Post Office: పోస్ట్ ఆఫీస్ రికరింగ్ డిపాజిట్ పథకం సామాన్యులకు ఒక వరం. రోజుకు రూ. 200 ఆదా చేస్తూ, పదేళ్లలో రూ. 10 లక్షలు సంపాదించవచ్చు. ఈ పథకం 6.7 శాతం వడ్డీని అందిస్తూ, బ్యాంకుల కంటే ఎక్కువ భద్రతను కల్పిస్తుంది. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం..
పోస్ట్ ఆఫీస్ రికరింగ్ డిపాజిట్ పథకం సామాన్యులకు ఆర్థిక భద్రతను అందిస్తూ పదేళ్లలో రూ. 10 లక్షల వరకు సంపాదించే అవకాశాన్ని కల్పిస్తుంది. ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల్లో, ముఖ్యంగా షేర్ మార్కెట్ లాంటి రిస్క్‌తో కూడిన పెట్టుబడులకు దూరంగా ఉండాలనుకునే వారికి, పోస్ట్ ఆఫీస్ ఆర్డీ పథకం ఒక సురక్షితమైన, స్థిరమైన ప్రత్యామ్నాయంగా నిలుస్తుంది.
25
రోజుకు రూ. 200 చొప్పున ఆదా
ఈ పథకం ప్రకారం, రోజుకు రూ. 200 చొప్పున ఆదా చేస్తూ పోస్ట్ ఆఫీస్‌లో డిపాజిట్ చేయగలిగితే, పదేళ్ల తర్వాత రూ. 10 లక్షలకు పైగా పొందవచ్చు. రోజుకు రూ. 200 అంటే నెలకు రూ. 6 వేలు, సంవత్సరానికి రూ. 72 వేలు అవుతుంది. ఐదేళ్ల పాటు ఈ విధంగా డిపాజిట్ చేసినట్లయితే, సుమారు రూ. 4.28 లక్షలు అవుతుంది. ఈ మొత్తాన్ని ఎలాంటి అదనపు పెట్టుబడి లేకుండా మరో ఐదేళ్లకు పొడిగిస్తే, పదేళ్ల మెచ్యూరిటీ సమయానికి మొత్తం రూ. 10.25 లక్షలు అందుతుంది. ఈ పథకం సుమారు 6.7 శాతం వడ్డీ రేటును అందిస్తుంది. దీనికి ప్రతి మూడు నెలలకు ఒకసారి చక్రవడ్డీ వస్తుంది.
35
పోస్ట్ ఆఫీస్ డిపాజిట్లు..
పోస్ట్ ఆఫీస్ డిపాజిట్లు బ్యాంకుల కంటే ఎంతో సురక్షితమైనవి. బ్యాంకుల్లో ఐదు లక్షల రూపాయల వరకు మాత్రమే డిపాజిట్ ఇన్సూరెన్స్ ఉంటుంది. అంటే, ఒక బ్యాంకు నష్టపోయినా లేదా దివాళా తీసినా, మీరు ఐదు లక్షల రూపాయలకు మించి ఎంత డిపాజిట్ చేసినా, మీకు తిరిగి వచ్చేది గరిష్టంగా ఐదు లక్షలు మాత్రమే. కానీ పోస్ట్ ఆఫీసుల్లో, మీ డబ్బు ఎంత పెద్ద మొత్తమైనా సరే, ప్రభుత్వ హామీతో పూర్తి భద్రతతో ఉంటుంది. ఇది సామాన్యులు, మధ్య తరగతి వారికి మంచి ప్రయోజనం.
ఈ రికరింగ్ డిపాజిట్ ఖాతాను కేవలం రూ. 100తో తెరవవచ్చు. బ్యాంకు ఖాతాల్లో మాదిరిగా రూ. 5 వేలు లేదా రూ. 10 వేల కనీస బ్యాలెన్స్ అవసరం లేదు. కేవలం రూ. 1 కనీస బ్యాలెన్స్ ఉంచితే సరిపోతుంది. ఇది గ్రామీణ ప్రాంతాల ప్రజలకు, తక్కువ ఆదాయం ఉన్నవారికి కూడా అందుబాటులో ఉంటుంది. అంతేకాకుండా, ప్రతి రోజు పోస్ట్ ఆఫీస్‌కి వెళ్లి డబ్బు కట్టాల్సిన అవసరం లేదు. మీ బ్యాంక్ ఖాతా నుంచి రోజువారీ రూ. 200 ఆటోమేటిక్‌గా పోస్ట్ ఆఫీస్ ఆర్డీ ఖాతాకు వెళ్లేలా ఆన్‌లైన్ సిస్టమ్‌లో ఏర్పాటు చేసుకోవచ్చు. మీ బ్యాంకులో కనీసం రూ. 200 ఉండేలా చూసుకుంటే సరిపోతుంది.
55
డిపాజిట్‌ను రద్దు చేసుకునే అవకాశం
ఒకవేళ అత్యవసర పరిస్థితుల్లో డబ్బు అవసరమైతే, మూడేళ్ల తర్వాత ఈ డిపాజిట్‌ను రద్దు చేసుకునే అవకాశం కూడా ఉంది. అలా రద్దు చేసుకుంటే వచ్చే ప్రయోజనాలు తగ్గుతాయి కానీ, అప్పటివరకు జమ అయిన వడ్డీతో సహా మీ డబ్బు సురక్షితంగా మీకు తిరిగి అందుతుంది.