Mukesh Ambani: ముకేష్ అంబానీ తన కూతురు కోసం అల్లుడికి కట్నంగా ఏం ఇచ్చారో తెలిస్తే నోట మాటరాదు..

First Published Aug 18, 2022, 1:30 PM IST

రిలయన్స్ అధినేత ముకేష్ అంబానీ తన కుటంబానికి అత్యంత విలువ ఇస్తాడు. ముఖ్యంగా అంబానీ లైఫ్ స్టైల్ గురించి నిత్యం వార్తల్లో నిలుస్తుంటారు. అంతేకాదు ముకేష్ సంతానం గురించి కూడా తరచూ వార్తలు వస్తుంటాయి. ముకేష్ తన గారాల కూతురు ఇషా అంబానీ కోసం నిర్మించిన ఇల్లు ఇప్పుడు వార్తల్లో నిలిచింది. 

ముఖేష్ అంబానీ ఒక్కగానొక్క కూతురు ఇషా అంబానీ ఇల్లు, ఒక రాజమహల్  అంటే ఆశ్చర్యం కలుగక మానదు. ఇది ప్రపంచంలోనే అత్యంత విలాసవంతమైన నివాసాల్లో ఒకటిగా నిలిచింది. 
 

నిజానికి అంబానీ కుటుంబానికి చెందిన 27-అంతస్తుల యాంటిలా మాన్షన్ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ప్రైవేట్ నివాసంగా పేరుపొందింది . ముఖేష్ అంబానీ, అతని ముగ్గురు పిల్లలు, అతని భార్య నీతా అంబానీ ఈ ఇంట్లో సకల సౌకర్యాలతో నివసిస్తున్నారు. 

ఇదిలా ఉంటే కూతురు ఇషా పెళ్లి 2018లో జరిగింది. ఇషా అంబానీ.. పెళ్లి తర్వాత ఏ ఇంట్లో నివసిస్తుందనేది ఆ రోజు చర్చనీయాంశమైంది. పెళ్లి తర్వాత ఇషా , ఆనంద్ పిరమల్ తమ నివాసం కోసం 'గులిటా' అనే ఇంటిని ఎంచుకున్నారు. ఇది విలాసానికి పర్యాయపదమని చెప్పవచ్చు. 
 

ముంబైలోని వర్లీలోని గులితా మాన్షన్ 100 మిలియన్ డాలర్ల వ్యయంతో నిర్మించారు, ఈ 50,000 చదరపు అడుగుల ఇల్లు అరేబియా సముద్రం కనిపించేలా నిర్మించారు. దీనికి సమీపంలోనే వర్లీ సీ లింక్ కనిపిస్తుంది. 450 కోట్ల రూపాయలకు పైగా వెచ్చించి ఈ 'గులిటా'  భారీ భవంతిని కొనుగోలు చేసి ముకేష్ అంబానీ తన అల్లుడికి గిఫ్ట్ గా ఇఛ్చాడు.

అరేబియా సముద్రానికి ఎదురుగా ఉన్న ఈ ఇల్లు అందమైన సీవ్యూ అనుభూతిని అందిస్తుంది. ఈ భవనం 'డైమండ్' థీమ్‌తో నిర్మించారు. ప్రస్తుత ప్రాపర్టీ మార్కెట్ ట్రెండ్‌లను పరిగణనలోకి తీసుకుంటే, ఈ రకమైన ఆస్తి యొక్క ప్రస్తుత మార్కెట్ విలువ సుమారు రూ. 1100 కోట్లు. ఐదంతస్తుల భవనంలో మెరుస్తున్న గాజు గోడలు ఉన్నాయి. 

ఇంట్లో స్విమ్మింగ్ పూల్, విశాలమైన తోట ఉన్నాయి. ప్రార్థన కోసం ఆలయాన్ని సిద్ధం చేశారు. నేలమాళిగలో మూడు ఫ్లోర్ల పార్కింగ్ ఉంది. గతంలో హిందుస్థాన్ యూనిలీవర్ యాజమాన్యంలోని లండన్‌కు చెందిన ఇంజినీరింగ్ సంస్థ ఎకర్స్ లీ ఓ కల్లాఘన్ 3D మోడలింగ్ సాధనాల శ్రేణిని ఉపయోగించి భవనాన్ని రూపొందించింది.

click me!