రూ.80 వేల ఫోన్ రూ.10 వేలకే.. ఎక్కడ దొరుకుతుందో తెలుసా

First Published | Aug 17, 2024, 10:57 AM IST

Xiaomi 14 కొత్త ఫ్యూచర్స్ తో వినియోగదారులను ఆకట్టుకుంటోంది. దీని అసలు ధర రూ.79,999. అయితే మీరు కావాలనుకుంటే దీన్ని కేవలం రూ.10,749లకే పొందవచ్చు. ఎక్కడ కొనుగోలు చేయాలి. ఈ ఆఫర్ ఇస్తున్నదెవరు.. అలాంటి విషయాలు తెలుసుకుందాం రంది..
 

Xiaomi 14 స్మార్ట్ ఫోన్ ఇప్పుడు హైపర్‌ ఓఎస్‌ 1.5 వెర్షన్‌లో మార్కెట్‌లో లభిస్తోంది. 12GB RAM + 512GB స్టోరేజ్ మోడల్‌ ఇది. 6.36-అంగుళాల LTPO AMOLED డిస్‌ప్లే చాలా ఆకర్షణీయంగా ఉంది. ఇది ప్రో HDR డిస్‌ప్లే HDR 10, HDR 10+ మరియు డాల్బీ విజన్‌కి సపోర్ట్ చేస్తుంది. అందువల్ల ఫొటోగ్రఫీకి ఇది చాలా మంచి ఫీచర్‌. ఇందులో ఉండే ట్రిపుల్‌ కెమెరా ద్వారా హై రెజెల్యూషన్‌ విజువల్స్‌ తీయొచ్చు. 120 Hz రిఫ్రెష్ రేట్, 20:9 యాస్పెక్ట్ రేషియో, 1.5K రిజల్యూషన్‌ దీని ప్రత్యేక ఫీచర్స్‌.
 

కెమెరా యాంగిల్స్‌ సూపర్‌...

Xiaomi 14లో వైడ్ యాంగిల్ లెన్స్‌తో కూడిన 50-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ఉంది. అదేవిధంగా 50-మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్, 50 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ కెమెరాలు ఉన్నాయి. సెల్ఫీలు తీసుకొనేందుకు ఇందులో 32-మెగాపిక్సెల్ ఇన్-డిస్ప్లే కెమెరా కూడా ఉంది.
 


బ్యాటరీ, ఛార్జింగ్‌ ఫీచర్స్‌

బ్యాటరీ, ఛార్జింగ్ విషయానికొస్తే ఈ స్మార్ట్‌ఫోన్‌లో 4,610 mAh బ్యాటరీ అమర్చారు. ఇది 90W హైపర్‌ఛార్జ్, 50W వైర్‌లెస్ హైపర్‌ఛార్జ్‌కు సపోర్ట్‌ చేస్తుంది. ఇది స్పీడ్‌గా ఛార్జింగ్ ఎక్కడానికి సహాయపడుతుంది. ఇందులో డ్యూయల్-సిమ్ వేసుకోవచ్చు. WiFi-7 , బ్లూటూత్ 5.4. ఆడియో, స్టీరియో స్పీకర్లు, డాల్బీ అట్మోస్, 4-MIC సదుపాయాలు వినియోగదారులను ఆకట్టుకుంటున్నాయి. 
 

రూ.10,749 కి ఎలా వస్తుందంటే..

12GB RAM, 512GB మెమొరీ ఉన్న Xiaomi 14 స్మార్ట్‌ఫోన్ అమెజాన్‌లో రూ.79,999కి అందుబాటులో ఉంది. అయితే ప్రస్తుతం 13% తగ్గింపుతో రూ.69,999లకే లభిస్తుంది. ఒకవేళ మీరు మీ పాత స్మార్ట్‌ఫోన్‌ను ఎక్చేంజ్‌ ఆఫర్‌లో ఇస్తే రూ. 49,000 వరకు ధర తగ్గవచ్చు. మీ ఫోన్‌ మంచి కండీషన్‌లో ఉంటే ఎక్చేజ్‌లో రూ. 20,999 వరకు ధర తగ్గుతుంది. ఇక మీ దగ్గర SBI కార్డ్‌ ఉంటే దాన్ని ఉపయోగిస్తే మరో రూ. 10,000 వరకు అదనపు తగ్గింపు పొందవచ్చు. ఇలాంటి అనేక తగ్గింపుల తర్వాత రూ.79,999 ఉన్న ఫోన్‌ ధర ఫైనల్‌గా కేవలం రూ. 10,749కి లభిస్తుంది. ఈ ఆఫర్‌ కొన్ని రోజులు మాత్రమేనని అమెజాన్‌ ప్రతినిధులు ప్రకటించారు. గడువు  ముగిసేలోపు ఈ ఆఫర్‌ను వినియోగించుకోండి మరి..
 

Latest Videos

click me!