నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, డిస్నీ + హాట్‌స్టార్ స‌హా 15 ఓటీటీలు ఫ్రీ.. జియో సూప‌ర్ ప్లాన్ ఇది.. !

First Published | Aug 16, 2024, 10:54 PM IST

Reliance Jio : దేశంలోని ప్రసిద్ధ టెలికాం కంపెనీగా రిలయన్స్ జియో ముందుకు సాగుతోంది. ఇంటర్నెట్- కాలింగ్ సేవల్లో దేశంలో జియో విప్లవం తీసుకొచ్చింది. అలాగే, దేశంలోని ప్రతి మూలకు ఇంటర్నెట్ సౌకర్యాలను అందించడంలో ఇది ప్రసిద్ధి చెందింది. 
 

Reliance Jio : యూజ‌ర్ల‌ను ఆక‌ట్టుకోవ‌డానికి రిల‌య‌న్స్ జియో కొత్త ప్లాన్ల‌తో ముందుకు వ‌స్తూనే ఉంది. ఇటీవ‌ల టారీఫ్ రేట్ల‌ను పెంచిన త‌ర్వాత జియో ఒక సూప‌ర్ ప్లాన్ ను తీసుకువ‌చ్చింది. ప్ర‌స్తుతం దేశంలోని మెట్రో నగరాల నుండి మారుమూల ప్రాంతాల వ‌ర‌కు జియో త‌న ఇంటర్నెట్ సేవ‌ల‌ను అందిస్తోంది. జియో ప్రస్తుతం ఆసియాలో అత్యంత సంపన్నుడు ముఖేష్ అంబానీ కుమారుడు అయిన ఆకాష్ అంబానీ నేతృత్వంలో న‌డుస్తోంది. ఎక్కువ డేటా వినియోగదారుల కోసం జియో అద్భుతమైన ప్లాన్‌ను ప్రవేశపెట్టింది.  ఆ వివ‌రాలు మీకోసం.. 

జియో దాని వినియోగదారులకు వివిధ ధరల శ్రేణులలో అనేక టారిఫ్ ప్లాన్‌లను అందిస్తోంది. ఇవి విభిన్న కాల్, డేటా ప్రయోజనాలతో అందుబాటులో ఉన్నాయి. డేటా, చెల్లుబాటును బట్టి ఈ ప్రయోజనాలు మారుతూ ఉంటాయి. జియో తన వినియోగదారులకు 28 రోజుల నుండి 365 రోజుల వరకు చెల్లుబాటుతో ఉండే ప్లాన్‌లను అందిస్తుంది. ఇటీవల జియో తన పోర్ట్‌ఫోలియోను అప్‌డేట్ చేస్తూ.. అనేక రీఛార్జ్ ప్లాన్‌ల ధరలను పెంచింది. 

Latest Videos


అయితే, అధిక డేటాను ఉప‌యోగించే, ఓటీటీ ప్లాట్ ఫామ్ ల‌ను వినియోగించే వారి కోసం ప్రత్యేక ప్లాన్ ను తీసుకువ‌చ్చింది. ఈ ప్లాన్ పేరు 'అల్టిమేట్ స్ట్రీమింగ్ ప్లాన్'. ఇది నెలకు 888 రూపాయ‌ల‌తో అందుబాటు లో ఉంది. దీంతో నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, డిస్నీ + హాట్‌స్టార్ స‌హా 15 ఓటీటీలు ఫ్రీగా యాక్సెస్ చేయ‌వ‌చ్చు. 

ఇది జియో ఫైబ‌ర్, జియో ఎయిర్ ఫైబర్ ప్లాన్. ఈ ప్లాన్‌లో మీరు జియో ఎయిర్‌ఫైబర్, జియో ఫైబర్ రెండింటిలోనూ అత్యంత వేగ‌వంత‌మైన డేటాను పొంద‌వ‌చ్చు. ఈ ప్లాన్ లో డౌన్‌లోడ్ స్పీడ్ 30 ఎంబీపీఎస్ గా ఉంటుంది. అలాగే, ఈ ప్లాన్‌లో మీరు 15 కంటే ఎక్కువ ఓటీటీ యాప్‌ల ఉచిత సభ్యత్వాన్ని కూడా పొందుతారు. అంటే మీరు అదనపు డబ్బు చెల్లించకుండానే నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, డిస్నీ + హాట్‌స్టార్ ఇంకా మరెన్నో యాప్‌లను చూడవచ్చు.

దీనితో పాటు ఈ ప్లాన్‌లో మరో విశేషం కూడా ఉంది. మీరు ఈ ప్లాన్‌ని ఒక సంవత్సరం పాటు కూడా తీసుకోవచ్చు. మీరు ఈ ప్లాన్‌ని ఒక సంవత్సరం పాటు తీసుకుంటే, మీకు 30 రోజుల అద‌న‌పు ప్రయోజనం కూడా ఉచితంగా లభిస్తుంది.

జియో ఇప్పటికే రూ. 599, రూ. 899, రూ. 1199 ఎయిర్‌ఫైబర్, ఫైబ‌ర్ ప్లాన్‌లను అందిస్తోంది. మీరు జియో ఫైబ‌ర్ లేదా జియో ఎయిర్ ఫైబ‌ర్ సేవ‌ల‌ను పొందాల‌నుకుంటే నేరుగా జియో వెబ్ సైట్ లేదా మొబైల్ యాప్ ద్వారా బుక్ చేసుకోవ‌చ్చు. ద‌గ్గ‌ర‌లోని జియో స్టోర్ ద్వారా కూడా బుక్ చేసుకోవ‌చ్చు. 

click me!