
1. ముందుగా ఒక క్రెడిట్ కార్డు తీసుకుని వాడండి
ఇప్పటివరకు ఎలాంటి లోన్ తీసుకోని వాళ్లు క్రెడిట్ హిస్టరీ స్టార్ట్ చేయడానికి క్రెడిట్ కార్డు బెస్ట్ ఆప్షన్. మీకు బ్యాంకులో నార్మల్ క్రెడిట్ కార్డు రాకపోతే ఫిక్స్డ్ డిపాజిట్ (FD) మీద ఇచ్చే Secured Credit Card గురించి ఎంక్వైరీ చేయండి. ఈ కార్డు పొందాలంటే ముందుగానే మీరు కొంత అమౌంట్ బ్యాంకులో FD చేయాలి. దాని బేస్ మీద బ్యాంకు మీకు కార్డు ఇస్తుంది.
ఉదాహరణ
• FD అమౌంట్ : రూ.20,000
• కార్డు లిమిట్ : బ్యాంకు నియమాల ప్రకారం
• నెలవారీ ఖర్చు : మీరు తిరిగి కట్టగలిగే చిన్న మొత్తం
• పేమెంట్ : డ్యూ డేట్ కంటే ముందే మొత్తం కట్టేయాలి.
ఇలా బాధ్యతగా వాడుతూ ఉంటే మీ లోన్ రీపేమెంట్ హిస్టరీ క్రియేట్ అవుతుంది.
కానీ కార్డు రాగానే వెంటనే 750 స్కోర్ రాదు. మీ లావాదేవీలను బ్యాంకులు క్రెడిట్ బ్యూరోలకు పంపాక రిపోర్ట్ లో యాడ్ అవుతాయి.
కొత్తగా సిబిల్ స్కోర్ పెంచుకోవడానికే కాదు ఉన్న స్కోర్ పడిపోకుండా చూసుకోవడంలో క్రెడిట్ యుటిలైజేషన్ రేషియో (Credit Utilisation Ratio) చాలా ముఖ్యం. ఉదాహరణకు మీ క్రెడిట్ కార్డు లిమిట్ రూ.50,000 అనుకుందాం. అందులో ప్రతినెలా 30 శాతమే వాడుకోవాలి.
మొత్తం క్రెడిట్ లిమిట్ - రూ.50,000
30% వాడకం - రూ.15,000
50% వాడకం - రూ.25,000
90% వాడకం - రూ.45,000
మీకున్న మొత్తం లిమిట్ లో 30% కంటే తక్కువ వాడటం మంచి పద్ధతి. అంటే రూ.50,000 లిమిట్ ఉన్న కార్డులో రూ.15,000 లోపు ఖర్చు చేయడానికి ట్రై చేయండి. వీలైనంత తక్కువ బ్యాలెన్స్ మెయింటైన్ చేయడం ముఖ్యం.
చాలామంది క్రెడిట్ కార్డు బిల్లు రాగానే అందులో ఉన్న మినిమం అమౌంట్ డ్యూ మాత్రమే కడుతుంటారు.ఇది ఫైనాన్షియల్ గా మీరు చేసే పెద్ద తప్పు.
ఉదాహరణకు మీ క్రెడిట్ కార్డు బిల్లు రూ.10,000 వస్తే, అందులో మినిమమ్ ఎమౌంట్ కట్టి వదిలేస్తే మిగతా డబ్బు మీద భారీగా వడ్డీ పడుతుంది. అందుకే
• ప్రతి నెలా మొత్తం బిల్లు కట్టేయండి.
• డ్యూ డేట్ రాకముందే పేమెంట్ చేయండి.
• ఆటో పే ఆప్షన్ వాడుకోండి.
• బ్యాంక్ అకౌంట్ లో తగినంత బ్యాలెన్స్ ఉంచుకోండి.
