Cigarette Price Hike: ఒక్కో సిగరెట్‌పై ఎంత పెరిగిందో తెలుసా? జేబుకు చిల్లు పడిపోద్ది

Published : Feb 02, 2026, 12:48 PM IST

Cigarette Price Hike: సిగరెట్ తాగేవారికి  ఖర్చులు పెరిగిపోయే అవకాశం ఉంది.  బడ్జెట్ 2026 లో సిగరెట్ ధరలు పెంచుతున్నట్టు ప్రకటించారు. ఇంతకీ సిగరెట్ ధర ఎంత పెరిగిందో తెలిస్తే ఆశ్చర్యపోతారు. పొగతాగేవారికి జేబు చిల్లు పడే అవకాశం ఉంది.

PREV
14
సిగరెట్ ధరల పెంపు

బడ్జెట్ 2026 ప్రకారం సిగరెట్ ధరలు విపరీతంగా పెరిగిపోతుంది. ఫిబ్రవరి 1 నుంచి పెరిగిన సిగరెట్ ధరలు అమల్లోకి వస్తాయి. ఆ రోజు నుంచి కొత్త ఎక్సైజ్ డ్యూటీ, హెల్త్ సెస్ వంటివి కలుపుకుని సిగరెట్ ధరలు పెరిగిపోయాయి. కొత్త పన్నులు వల్ల సిగరెట్ ప్యాక్ రేటు పెరిగిపోతుంది. ఇప్పుడు సిగరెట్ ప్యాక్ వందరూపాయలు ఉంటే రూ.130 నుంచి రూ.140 వరకు పెరిగే అవకాశం ఉంది. అందువల్ల పొగ తాగేవారికి ఖర్చులు విపరీతంగా పెరిగిపోతాయి.

24
ఒక్కో సిగరెట్ ధర

పది సిగరెట్లు ఉన్న ప్యాకెట్ ధర రూ.30 నుంచి రూ.40 వరకు పెరిగింది. విల్స్ నేవీ కట్ (10 సిగరెట్లు) ధర రూ.95 నుంచి రూ.120కి చేరింది. గోల్డ్ ఫ్లేక్, విల్స్ క్లాసిక్ వంటి 84 మి.మీ సిగరెట్ల ప్యాకెట్ ధర రూ.225 వరకు పెరిగింది. దీంతో సిగరెట్ తాగేవారికి విపరీతమైన ఖర్చులు పెరిగిపోతాయి. వీరి జేబుకు చిల్లు పడినట్టే.

34
ప్రీమియం సిగరెట్లు

ఒక్కో సిగరెట్ ధర చూస్తే, 65 మి.మీ వరకు (ఫిల్టర్ లేనిది) రూ.2.5 పెరుగుతుంది. 65 మి.మీ వరకు (ఫిల్టర్ ఉన్నది) రూ.2.10 పెరుగుతుంది. 70-75 మి.మీ సిగరెట్ ధర రూ.5.40 పెరుగుతుంది. ప్రీమియం సిగరెట్లు రూ.8.50 వరకు పెరుగుతాయి. కాబట్టి సిగరెట్ల కోసం ఖర్చుపెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి.

44
సిగరెట్ ధరల పెంచాల్సిందే

సిగరెట్ తాగడం వల్ల తాగేవారికే కాదు… వారి చుట్టూ ఉన్నవారికి, ఆ పొగ పీల్చేవారికి కూడా చాలా హానికరం. అందుకే చాలామంది ధరల పెంపును స్వాగతించారు. అయితే ఈ ధరల పెంపు స్మగ్లింగ్, నకిలీ ఉత్పత్తులను ప్రోత్సహించవచ్చని పంపిణీదారులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి చాలా జాగ్రత్తగా సిగరెట్లను ఎంపిక చేసుకోవాలి.

Read more Photos on
click me!

Recommended Stories