Fake Rs500 Notes: చలామణిలో భారీగా నకిలీ 500 రూపాయల నోట్లు, జాగ్రత్తగా చూసి తీసుకోండి

Published : Oct 31, 2025, 12:13 PM IST

Fake Rs500 Notes: మనదేశంలో 2000 రూపాయల నోట్లను ఉపసంహరించుకున్న తర్వాత అతి పెద్ద నోటుగా 500 రూపాయల నోటు మాత్రమే మిగిలింది. అయితే ఇప్పుడు ఈ నోట్లు కూడా నకిలీవి భారీగా మార్కెట్లో చలామణి అవుతున్నాయి. 

PREV
15
నకిలీ రూ.500 నోట్లు

భారతదేశంలో చలామణిలో ఉన్న అతిపెద్ద నోటు 500 రూపాయలు. ఇంతకుముందు 2,000 రూపాయలు నోట్లు ఉండేవి. వాటిని ఉపసంహరించుకున్న తర్వాత 500 నోట్ల రూపాయలు మాత్రమే మిగిలాయి. అయితే ఇప్పుడు వీటి నకిలీ నోట్లను తయారుచేసి మార్కెట్లో భారీగా విడుదల చేస్తున్నారు. ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేస్తోంది. 500 రూపాయల నోట్లు నకిలీవి చలామణిలో పెరిగిపోతున్నట్టు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ కూడా షాకింగ్ సమాచారాన్ని బయటపెట్టింది.

25
ఎన్ని నకిలీ నోట్లు చలామణిలో?

కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆర్థిక వ్యవహారాల విభాగం విడుదల చేసిన డేటా ప్రకారం ప్రస్తుతం దేశంలో నకిలీ 500 రూపాయల నోట్లు భారీగానే చలామణిలో ఉన్నాయి. ప్రస్తుతం 1,77,722 నకిలీ నోట్లు చలామణిలో ఉన్నట్టు ప్రభుత్వం గుర్తించింది. ప్రతి ఏటా నకిలీ నోట్ల సంఖ్య ఇంకా పెరుగుతూ వస్తోంది.

35
రూ.2000 నోట్లు వదిలేసి..

ఎప్పుడైతే 2000 రూపాయల నోట్లను ఉపసంహరించుకున్నారో అప్పటి నుంచి నకిలీ 500 నోట్ల రూపాయలు పెరుగుదల ప్రారంభమైంది. నకిలీ నోట్లను సృష్టించే వ్యాపారులు.. చలామణిలో లేని 2000 నోట్ల రూపాయలను వదిలేసి 500 రూపాయల నోట్లపై దృష్టి సారించారు. దీంతో అవే ఇప్పుడు ఎక్కువగా మార్కెట్లో నకిలీవి చలామణి అవుతున్నాయి.

45
వందా, రెండు వందలను కూడా వదల్లేదు

కేవలం 500 రూపాయల నోట్లు మాత్రమే కాదు వంద రూపాయలు నోట్లను కూడా నకిలీవి తయారు చేస్తున్నారు. డేటా ప్రకారం 100 రూపాయల నోట్లు నకిలీవి ప్రస్తుతం 51,069 చలామణిలో ఉన్నాయి. ఇక రెండు వందల రూపాయల నోట్ల సంఖ్యకు వస్తే ప్రస్తుతం 32,660 చలామణిలో ఉన్నాయి. అన్ని నోట్లు కలుపుకుంటే 2,17,396 నకిలీ నోట్లు ప్రస్తుతం మార్కెట్లో చలామణిలో ఉన్నట్టు గుర్తించారు.

55
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చట్టం

నకిలీ నోట్లు చలామణిని అడ్డుకోవడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కృషి చేస్తూనే ఉంది. కరెన్సీ నోట్ల భద్రతా లక్షణాలను సమీక్షిస్తున్నట్టు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ కూడా చెబుతోంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చట్టం 1934లోని సెక్షన్ 25 ప్రకారం కరెన్సీ నోట్లు నకిలీల బారిన పడకుండా కొత్త డిజైన్లు, భద్రత ఫీచర్లతో ప్రవేశ పెడుతూనే ఉన్నారు. అయినా కూడా వ్యాపారులు నకిలీ నోట్లను సృష్టించి మార్కెట్లోకి విడుదల చేస్తున్నారు.

Read more Photos on
click me!

Recommended Stories