బ్యాంక్ ఖాతాదారులకు అలెర్ట్.. సేవింగ్స్ ఖాతాపై వడ్డీ రేట్లు తగ్గింపు..

Ashok Kumar   | Asianet News
Published : Nov 10, 2021, 01:00 PM ISTUpdated : Nov 11, 2021, 12:38 PM IST

మీకు పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB)లో సేవింగ్స్ ఖాతా ఉంటే ఈ వార్త మీకోసమే. ఎందుకంటే బ్యాంకు పొదుపు ఖాతా(savings account)లపై వడ్డీని మార్చింది. ఇప్పుడు మీరు డిపాజిట్(deposits) చేసిన మొత్తంపై తక్కువ వడ్డీని పొందుతారు.

PREV
14
బ్యాంక్ ఖాతాదారులకు అలెర్ట్..  సేవింగ్స్ ఖాతాపై వడ్డీ రేట్లు తగ్గింపు..

 ఇప్పుడు ఖాతాదారులకు షాక్ ఇస్తూ పంజాబ్ నేషనల్ బ్యాంక్  రూ. 10 లక్షల లోపు పొదుపు ఖాతాపై వార్షిక వడ్డీ రేటును కేవలం 2.80 శాతానికి తగ్గించింది. సేవింగ్స్ ఖాతా డిపాజిట్లపై వడ్డీ రేటు వచ్చే నెల నుండి అంటే 1 డిసెంబర్ 2021 నుండి తగ్గించబడుతుంది. ఇప్పటి వరకు వార్షిక వడ్డీ రేట్లు 2.90 శాతంగా ఉంది. 
 

24

 పంజాబ్ నేషనల్ బ్యాంక్ ప్రకారం 1 డిసెంబర్ 2021 నుండి సేవింగ్స్ ఖాతాలోని రూ. 10 లక్షల కంటే తక్కువ మొత్తానికి వడ్డీ రేటు సంవత్సరానికి 2.80 శాతంగా ఉంటుంది. దీంతో పాటు రూ.10 లక్షలు ఆపైన వడ్డీ రేటును ఏడాదికి 2.85 శాతంగా నిర్ణయించారు. ఇంతకుముందు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బిఐ) కూడా పొదుపు ఖాతాలపై వడ్డీ రేట్లను తగ్గించడం గమనార్హం. ఎస్‌బి‌ఐ 1 లక్ష వరకు పొదుపు ఖాతాలపై 2.70 శాతం వార్షిక వడ్డీని ఇస్తుంది. బ్యాంక్  ఈ నిర్ణయం కొత్త, పాత కస్టమర్లతో పాటు ఎన్‌ఆర్‌ఐ కస్టమర్లను ప్రభావితం చేస్తుంది. 
 

34

ఇల్లు, విద్య లేదా కారు రుణాలు తీసుకునేవారికి ఉపశమనం 
ఒకవైపు పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఖాతాదారులను అలెర్ట్ చేస్తూనే మరోవైపు, ఈ బ్యాంకు నుండి గృహ రుణాలు, కారు రుణాలు, విద్యా రుణాలు, వ్యక్తిగత రుణాలు తీసుకునే వారికి శుభవార్త. బ్యాంక్  బెంచ్ మార్క్ లెండింగ్ రేటును 5 బేసిస్ పాయింట్లు తగ్గించి 6.50 శాతానికి ప్రకటించింది.

44

రెపో లింక్డ్ లెండింగ్ రేటు (ఆర్‌ఎల్‌ఎల్‌ఆర్) 6.55 శాతం నుంచి 6.50 శాతానికి తగ్గింపు నవంబర్ 8 నుంచి అమల్లోకి వచ్చింది. ఈ తగ్గింపు గృహ రుణాలు, కారు రుణాలు, విద్యా రుణాలు, వ్యక్తిగత రుణాలతో సహా అన్ని రుణాలను చౌకగా చేస్తుంది. 

click me!

Recommended Stories