Gold Price Fall: పసిడి ప్రియులకు బిగ్ సర్ ప్రైజ్. ఈ మధ్య నెమ్మదిగా పెరుగుతూ వచ్చిన బంగారం ధరలు....ఇవాళ ఢామ్మని కిందకు పడిపోయింది. ఈసారి వందల్లో కాదు. వేలల్లో కుప్పకూలిపోయింది. మరి కొనడం ఇప్పుడు మంచిదేనా? ఇంకా ఆగాలా? హైదారబాద్‍లో బంగారం ఎంతో తెలుసా?
బంగారం ధరలు మరోసారి భారీగా కుప్పకూలిపోయింది. వరుసగా మూడో రోజు కూడా గోల్డ్ రేట్లు పడిపోవడంతో కొనుగోలుదారుల్లో భారీ ఊరట పెరిగింది. గత నెల రోజులుగా రికార్డు స్థాయిలో పరుగులు పెట్టిన పసిడి ధరలు ఇప్పుడు ఒక్కసారిగా బ్రేక్ వేయడంతో మార్కెట్‌లో చర్చ మొదలైంది. ముఖ్యంగా పెళ్లిళ్లు, శుభకార్యాల కోసం బంగారం కొనాలని ఎదురుచూస్తున్న వారికి ఈ తగ్గుదల బిగ్ రిలీఫ్ ఇచ్చింది.
24
పూర్తిగా పడిపోయిన వెండి
హైదరాబాద్, విజయవాడ మార్కెట్లలో 24 క్యారెట్ల 10 గ్రాములపై రూ.2,230 తగ్గి రూ.1,56,060కు చేరుకుంది. 22 క్యారెట్ల గోల్డ్ ధరపై రూ.2,050 కూడా గణనీయంగా తగ్గి రూ.1,43,050 వద్ద ట్రేడవుతోంది. బంగారమే కాదు ఈరోజు వెండి కూడా భారీ షాక్ ఇచ్చింది. కిలో వెండి ధరపై దాదాపు రూ.15 వేల వరకు పతనమై రూ.2.75లతో కొనసాగుతోంది. ఇటీవల వరుస పెరుగుదలతో భయపడిన కొనుగోలు దారులు ఇప్పుడు మార్కెట్‌పై మళ్లీ దృష్టి పెడుతున్నారు.
34
గోల్డ్, సిల్వర్‌పై ఒత్తిడి పెరిగి క్షీణించిన ధరలు
ఇరాన్‌పై అమెరికా తాజా సైనిక చర్యల తర్వాత ప్రపంచ మార్కెట్లు ఒక్కసారిగా తగ్గుముఖం పడుతున్నాయి. అదే సమయంలో డాలర్ బలపడటంతో పెట్టుబడులు అటు వైపు దృష్టి మళ్లింది. ఫలితంగా గోల్డ్, సిల్వర్‌పై ఒత్తిడి పెరిగి ధరలు క్షీణించాయి. డాలర్ ఇండెక్స్ బలపడటం వల్ల అంతర్జాతీయంగా గోల్డ్ కొనుగోలు ఖరీదుగా మారింది.
మరోవైపు మార్కెట్ నిపుణులు మాత్రం ఈ పతనాన్ని తాత్కాలికమే అంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఇంకా భౌగోళిక ఉద్రిక్తతలు పూర్తిగా తగ్గలేదు. కేంద్ర బ్యాంకులు సైతం బంగారం నిల్వలు పెంచడం వంటి కారణాలతో రాబోయే రోజుల్లో మళ్లీ గోల్డ్ రేట్లు ఎగిసే అవకాశం ఉందని చెబుతున్నారు. అందుకే ఇప్పుడు కొనుగోలు చేయాలా.. లేక ఇంకొన్ని రోజులు వేచి చూడాలా అన్న దానిపై ఇన్వెస్టర్లు సందిగ్ధంలో ఉన్నారు.