FASTag: మీ ఫాస్టాగ్ రీఛార్జ్‌ ఎలా చేసుకోవాలో తెలియడం లేదా.?

Published : Feb 09, 2025, 03:37 PM IST

భారతదేశంలో టోల్‌గేట్‌ల వద్ద చెల్లింపుల కోసం ఉపయోగించే ఎలక్ట్రానిక్‌ టోల్‌ కలెక్షన్‌ విధానాన్నే ఫాస్టాగ్‌గా చెబుతుంటారు. అయితే మనలో కొందరికీ ఫాస్టాగ్ రీఛార్జ్‌ ఎలా చేసుకోవాలో తెలియక ఇబ్బంది పడుతుంటారు. ఇంతకీ ఫాస్టాగ్ రీఛార్జ్‌ చేసుకోవడానికి ఎన్ని రకాల అవకాశాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..   

PREV
16
FASTag: మీ ఫాస్టాగ్ రీఛార్జ్‌ ఎలా చేసుకోవాలో తెలియడం లేదా.?

టోల్‌ గేట్స్‌ వద్ద క్యూ లైన్స్‌లో గంటల కొద్దీ సమయం వేచి ఉండాల్సిన అవసరం లేకుండా. నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఫాస్టాగ్ విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ విధానంలో వాహనానికి ముందు ఒక ఫాస్టాగ్‌ కార్డును అతికిస్తారు. టోల్‌ గేట్‌ వద్ద ఏర్పాటు చేసిన స్కానర్స్‌ ఆటోమేటిక్‌గా సదరు ఫాస్టాగ్‌ కార్డులోని క్యూఆర్‌ కోడ్‌ను స్కాన్‌ చేసిన నేరుగా డబ్బులు కట్‌ అవుతాయి. ఇందుకోసం యూజర్లు ఎప్పటికప్పుడు ఫాస్టాగ్‌ అకౌంట్‌లో బ్యాలెన్స్‌ ఉండేలా చూసుకోవాల్సి ఉంటుంది. అయితే ఫాస్టాగ్‌లో రీఛార్జ్‌ చేసుకోవడానికి పలు రకాల ఆప్షన్స్‌ అందుబాటులో ఉన్నాయి. అవేంటంటే.. 
 

26

బ్యాంక్‌ వెబ్‌సైట్ లేదా యాప్స్‌:

దాదాపు అన్ని బ్యాంకులు ఫాస్టాగ్‌ రీఛార్జ్‌ సేవలను అందిస్తున్నాయి. ఇందుకోసం మీ బ్యాంక్‌ అధికారిక వెబ్‌సైట్‌ లేదా మొబైల్‌ యాప్‌లోకి వెళ్లాలి. అనంతరం సేవలను సెలక్ట్‌ చేసుకొని. అందులో ఫాస్టాగ్‌ రీఛార్జ్‌ అనే ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకోవాలి. అనంతరం మీ వాహన నెంబర్ లేదా ఫాస్టాగ్‌ అకౌంట్‌ నెంబర్ను ఎంటర్‌ చేయాలి. చివరిగా ఎంత మొత్తంతో రీఛార్జ్‌ చేయాలనుకుంటున్నారో ఎంటర్‌ చేసి పేమెంట్ చేస్తే సరిపోతుంది. 
 

36

యూపీఐ ద్వారా: 

గూగుల్‌పే, ఫోన్‌పే, పేటీఎమ్‌ వంటి అన్ని రకాల యూపీఐ పేమెంట్స్‌ ఆప్షన్స్‌ ద్వారా ఫాస్టాగ్‌ రీఛార్జ్‌ చేసుకునే అవకాశం ఉంది. ఇందుకోసం ముందుగా మీ యూపీఐ యాప్‌లోకి వెళ్లాలి. అనంతరం ఫాస్టాగ్‌ రీఛార్జ్‌ సెక్షన్‌లోకి వెళ్లాలి. తర్వాత మీ వాహన నెంబర్‌ లేదా ఫాస్టాగ్ ఖాతా నెంబర్‌ను ఎంటర్ చేయాలి. కావాల్సిన అమౌంట్‌ను ఎంటర్‌ చేసి, మీ యూపీఐ పిన్‌ నొక్కితే అమౌంట్‌ నేరుగా రీఛార్జ్‌ అవుతుంది. 
 

46

ఫాస్టాగ్‌ వెబ్‌సైట్‌:

ఫాస్టాగ్‌ అధికారిక వెబ్‌సైట్‌ లేదా యాప్‌ ద్వారా కూడా రీఛార్జ చేసుకోవచ్చు. ఇందుకోసం ముందుగా ఫాస్టాగ్‌ యాప్‌ లేదా అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి. అనంతరం మీ వాహన నెంబర్‌ ఎంటర్‌ చేయాలి. మీ రిజిస్టర్‌ మొబైల్‌ నెంబర్ కూడా అడుగుతుంది. తర్వాత అమౌంట్ ఎంటర్‌ చేసి పేమెంట్‌ చేస్తే సరిపోతుంది. 

56

నేరుగా టోల్‌ గేట్‌ వద్ద: 

ఇవేవీ మాకు తెలియవు అంటారా.? అందుకోసం కూడా ఓ అవకాశం ఉంది. లోల్‌ ప్లాజా వద్ద ఫాస్టాగ్‌ సెంటర్స్‌ను ఏర్పాటు చేసుకొని ఉంటారు. వారి దగ్గరికి నేరుగా వెళ్లి డబ్బులిచ్చినా మీ ఫాస్టాగ్‌ను రీఛార్జ్‌ చేస్తారు. 

66

ఫాస్టాగ్‌ లేకపోతే: 

ఒకవేళ ఫాస్టాగ్‌ లేకపోతే వాహనదారులు నేరుగా టోల్‌ గేట్స్‌ వద్ద టోల్‌ను చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఫాస్టాగ్‌ ఉన్న వారితో పోల్చితే లేని వారు ఎక్కువ మొత్తంలో చెల్లించాల్సి ఉంటుంది. అందుకే కచ్చితంగా ఫాస్టాగ్‌ను ఉపయోగించాలి. అదే విధంగా ఫాస్టాగ్‌లో బ్యాలెన్స్ ఎంత ఉందన్న విషయాన్ని ఎప్పటికప్పుడు చెక్‌ చేసుకుంటూ ఉండాలి. 

click me!

Recommended Stories