SBI యాన్యుటీ డిపాజిట్ స్కీమ్‌: ప్రతినెలా రూ.1000 పెట్టుబడితో ఎక్కువ డబ్బు ఎలా పొందాలంటే ?

First Published | Jun 21, 2024, 1:39 PM IST

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్ల కోసం ఎన్నో పథకాలను అందిస్తుంది. అలాగే, బ్యాంక్ కస్టమర్లకు పూర్తి ఆర్థిక భద్రత, క్యాపిటల్ గ్రోత్ అందించాలని కట్టుబడి ఉంది. ఈ తరుణంలో SBI కస్టమర్లకు ఆన్యుటీ డిపాజిట్ పథకాన్ని అందిస్తుంది. ఈ పథకం సేవింగ్స్ అకౌంట్స్ & పెట్టుబడి పథకాల కంటే అధిక వడ్డీ రేటును అందిస్తుంది. 

 కానీ గమనించవలసిన ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఎస్‌బీఐ ఆన్యుటీ డిపాజిట్ పథకం కింద పెట్టుబడిదారులు ఫిక్స్డ్ కాలానికి పెద్ద మొత్తాన్ని డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. అంటే, ముందుగా పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్ చేసిన తర్వాత.. ఆ మొత్తాన్ని వడ్డీతో పాటు  ప్రతినెలా సమాన వాయిదాల్లో తిరిగి పొందవచ్చు. 

SBI యాన్యుటీ డిపాజిట్ స్కీమ్‌లో పెట్టుబడిదారుడు 36, 60, 84 లేదా 120 నెలల పాటు డబ్బును డిపాజిట్ చేయవచ్చు. మీరు మొత్తాన్ని డిపాజిట్ చేసే కాలానికి ఫిక్స్‌డ్ డిపాజిట్లపై ఎలాంటి వడ్డీ రేటు వర్తిస్తుందో యాన్యుటీ డిపాజిట్ స్కీమ్‌లో కూడా అదే  వర్తిస్తుంది. పెట్టుబడిదారులు గమనించాల్సిన మరో విషయం ఏమిటంటే, ప్రతినెలా పెట్టుబడి మొత్తంలో సమాన మొత్తం వడ్డీతో కలిపి పొందడం వల్ల మీరు చేసిన పెట్టుబడి మొత్తం తగ్గుతుంది. ఇలా డిపాజిట్ చేసిన మొత్తం తగ్గినప్పుడు ప్రతినెలా వడ్డీ మొత్తం కూడా తగ్గుతుంది. ఇలా కొనసాగుతున్నప్పుడు డిపాజిటర్ ఎస్‌బిఐ యాన్యుటీ డిపాజిట్ స్కీమ్ మెచ్యూరిటీపై ఎలాంటి మొత్తాన్ని అందుకోరు. 


SBI యాన్యుటీ డిపాజిట్ స్కీమ్  ఫీచర్స్ :

1. SBI  ఏదైనా బ్రాంచ్ ద్వారా  ఈ పథకంలో పెట్టుబడి పెట్టవచ్చు.

2. ఈ పథకంలో కనీస పెట్టుబడి మొత్తం రూ.1,000.

3. ఈ పథకం కోసం గరిష్ట పెట్టుబడి మొత్తంపై పరిమితి లేదు.

4. ఒకవేళ మీరు లేనప్పుడు SBI ఆన్యుటీ డిపాజిట్ స్కీమ్ నుండి రిటర్న్‌లను పొందడానికి  నామినీని నామినేట్ చేయవచ్చు.
 

5. రిటర్న్‌లలో అసలు ఇంకా వడ్డీ ఉంటాయి.

6. ఈ పథకం & టర్మ్ డిపాజిట్ల కోసం పాస్‌బుక్ పొందాలి.

7. 36, 60, 84 లేదా 120 నెలల మధ్య పెట్టుబడి కాలవ్యవధిని సెలక్ట్ చేసుకోవచ్చు.

8. ప్రత్యేక సందర్భాల్లో ఆన్యుటీ డిపాజిట్ బ్యాలెన్స్‌లో 75% ఓవర్‌ డ్రాఫ్ట్ లేదా లోన్ సదుపాయాన్ని అందించడానికి బ్యాంక్ బాధ్యత వహిస్తుంది. 

Latest Videos

click me!