మీ సంపాదనలో 10 శాతం మీ కోరికలు తీర్చుకోవడానికి ఉపయోగించాలి. అంటే సినిమాలు, ట్రిప్స్, పార్టీలు, డ్రెస్ లు కొనుక్కోవడం లాంటి లగ్జరీ అవసరాలన్నీ 10 శాతంలోనే ఖర్చు చేయాలి. కాని చాలా మంది ఇక్కడే పెద్ద తప్పు చేస్తారు. అనవసరమైన ఖర్చుల కోసం ఎక్కువగా ఖర్చు పెడతారు. అందువల్లనే అప్పుల పాలవుతారు.
50-40-10 రూల్ ఫాలో అయితే మీరు ఎక్కువ సంపాదిస్తున్నా, తక్కువ సంపాదిస్తున్నా కచ్చితంగా ఆనందంగా, అప్పుల బాధ లేకుండా జీవితాన్ని సాగించవచ్చు.