లేట్ పేమెంట్లు, బకాయిలు సిబిల్ స్కోర్ ను దారుణంగా దెబ్బతీస్తాయని ఆర్థిక సంస్థలు చెబుతున్నాయి.
కొందరు క్రెడిట్ స్కోర్ పెంచుకోవాలని ఒకేసారి చాలా బ్యాంకుల్లో క్రెడిట్ కార్డు, పర్సనల్ లోన్, కన్స్యూమర్ లోన్ అంటూ అప్లై చేస్తారు.ఇది అస్సలు మంచి పద్ధతి కాదు. మీరు లోన్ కోసం అప్లై చేసినప్పుడు బ్యాంకులు మీ క్రెడిట్ రిపోర్ట్ చెక్ చేస్తాయి. ఇలాంటి హార్ట్ ఎంక్వైరీలు ఎక్కువైతే బ్యాంకులు మీకు లోన్ ఇవ్వడానికి వెనకడుగు వేస్తాయి. అందుకే మీకు నిజంగా అవసరమైన లోన్ లేదా కార్డుకి మాత్రమే అప్లై చేయండి. ప్రతిసారీ అప్లై చేసేముందు మీ అర్హతలు, నిబంధనలు చెక్ చేసుకోండి.
ఇప్పటికే క్రెడిట్ కార్డులు వాడుతున్నవాళ్లు వాటిని క్లోజ్ చేసి కొత్త కార్డులు తీసుకోవడం మంచిది కాదు. చాలా కాలంగా కరెక్ట్ గా వాడుతున్న అకౌంట్ మీ క్రెడిట్ హిస్టరీలో కీలక పాత్ర పోషిస్తుంది. అందుకే యాన్యువల్ ఫీజు, వాడకం, మీ ఫైనాన్షియల్ స్టేటస్ ఆలోచించిన తర్వాతే కార్డు క్లోజ్ చేయడంపై డెసిషన్ తీసుకోండి. మీ లోన్ హిస్టరీ టైమ్, బకాయిలు, తిరిగి చెల్లించే అలవాటు, కొత్తగా తెరిచినవి మూసేసిన అకౌంట్లు అన్నీ CIBIL పరిగణనలోకి తీసుకుంటుంది.
మీరు వేరేవాళ్లతో కలిసి జాయింట్ లోన్ తీసుకున్నా లేదా ఎవరికైనా గ్యారంటర్ గా ఉన్నా ఆ లోన్ పేమెంట్స్ ఎలా ఉన్నాయో రెగ్యులర్ గా ట్రాక్ చేయాలి. ఎందుకంటే జాయింట్ లోన్ లేదా గ్యారెంటర్ గా ఉన్నప్పుడు అవతలి వ్యక్తి ఈఎంఐ కట్టకపోయినా అది మీ క్రెడిట్ రిపోర్ట్ ను డ్యామేజ్ చేస్తుంది. చాలామంది ఈ విషయాన్ని గమనించరు.
స్కోర్ పెంచుకోవడానికి ట్రై చేసేముందు అసలు మీ క్రెడిట్ రిపోర్ట్ లో ఏముందో తెలుసుకోవాలి. కొన్నిసార్లు మీరు తీసుకోని లోన్ ఉన్నట్టు, తప్పుగా బకాయిలు చూపించడం, క్లోజ్ చేసిన లోన్ ఇంకా యాక్టివ్ గా ఉండటం లాంటి మిస్టేక్స్ ఉండొచ్చు. వీటిని గుర్తిస్తే వెంటనే సంబంధిత బ్యాంకు లేదా క్రెడిట్ బ్యూరోకి కంప్లైంట్ చేసి సరిదిద్దుకోవచ్చు.
ఆర్బిఐ నిబంధనల ప్రకారం, ఎవరైనా సరే క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీల నుంచి ఏడాదికోసారి ఫ్రీగా ఫుల్ క్రెడిట్ రిపోర్ట్ పొందవచ్చు. ఇందులో క్రెడిట్ స్కోర్ కూడా ఉంటుంది.