Phonepe: ఇక‌పై ఫోన్‌పేలో త‌ప్పుడు ట్రాన్సాక్ష‌న్స్ జ‌ర‌గ‌వు.. ఎలాగో తెలుసా.?

Published : May 28, 2025, 11:02 AM ISTUpdated : May 28, 2025, 11:11 AM IST

దేశంలో డిజిట‌ల్ పేమెంట్స్ రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. ఇందుకు అనుగుణంగానే నేష‌న‌ల్ పేమెంట్స్ కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియా కూడా యూజ‌ర్ల అవ‌స‌రాల‌కు అనుగుణంగా మార్పులు చేస్తోంది.

PREV
15
యూపీఐలో కొత్త మార్పు

డిజిటల్ చెల్లింపుల్లో ముందున్న దేశాల్లో భారత్ ఒకటి. రోజు రోజుకూ యూపీఐ వాడకం పెరుగుతోంది. ముఖ్యంగా క్షణాల్లో డబ్బు పంపించగలిగే అవ‌కాశం అంద‌రి ఆక‌ట్టుకునేలా చేస్తోంది. అయితే యూపీఐ పేమెంట్స్ చేసే స‌మ‌యంలో కొన్ని సంద‌ర్భాల్లో త‌ప్పుడు ట్రాన్సాక్ష‌న్స్ జ‌రుగుతాయ‌న్న విష‌యం తెలిసిందే.

ఒక్క నెంబ‌ర్ మారినా వేరే వారి ఖాతాల్లోకి డ‌బ్బులు వెళ్తుంటాయి. ఈ నేపథ్యంలో నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) ఒక కొత్త నియమాన్ని తీసుకొస్తోంది, ఇది తప్పుడు లావాదేవీలను నివారించడంలో కీలకంగా మారనుంది.

25
చెల్లింపులకు ముందు అల‌ర్ట్ చేస్తుంది:

ఇప్పటి వరకూ యూపీఐ లావాదేవీల్లో ఫోన్‌లో సేవ్ చేసిన పేరు ఆధారంగా డబ్బు పంపేవాళ్లం. కానీ కొత్త నిబంధన ప్రకారం, డబ్బు పంపే సమయంలో లావాదేవీ స్క్రీన్‌పై ఖాతాదారుడి అసలైన పేరు కనిపిస్తుంది. ఈ పేరు బ్యాంకు కోర్ బ్యాంకింగ్ సిస్టమ్ (CBS) ఆధారంగా కనిపిస్తుంది. అంటే స‌ద‌రు వ్య‌క్తి బ్యాంకు అకౌంట్ ఏ పేరుతో ఉందో అదే పేరు క‌నిపిస్తుంది. దీంతో మనం ఎవరికీ డబ్బు పంపిస్తున్నామో గుర్తించడం సులభం అవుతుంది. ఫలితంగా త‌ప్పుడు లావాదేవీలు త‌గ్గుతాయి.

35
ఇది ఎవరికి వర్తిస్తుంది?

ఈ మార్పు ప్రధానంగా P2P (Peer to Peer), P2PM (Peer to Peer Merchant) లావాదేవీలకు వర్తిస్తుంది. అంటే వ్యక్తి నుంచి వ్యక్తికి లేదా వ్యక్తి నుంచి చిన్న వ్యాపారానికి జరిగే చెల్లింపుల్లో ఈ రూల్ అమల్లోకి వస్తుంది. ఇది వినియోగదారుడు ఎలాంటి సందేహం లేకుండా, సరైన ఖాతాదారుడికి మాత్రమే డబ్బు పంపేలా సహాయపడుతుంది.

45
ఎప్ప‌టి నుంచి అమ‌ల్లోకి రానుంది.?

NPCI ప్రకటించిన ఈ కొత్త నియమం జూన్ 30, 2025 నుండి దేశవ్యాప్తంగా అమలులోకి వస్తుంది. Google Pay, PhonePe, Paytm, BHIM వంటి అన్ని ప్రముఖ UPI యాప్‌లు ఈ మార్పును పాటించాల్సి ఉంటుంది. వినియోగదారుల భద్రత, విశ్వసనీయత దృష్ట్యా ఈ మార్పు కీలకమని నిపుణులు చెబుతున్నారు.

55
అయినా పొర‌పాటు జ‌రిగితే ఏం చేయాలి.?

ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా, కొన్ని సందర్భాల్లో పొరపాటు జరుగవచ్చు. ఇలాంటి సమయంలో ముందుగా డబ్బు పొరపాటుగా వెళ్లిన వ్యక్తిని సంప్రదించాలి. స్పందన లేకుంటే వెంటనే మీ బ్యాంకుకు ఫిర్యాదు చేయాలి. అంతేకాకుండా, NPCI హెల్ప్‌లైన్ 1800-120-1740కు కాల్ చేయవచ్చు లేదా NPCI అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఫిర్యాదు నమోదు చేయవచ్చు.

Read more Photos on
click me!

Recommended Stories