Mobile Price: మొబైల్ ధరల్లో భారీ తగ్గింపు, కొనేందుకు కొన్ని రోజులు ఆగండి

Published : Feb 02, 2026, 05:50 PM IST

Mobile Price: మంచి ఫోన్ కొనాలనుకుంటున్నారా? అయితే ఇప్పుడు కొనేందుకు ప్రయత్నించండి. బడ్జెట్ తరువాత ఆపిల్, సామ్ సంగ్ కంపెనీలకు చెందిన ఫోన్ ధరలు భారీగా తగ్గనున్నాయి. 

PREV
14
ఈ రెండు ఫోన్లపై భారీ తగ్గింపు

2026 బడ్జెట్‌లో స్మార్ట్‌ఫోన్ ప్రియులకు శుభవార్త వచ్చింది. ఎంతో మందికి యాపిల్ ఫోన్ అంటే ఇష్టం. కానీ దాని ధర చూసి భయపడిపోతారు. అలాగే మరొక విదేశీ ఫోన్ సామ్ సంగ్. ఇలా విదేశాల నుంచి వచ్చే వస్తువులపై  కస్టమ్స్ సుంకం 20 శాతం నుంచి 10శాతానికి తగ్గింది. దీంతో ఐఫోన్, శాంసంగ్ ఫోన్లు కొనేవారికి డబ్బు ఆదా అవుతుంది. కాబట్టి ఈ రెండు ఫోన్లు కొనేందుకు ఇదే మంచి సమయం

24
కస్టమ్స్ సుంకం తగ్గించడంతో

భారత్‌లో తయారయ్యే మొబైల్ విడిభాగాలపై కస్టమ్స్ సుంకం తగ్గించారు. PCBA, కెమెరా మాడ్యూల్, ఛార్జర్ భాగాలపై పన్ను రాయితీలు ప్రకటించారు. ఇది 'మేక్ ఇన్ ఇండియా'ను ప్రోత్సహించి, ఫోన్ల ధరలు తగ్గడానికి సాయపడుతుంది. కాబట్టి అన్ని రకాల ఫోన్లపై విపరీతంగా ధరలు తగ్గే అవకాశం ఉంది.

34
నచ్చిన ఫోన్ కొనుక్కోండి

ఆపిల్ ఐఫోన్ 16, 17 సిరీస్, శాంసంగ్ గెలాక్సీ ఎస్25 అల్ట్రా వంటి ప్రీమియం ఫోన్లంటే ఎంతో ఇష్టం. కానీ ధరలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి కొనరు. ఇప్పుడు ధరలు తగ్గే అవకాశం ఉంది. ముఖ్యంగా విదేశాల నుంచి దిగుమతి అయ్యే హై-ఎండ్ మోడళ్ల ధరలు బాగా తగ్గుతాయి.

44
కొన్ని వారాలు ఆగండి

విడిభాగాలపై పన్ను తగ్గింపుతో, భారత్‌లో తయారయ్యే బడ్జెట్, మిడ్-రేంజ్ స్మార్ట్‌ఫోన్‌ల ధరలు కూడా తగ్గుతాయి. షియోమీ, వివో, ఒప్పో వంటి కంపెనీలు ఈ ప్రయోజనాన్ని అందిస్తే, తక్కువ ధరకే మంచి ఫోన్లు అందుబాటులోకి వస్తాయి. పన్ను తగ్గింపు ప్రకటించిన వెంటనే ధరలు తగ్గవు. కొత్త పన్ను రేట్లతో దిగుమతి అయిన కొత్త స్టాక్ మార్కెట్‌లోకి వచ్చినప్పుడే ధరల తగ్గుదల అమలవుతుంది. కాబట్టి, కొత్త ఫోన్ కొనాలనుకుంటే కొన్ని వారాలు ఆగడం మంచిది.

Read more Photos on
click me!

Recommended Stories