Recover Forgotten Passwords Easily: పాస్‌వర్డ్స్‌ మర్చిపోయారా? ఈ సింపుల్ టిప్ తో కనిపెట్టండి

Published : Jan 31, 2025, 05:00 PM IST

Recover Forgotten Passwords Easily: మీరు తరచూ పాస్ వర్డ్స్ మర్చిపోతుంటారా? ఈ చిన్న టిప్ తో మర్చిపోయిన పాస్ వర్డ్స్ ఈజీగా తెలుసుకోవచ్చు. అదెలాగో తెలుసుకుందాం రండి. 

PREV
15
Recover Forgotten Passwords Easily: పాస్‌వర్డ్స్‌ మర్చిపోయారా?  ఈ సింపుల్ టిప్ తో కనిపెట్టండి

ప్రతి రోజు మనం ఫోన్ లో రకరకాల వెబ్ సైట్స్ ఓపెన్ చేస్తుంటాం కదా.. కొన్ని వెబ్ సైట్స్ Sign in చేస్తేనే వాటిలో సమాచారం ఇవ్వడానికి అంగీకరిస్తాయి. GMail, Facebook, instagram లాంటి రోజు ఉపయోగించే యాప్స్, వెబ్ సైట్స్ పాస్ వర్డ్స్ గుర్తు పెట్టుకుంటాం కాని.. అప్పుడప్పుడు విజిట్ చేసే వెబ్ సైట్స్ log in, passwords గుర్తు పెట్టుకోవాలంటే కష్టమే కదా. అన్ని పాస్ వర్డ్స్ గుర్తుంచుకోవాలంటే ఒక చిన్న టిప్ ఉంది. అదేంటో చూద్దాం రండి.
 

25

ఈ టిప్ విద్యార్థులు, ఉద్యోగులకు బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే చదువుకొనే క్రమంలో విద్యార్థులు రకరకాల యూనివర్సిటీల వెబ్ సైట్స్ విజిట్ చేస్తుంటారు. ప్రభుత్వ రంగ విద్యా సంస్థలకు సంబంధించిన సైట్స్ ఓపెన్ చేస్తుంటారు. అదే విధంగా ఎంప్లాయిస్ తమ పనిలో భాగంగా రకరకాల సైట్స్ ఓపెన్ చేస్తుంటారు. వాటిని యాక్సిస్ చేయాలంటే కొన్ని కచ్చితంగా Sign in అడుగుతాయి. అప్పుడు హడావుడిగా ఏదో ఒక పాస్ వర్డ్ పెట్టేస్తాం. కాని తర్వాత దాన్ని గుర్తు తెచ్చుకుందామంటే రాదు. 
 

35

ప్రతి సారి Forgot password ఆప్షన్ క్లిక్ చేస్తే గూగుల్ అడిగే సెక్యూరిటీ ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పకపోతే అకౌంట్స్ బ్లాక్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటాయి. స్కామర్లు మీ అకౌంట్ ని యాక్సిస్ చేయడానికి ప్రయత్నిస్తున్నారని మీ అకౌంట్ హోల్డ్ చేయొచ్చు. లేదా బ్లాక్ చేసినా ఆశ్చర్యపోనక్కరలేదు. 
 

45

ఇలా జరగకుండా ఉండాలంటే passwords అన్నీ గుర్తు పెట్టుకోవాలి. ఇంతకు ముందు అయితే పాస్ వర్డ్స్ ని గుర్తుగా డైరీలు, ప్రత్యేకమైన పుస్తకాల్లో రాసుకొనే వారు. ఇప్పుడలా చేయాల్సిన అవసరం లేదు. మీరు ఏ వెబ్ సైట్ ఓపెన్ చేసినా user name, password ఆటోమెటిక్ గా గూగుల్ సేవ్ చేసుకుంటుంది. కాని మీకు కనిపించదు. కొన్ని పాస్ వర్డ్స్ సేవ్ చేసేటప్పుడు మిమ్మల్ని పర్మీషన్ కూడా అడుగుతుంది. 
 

55

మీరు మర్చిపోయిన పాస్ వర్డ్ ని తెలుసుకోవాలంటే ఇలా చేయండి. 
మీ ఫోన్ లేదా సిస్టమ్ లో Settings ఓపెన్ చేయండి.
అందులో Google పై క్లిక్ చేయండి.
తర్వాత మీకు Autofill ఆప్షన్ కనిపిస్తుంది.
దానిపై క్లిక్ చేస్తే passwords అనే ఆప్షన్ కనిపిస్తుంది.
దానిపై క్లిక్ చేస్తే మీరు password Manager ఓపెన్ అవుతుంది. 
అందులో  మీరు Sign in చేసిన వెబ్ సైట్ అన్నీ కనిపిస్తాయి. 
మీరు పాస్ వర్డ్ మర్చిపోయిన సైట్ లేదా యాప్ పై క్లిక్ చేస్తే User Name, PassWord కూడా కనిపిస్తాయి.

click me!

Recommended Stories