Business Ideas: ఎకరం వ్యవసాయ భూమి ఉందా..అయితే రోజుకు రూ.15 వేలు సంపాదించే బిజినెస్ ప్లాన్ మీకోసం..

First Published Aug 18, 2022, 3:06 PM IST

గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి దొరకక చాలా మంది పట్టణాలకు వలస వెళ్తున్నారు. కానీ పట్టణాల్లో కూడా సరైన ఉద్యోగాలు లభించడం లేదు. దాంతో చాలా మంది పట్టణాల్లో ఇరుకు గదుల్లో చాలీ చాలని బతుకులు ఈడుస్తున్నారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. కాస్త వినూత్నంగా ఆలోచిస్తే ఉన్న ఊరిలోనే చక్కటి ఆదాయం సంపాదించుకునే వీలు కలుగుతుంది. ఇందుకోసం చేయాల్సింది నాటు కోడి గుడ్ల అమ్మకం. 

ఇక వ్యాపారం విషయానికి వస్తే ప్రస్తుతం ఆర్గానిక్ కోడిగుడ్లకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. ఈ కోడి గుడ్లనే నాటు కోడిగుడ్లు అని కూడా అంటారు. అంటే ఇందులో ఎలాంటి రసాయనాలు వాడరు. అయితే నాటు కోడిగుడ్ల ఉత్పత్తి చాలా తక్కువగా ఉంటుంది కదా అనే డౌట్ మీకు రావచ్చు. కానీ ఇందుకు సమాధానం సరైన పద్దతిలో నాటు కోళ్ల పెంపకం స్టార్ట్ చేస్తే నాటు కోడిగుడ్ల వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతుంది. 

మొదటగా మీరు చేయాల్సింది. మీ సమీప గ్రామాల్లోని రైతుల వద్ద నుంచి నాటు కోడి గుడ్లను సేకరించాలి.వాటిని ఇంక్యుబేటర్ లో పెట్టి పొదగడం ద్వారా పిల్లలు బయటకు వస్తాయి. సుమారు 5 వేల కోళ్ల కెపాసిటీతో ఒక ఎకరం విస్తీర్ణంలో నాటు కోళ్ళను పెంచవచ్చు. ముఖ్యంగా ఈ కోళ్ల పెంపకానికి కోళ్ల ఫారం అవసరం లేదు. ఒక షెడ్ నిర్మించుకుంటే చాలు. ఆరు బయట ప్రాంగణంలోనే స్వేచ్ఛగా ఈ కోళ్లను పెంచాలి. మొదటి దశలో కోడి గుడ్లను ఇంక్యుబేటర్ లో ఉంచి పొదగడం ద్వారా కోళ్ల సంఖ్యను పెంచుకోవాలి. 

ఒక రోజు వయస్సున్న నాటు కోడి పిల్ల 5 నెలల తర్వాత కోడి గుడ్లను పెడుతుంది. అయితే నాటు కోళ్లు లేయర్స్ కోడి తరహాలో ప్రతి రోజు గుడ్లను పెట్టవు. ప్రతి రెండు రోజులకు ఒక సారి గుడ్లను పెడతాయి. ఉదాహరణకు 3 వేల కోళ్లకు గానూ ప్రతి రోజు 1500 కోడి గుడ్ల దిగుబడిని సాధించవచ్చు. నాటు కోడి గుడ్ల ధర విషయానికి వస్తే ఒక్కో నాటు కోడి గుడ్డు బహిరంగా మార్కెట్లో రూ. 10 పలుకుతోంది. ఈ లెక్కన చూస్తే ప్రతి రోజు రూ.15 వేలు సంపాదించుకునే అవకాశం ఉంది. అలాగే కొన్ని కోళ్లను మాంసం కోసం కూడా విక్రయించవచ్చు. 

అలాగే కొన్ని గుడ్లను ఇంక్యుబేటర్ లో పొదడడం ద్వారా కోళ్ల సంఖ్య తగ్గకుండా కాపాడుకోవచ్చు. ఆరు బయట తిరగాడే పద్ధతిలో కోళ్లనుపెంచడం ద్వారా వీటికి జబ్బులు రావు. అలాగే కోళ్లు సహజ పద్దతిలో పెరుగుతాయి. వీటికి ఇమ్యూనిటీ ఎక్కువ. 
 

ఇక నాటు కోడిగుడ్లను మీరు డైరక్టుగా కస్టమర్లకు విక్రయించడం ద్వారా ఎక్కువగా లాభం పొందవచ్చు. ఇందుకోసం మీరు  టెక్నాలజీ ఉపయోగించుకోవాలి. మీ ఫారం సమీపంలోని కస్టమర్లకు డోర్ డెలివరీ చేయడం ద్వారా మీకు ఎక్కువ లాభం పొందుతారు. ఇక టోకు వ్యాపారులకు విక్రయిస్తే మీకు లాభం కాస్త తక్కువ అయినా సరుకు వేస్ట్ కాకుండా ఉంటుంది.  

click me!