35% సబ్సిడీతో బిజినెస్ లోన్ కావాలా? PMEGP స్కీమ్ కు అప్లై చేయండి

Published : Jan 31, 2025, 10:57 AM IST

కొత్తగా వ్యాపారం ప్రారంభించాలనుకునే వారికి ఇది నిజంగా శుభవార్త. యువ పారిశ్రామికవేత్తలను ఎంకరేజ్ చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఒక అద్భుతమైన స్కీమ్ తీసుకొచ్చింది. ఇందులో మీరు తీసుకున్న లోన్ అమౌంట్ కు ఏకంగా 35 శాతం వరకు సబ్సిడీ లభిస్తుంది. ఈ అద్భుతమైన స్కీమ్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం రండి.   

PREV
15
35% సబ్సిడీతో బిజినెస్ లోన్ కావాలా? PMEGP స్కీమ్ కు అప్లై చేయండి

ఈ రోజుల్లో యువత ఉద్యోగాలు కంటే బిజినెస్ చేయడానికి ఎక్కువ ఇష్టపడుతున్నారు. ఉద్యోగాల్లో జీతాలు తక్కువగా ఉండటం, ఎక్కువ సమయం గడపాల్సిన రావడంతో సొంత బిజినెస్ కి ఎక్కువ మంది ఇంట్రెస్ట్ పెడుతున్నారు. అలాంటి యువతను ఎంకరేజ్ చేయడానికి సెంట్రల్ గవర్నమెంట్ ఒక చక్కటి పథకాన్ని తీసుకొచ్చింది. ఆ స్కీం పేరు ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్(PMEGP).
 

25

కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నవారు ఈ స్కీం ద్వారా అప్లై చేస్తే మీకు వచ్చే లోన్ అమౌంట్ లో 35% వరకు సబ్సిడీ లభిస్తుంది. సబ్సిడీ కరెక్ట్ గా రావాలంటే మీరు చేయాల్సిందల్లా ప్రాజెక్ట్ రిపోర్ట్ సరిగ్గా తయారు చేయడం. ఎందుకంటే బ్యాంకులు లోన్ ఇచ్చేటప్పుడు అన్ని రకాల సర్టిఫికెట్స్ ని చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తాయి. ముఖ్యంగా బిజినెస్ లోన్స్ లో ప్రాజెక్ట్ రిపోర్ట్ చాలా కీలకం. ఇందులో చిన్న లోపాలు ఉన్నా కూడా లోన్ రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. అందువల్ల ప్రాజెక్ట్ రిపోర్ట్ సరిగా ఉంటే మీకు తప్పకుండా 35 శాతం సబ్సిడీతో లోన్ లభిస్తుంది.
 

35

మీరు సర్వీస్ సెక్టార్ లో బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే పీఎంఈజీపీ పథకం ద్వారా బ్యాంకులు రూ.10 లక్షల వరకు రుణం ఇస్తాయి. అంటే టైలరింగ్, హెయిర్ కట్, మెడికల్ షాప్, సూపర్ మార్కెట్ ఇలా ప్రజలకు సేవలు అందించే బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే రూ.10 లక్షల రుణం పొందొచ్చు. ఈ రూ.10 లక్షల లోన్ కకు మీకు 35% వరకు రాయితీ లభించే అవకాశం ఉంటుంది. 
 

45

ఒకవేళ మీరు మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ లో బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే రూ.25 లక్షల వరకు రుణం ఇస్తారు. అంటే ఎలాంటి వస్తువులైన తయారు చేసే బిజినెస్ కోసం ఈ రుణం ఇస్తారు. ఇందులో కూడా 35 శాతం వరకు రాయితీ పొందడానికి అవకాశం ఉంటుంది. 
 

ఇది కూడా చదవండి రూ.3,999కే ఇంట్లో థియేటర్ సెట్ చేసుకోండి!

55

పీఎంఈజీపీ పథకం కేవలం కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసే వాళ్లకే కాదు. ఇప్పటికే వ్యాపారం ప్రారంభించి దాన్ని విస్తరించాలని ఆలోచించలో  ఉన్న వారికి కూడా ఈ స్కీం ద్వారా రుణం ఇస్తారు.

మీరు ఈ లోన్ తీసుకోవాలనుకుంటే మీ సమీపంలో ఉన్న బ్యాంక్స్ కి వెళ్లి పీఎంఈజీపీ స్కీమ్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకుని అప్లై చేయండి.

ఇది కూడా చదవండి ఫిబ్రవరి 1 నుంచి G Pay, Phone Peల్లో UPI ట్రాన్సాక్షన్స్ పనిచేయవు. ఎందుకంటే..

click me!

Recommended Stories