనీ షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తడం సూచీల సెంటిమెంటును దెబ్బ తీసింది. నేడు సుమారు 1958 షేర్ల విలువ పెరిగితే, 1269 షేర్ల విలువ క్షీణించాయి, 162 షేర్లు విలువ మారలేదు.

నిన్న వారంలోని మొదటిరోజు సోమవారం స్టాక్ మార్కెట్ లాభాలతో ముగిసింది.బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ సెన్సెక్స్ చివరి ట్రేడింగ్ సెషన్‌లో అంటే సోమవారం 478 పాయింట్లు (0.80 శాతం) లాభంతో 60,545 వద్ద ముగిసింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ కూడా 18,068 వద్ద ముగిసింది. నిఫ్టీ 151 పాయింట్లు (80 శాతం) లాభపడింది. ఇండస్‌ఇండ్ బ్యాంక్ షేర్లు సోమవారం అత్యధికంగా నష్టపోయాయి.  

సానుకూలంగా ప్రారంభమైన షేర్ మార్కెట్
మంగళవారం మిశ్రమ ప్రపంచ సూచనల మధ్య భారతీయ స్టాక్ మార్కెట్ ఈ రోజు ఉదయం సానుకూలంగా ప్రారంభమైంది. బి‌ఎస్‌ఈ సెన్సెక్స్ నిన్నటి  ట్రేడింగ్ ముగింపుతో పోలిస్తే 45.68 పాయింట్లు (0.08 శాతం) క్షీణించి 60499.93 వద్ద ప్రారంభమైంది. అలాగే ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ కూడా 0.50 పాయింట్ల స్వల్ప లాభంతో 18069 వద్ద ప్రారంభమైంది. రోజులో సెన్సెక్స్ గరిష్టంగా 60,670 వద్దకు ఎగిసి, కనిష్ట స్థాయి 60,213కి చేరుకుంది. మరోవైపు, నిఫ్టీ రోజులో 18,112 గరిష్ట స్థాయికి చేరుకుంది. నేడు డాలరుతో రూపాయి మారకం విలువ రూ.74.01 వద్ద ఉంది. 
 

సెన్సెక్స్ 30  స్టాక్స్ లో 14 లాభాలతో ముగిసాయి 
సెన్సెక్స్ 30 షేర్లలో  14 స్టాక్స్ పెరిగింది. వీటిలో ఇండస్‌ఇండ్ బ్యాంక్, మహీంద్రా అండ్ మహీంద్రా, ఎయిర్‌టెల్ ఇతర ఉన్నాయి. క్షీణించిన స్టాక్స్ గురించి మాట్లాడితే  వీటిలో మారుతీ, బజాజ్ ఫైనాన్స్, టైటాన్, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ మరియు కోటక్ మహీంద్రా బ్యాంక్, టైటాన్ ఉన్నాయి.  

నిఫ్టీలో సగం షేర్లు లాభపడగా
నిఫ్టీకి చెందిన 50 స్టాక్స్  లో సగం నష్టాల్లో ఉండగా అంటే  25 స్టాక్స్ లాభాల్లో ఉండగా 25 స్టాక్స్ క్షీణించాయి. బ్రిటానియా, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, హెచ్‌డిఎఫ్‌సి, ఎన్‌టిపిసి, బజాజ్ ఫైనాన్స్ షేర్లు పతనమైయ్యాయి. టాటా మోటార్స్, హీరో మోటో కార్ప్, ఎస్‌బీఐ షేర్లు లాభాల్లో ఉన్నాయి. ఆటో, క్యాపిటల్ గూడ్స్ సూచీలు ఒక్కొక్కటి 1 శాతం పెరిగితే మెటల్, బ్యాంకింగ్ షేర్లు ఒత్తిడిలో ఉన్నాయి. 

click me!