Business Ideas: హీరో నాగచైతన్య లాగే మీరు కూడా ఈ బిజినెస్ చేస్తే ప్రతి నెల లక్షల్లో ఆదాయం మీ సొంతం..

First Published Aug 18, 2022, 11:27 PM IST

ఉద్యోగం కోసం ఎదురు చూసి విసుగు చెందారా, అయితే సొంత వ్యాపారం కోసం ట్రై చేయండి, ఇందుకోసం మీరు చేయవలసిందల్లా ఒక్కటే సరైన ప్లానింగ్ తో ముందుకు వెళ్లడమే. ఈ రోజుల్లో ఫుడ్ బిజినెస్ మంచి ఊపులో ఉంది. ఫుడ్ బిజినెస్ అనగానే గుర్తొచ్చేది రెస్టారెంట్, హోటల్, బేకరీ వంటివి మాత్రమే. అయితే ప్రస్తుతం మారుతున్న మార్కెట్ ప్రకారం చూస్తుంటే క్లౌడ్ కిచెన్ అనేది చక్కటి పరిష్కారం. 

ఈ రోజుల్లో స్విగ్గీ, జొమాటో వంటి సర్వీసులు ఫుడ్ డెలివరీ చేస్తున్నాయి. వీటితో టైఅప్ అవడం ద్వారా ఈ క్లౌడ్ కిచెన్ లో మంచి ఆదాయం సంపాదించుకోవచ్చు. ముఖ్యంగా పట్టణాల్లో అయితే మీరు ఈ కాన్సెప్ట్ ద్వారా చక్కటి రిజల్ట్స్ పొందవచ్చు. ఎందుకంటే మీరు మంచి రెస్టారెంట్ స్టార్ట్ చేయాలి అనుకుంటే ముందుగా కావాల్సింది. మంచి సెంటర్, అలాగే రెస్టారెంట్ డిజైన్, కూర్చోడానికి డైనింగ్ హాల్, యాంబియన్స్ అన్నీ అవసరమే. కానీ వీటన్నింటికీ కలిపి ఖర్చు మాత్రం తడిసి మోపెడు అవుతుంది. హైదరాబాద్ లాంటి  మంచి సెంటర్లో రెస్టారెంట్ ఓపెన్ చేయాలంటే కనీసం రూ. 50లక్షల నుంచి రూ. 1 కోటి రూపాయలు ఖర్చు అవుతుంది. అయితే క్లౌడ్ కిచెన్ కు అంత అవసరం లేదు. 
 

ఇప్పటికే మెట్రో సిటీస్ లో క్లౌడ్ కిచెన్ కాన్సెప్ట్ క్లిక్ అయ్యింది. నాగచైతన్య లాంటి సూపర్ స్టార్ హీరోలు సైతం Shoyu పేరుతో క్లౌడ్ కిచెన్ స్టార్ట్ చేసి మంచి ఆదాయం సంపాదిస్తున్నారు. మీరు కూడా అలాంటి వ్యాపారం చాలా తక్కువ పెట్టుబడితో స్టార్ట్ చేయొచ్చు. క్లౌడ్ కిచెన్ కోసం మీరు చేయవలసిందల్లా ఒక్కటే. మంచి విశాలమైన కిచెన్ ఏర్పాటు చేసుకోవాలి. నగరంలో అన్ని ప్రాంతాలకు సులభంగా డెలివరీ చేసేలా ఉండాలి. 
 

ముందుగా మీరు వెయ్యి 1000 నుంచి 2000 చదరపు అడుగుల స్థలంలో కిచెన్ ఏర్పాటు చేసుకోవాలి. వాటర్, కరెంట్ సప్లై నిరంతరం ఉండేలా చూసుకోవాలి.అలాగే కిచెన్ ఏర్పాటు కోసం కావాల్సిన స్టౌలు, ఏర్పాటు చేసుకోవాలి. ఇక ముడి పదార్థాలు దాచుకునేందుకు ఒక గోడౌన్ గది తప్పనిసరి, అలాగే ఫైర్ యాక్సిడెంట్ జరగకుండా ఫైర్ సేఫ్టీ పరికరాలు కూడా ఏర్పాటు చేసుకోవాలి. ఇక కిచెన్ లో మీరు ఏ తరహా వంటకాలు చేయదలుచుకున్నారో ప్లాన్ చేసుకొని కిచెన్ డిజైన్ చేసుకోవాలి. ఉదాహరణకు చైనీస్, పంజాబీ, కాంటినెంటల్, సౌతిండియా ఇలా ఒక్కో వంటకు ఒక్కో స్టౌ ఉండేలా ఏర్పాటు చేసుకోవాలి.
 

ఇక అన్నింటికన్నా ముఖ్యమైనది, శుభ్రత, కిచెన్ లో వ్యర్థాలు ఎప్పటికప్పుడు తొలగించేలా క్లినింగ్ స్టాఫ్ ను ఏర్పాటు చేసుకోవాలి. ఎలాగో రెస్టారెంట్ లేదు కాబట్టి శుభ్రత విషయంలో ప్రత్యేక శ్రద్ద తీసుకోండి. ఇక ప్యాకేజింగ్ కోసం ప్రత్యేక విభాగం తప్పనిసరి, ఎందుకంటే క్లౌడ్ కిచెన్ పూర్తిగా ప్యాకింగ్ పైనే ఆధార పడి ఉంటుంది. అందుకే ముందుగానే ప్యాకింగ్ ఇండస్ట్రీతో ఒప్పందం కుదుర్చుకొని మీ బ్రాండ్ ప్యాకింగ్ పై కనిపించేలా డిజైన్ చేసుకోవాలి. ఉదాహరణకు డెలివరీ సందర్బంగా ఫుడ్ డిస్టర్బ్ కాకుండా ప్రత్యేకమైన ప్యాకింగ్ డిజైన్ చేయించుకుంటే మేలు. 
 

ఇక చివరిగా ఈ బిజినెస్ మోడల్ లో కావాలసింది డెలివరీ పార్ట్ నర్స్, ప్రస్తుతం మార్కెట్లో జొమాటో, స్విగ్గీ లాంటి ఫుడ్ డెలివరీ యాప్స్ అందుబాటులో ఉన్నాయి. అయితే ఇవి మాత్రమే కాకుండా మీరు సొంతంగా కూడా ఫుడ్ డెలివరీ చేసేలా డెలివరీ బాయ్స్ ను పెట్టుకోండి. అప్పుడు ఎక్కువ లాభం పొందే వీలుంది. అలాగే బస్టాండ్స్, రైల్వేస్టేషన్స్ వద్ద ఫుడ్ పార్సిళ్లను అందుబాటు ఉంచడం ద్వారా కూడా మంచి ఆదాయం పొందవచ్చు. 

click me!