రాక్ లుక్‌తో మహేంద్ర థార్ రాక్స్.. ఫీచర్స్ అదుర్స్

First Published | Aug 16, 2024, 5:39 PM IST

మహేంద్ర అండ్ మహేంద్ర కంపెనీ కొత్త కార్ లాంఛ్ కి సిద్ధమవుతోంది. పేరు థార్ రాక్స్.. పేరుకు తగ్గట్టుగానే రాక్ లుక్ తో అదిరిపోయింది. దీని ధర, మైలేజ్ ఇతర ఫీచర్లు ఏంటో తెలుసుకుందాం రండి.
 

జీప్, జిప్సీలకు మహేంద్ర కంపెనీ పెట్టింది పేరు. ఈ కంపెనీ నుంచి వచ్చిన మోడల్స్ రాయల్ లుక్ కలిగి ఉంటాయి. అంతేకాకుండా ఫీచర్స్ కూడా చాలా బాగుంటాయి. స్కార్పియో, బొలేరో, ఎక్స్ యూవీ మోడల్స్ కి ఇప్పటికీ డిమాండ్ ఉంది. 

మహేంద్ర థార్ రాక్స్ విషయానికొస్తే..

దీన్ని 5 డోర్స్ తో దీన్ని లాంఛ్ చేస్తున్నారు. పెట్రోల్, డీజిల్ రెండు వర్షన్స్ లో ఇది దొరుకుతుంది. 2.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ 160 బీహెచ్ పీ శక్తితో నడుస్తుంది. 330 ఎన్ఎం టార్క్ ని అందిస్తుంది. డీజిల్ ఇంజిన్ విషయానికొస్తే 2.2 లీటర్ ఎంహాక్ ఇంజిన్, 150 బీహెచ్ పీ శక్తిని,330 ఎన్ఎం టార్క్ ని అందిస్తుంది. ఈ రెండు ఇంజిన్ల స్పెషాలిటీ ఏంటంటే ఆటోమెటిక్ గేర్ సిస్టమ్ ని కలిగి ఉన్నాయి. 10.25 అంగుళాల టచ్ స్క్రీన్ ప్రత్యేక ఆకర్షణ. ఈ టచ్ స్క్రీన్ యాపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటో సపోర్ట్ తో పనిచేస్తుంది.
 


థార్ రాక్స్ ధరలెంతో తెలుసా..

థార్ రాక్స్ ఆరు వేరియంట్లలో మార్కెట్ లోకి అడుగుపెట్టనుంది. పెట్రోల్ వేరియంట్ బేసిక్ MX1 MT ధర రూ.12.99 లక్షలు కాగా, MX3 AT ధర రూ. 14.99 లక్షలకు ఎక్స్ షోరూం ధరలతో ప్రారంభమవుతాయి. డీజిల్ వేరియంట్‌ల కోసం, MXI ధర రూ. 13.99 లక్షలు, MX3 MT రూ. 15.99 లక్షలు, AX3 L MT మరియు MX5 MT ధర రూ. 16.99 లక్షలు, AX5 L AT, AX7 MT 18.99 లక్షలకు లభ్యమవుతాయి. ఎల్ఈడీ ప్రొజెక్టర్ ల్యాంప్ లు ఈ రెండు కార్ల అందాన్ని మరింత పెంచాయి. వీటికి సన్ రూఫ్ ఉంది. ఈ కార్లు డీప్ ఫారెస్ట్, ఎవరెస్ట్ వైట్, టాంగో రెడ్, బ్యాటిల్‌షిప్ గ్రే, నెబ్యులా బ్లూ, బర్న్ట్ సియన్నా, స్టెల్త్ బ్లాక్ రంగుల్లో మార్కెట్లోకి రానున్నాయి. డిజైన్ Bi-LED ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌లు, C shaped DRLలతో ఉన్న బోల్డ్ ఫ్రంట్ గ్రిల్‌, నిటారుగా ఉన్న క్యాబిన్  కారుకు చాలా అందాన్నిచ్చాయి. 
 

మార్కెట్ లోకి ఎప్పటి నుంచి అంటే..

అక్టోబర్ 03, 2024 నుండి థార్ ROXX బుకింగ్‌లు ఓపెన్ చేస్తారు. ఆన్‌లైన్‌, మహీంద్రా డీలర్ల వద్ద బుక్ చేసుకోవచ్చు. టెస్ట్ డ్రైవ్‌లు మాత్రం  సెప్టెంబర్ 14, 2024 నుండి ప్రారంభమవుతాయి. ఈ దసరా నుండి డెలివరీలు ప్రారంభమవుతాయని కంపెనీ ప్రతినిధులు ప్రకటించారు.  భవిష్యత్తులో మరిన్ని థార్ రాక్స్ మోడల్స్ ను తీసుకురానున్నట్లు కంపెనీ ప్రతినిధులు తెలిపారు.
 

Latest Videos

click me!