అంబానీ.. మరీ ఇంత పిసినారేంటి? కొడుకు పెళ్లి కోసం ఎంత ఖర్చు చేస్తున్నారంటే..?

First Published | Jul 12, 2024, 1:47 PM IST

ఆసియాలోనే అపర కుబేరుడు ముఖేష్ అంబానీ కుమారుడి వివాహం ముంబై అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నారు. అనంత్ అంబానీ- రాధికా మర్చంట్‌ల పరిణయోత్సవానికి దేశ, విదేశాల నుంచి భారీ సంఖ్యలో అతిథులు తరలి వస్తున్నారు.

anant ambani wedding

రిలయన్స్‌ గ్రూప్‌ అధినేత, అపర కుబేరుడు ముఖేష్‌ అంబానీ.. తమ్ముడు అనిల్‌ అంబానీ చేసిన ప్రతి వ్యాపారంలో దివాళా తీసినా అన్న మాత్రం అన్నిట్లో సూపర్‌ సక్సెస్‌. ఎందుకంటే... ఆయన ఏ పనిచేసినా, వ్యాపారం మొదలుపెట్టినా ఓ పద్ధతి ప్రకారం చేస్తారు. ప్రతి బిజినెస్‌ వెనుక ఓ ప్రణాళిక ఉంటుంది. అలాగే, తాను ప్రారంభించిన అన్ని వ్యాపారాల్లోనూ అగ్రస్థానాల్లో ఉన్నారు ముఖేష్‌ అంబానీ. ఇక, అంబానీ స్థాపించిన రిలయెన్స్ జియో నెట్వర్క్ అయితే భారత్‌లో తక్కువ కాలంలో వినియోగదారుల మన్ననలు దక్కించుకుంది. దేశంలో టెలికం నెట్వర్క్‌లో జియోను అతి తక్కువ సమయంలో నెంబర్‌ వన్‌ స్థానానికి తీసుకెళ్లారు అంబానీ... 

anant ambani wedding

అపర కుబేరుడైన ముఖేష్‌ అంబానీ పేరుకు తగ్గట్టే వేడుకలు భారీగానే నిర్వహిస్తారు. కుమారుడు అనంత్‌ అంబానీ ఎంగేజ్‌మెంట్‌, పెళ్లి వేడుకలు కొన్ని నెలలుగా అత్యంత అట్టహాసంగా నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో అనంత్‌ అంబానీ పెళ్లిలో భారీ ఖర్చుతో చేస్తున్న ప్రతిదీ వార్తల్లో నిలుస్తోంది. అంబానీ కుటుంబం ధరించే దుస్తుల నుంచి వారు వాడే వస్తువులు, కార్లు, చేసే పూజలు, అతిథులు అన్నీ వార్తల్లో నిలుస్తున్నాయి. 


anant ambani wedding

కాగా, ముంబైలోని బాంద్రా కుర్ల కాంప్లెక్స్‌లో అనంత్‌ అంబానీ- రాధికా మర్చంట్‌ల పెళ్లి వేడుక నేడు (శుక్రవారం) అత్యంత అట్టహాసంగా జరుగుతోంది. అసియాలోనే అపర కుబేరుడైన ముఖేష్‌ అంబానీ కొడుకు పెళ్లి కావడంతో ఇప్పటికే రెండు విడతల్లో ప్రీ-వెడ్డింగ్ వేడుకలు అత్యంత ఘనంగా జరిగాయి. ఇక అసలైన పెళ్లి వేడుకలు మొదలయ్యాయి. ప్రపంచమే అబ్బురపడేలా ముంబయిలో వివాహ వేడుక నిర్వహిస్తున్నారు. గ్లోబల్ సింగింగ్ ఐకాన్‌లు జస్టిన్ బీబర్, రిహన్న, దిల్జిత్ దోసాంజ్, ఇతర బాలీవుడ్ ప్రముఖులు ఈ వేడుకల్లో ప్రదర్శనలు ఇస్తున్నారు. దీంతో ఎక్కడ చూసినా ఈ పెళ్లి గురించే చర్చ జరుగుతోంది. 

anant ambani wedding

అసలు విషయానికి వస్తే...
అనంత్ అంబానీ- రాధిక మర్చంట్‌ల పెళ్లి వేడుకల ఖర్చు సుమారు రూ.5,000 కోట్లు ఉంటుందని అంచనా. పెళ్లి కోసం ఇంత మొత్తంలో ఖర్చు చేయడం అనూహ్యమే అయినప్పటికీ.. సగటు భారతీయ కుటుంబాలు వివాహ వేడుకలకు ఖర్చు చేసే దాని కంటే అంబానీ కుటుంబం తక్కువ శాతాన్నే ఖర్చు చేస్తోంది.
 

anant ambani wedding

అయితే, అనంత్ అంబానీ- రాధిక మర్చంట్‌ల వివాహానికి ముఖేష్‌ అంబానీ మాత్రం చాలా ప్లాన్‌డ్‌గా, పొదుపుగా ఖర్చు చేస్టున్నారు. ఈ పెళ్లి వేడుకకు అంబానీ కుటుంబం చేస్తున్న ఖర్చు దాదాపు రూ.5,000 కోట్లు. ఇది అంబానీ సంపదలో 0.5 శాతం మాత్రమే. ఫోర్బ్స్ ప్రకారం.. ప్రస్తుతం ముఖేష్ అంబానీ నికర విలువ 123.2 బిలియన్ డాలర్లు అంటే రూ.10,28,544 కోట్లు.

anant ambani wedding

గుజరాత్‌లోని జామ్‌నగర్, యూరప్‌లో కొన్ని నెలల ముందు అనంత్‌ అంబానీ- రాధికా మర్చంట్‌ల ప్రీ వెడ్డింగ్‌ వేడుకలు ఘనంగా జరిగాయి. ఇవాళ జరుగుతున్న వివాహ వేడుకలకు ముంబై బాంద్రా కుర్లా కాంప్లెంక్స్‌లోని జియో సెంటర్‌ వేదిక అయ్యింది. ఈ వేడులకు బాలీవుడ్ తారలు, ప్రపంచ రాజకీయ దిగ్గజ నాయకులు, టెక్ మాగ్నెట్‌లు, అమెరికన్ రియాలిటీ టీవీ ప్రముఖులు కూడా హాజరు అవుతున్నారు. 

anant ambani radhika wedding

యూకే మాజీ ప్రధానులు బోరిస్ జాన్సన్, టోనీ బ్లెయిర్, ఫ్యూచరిస్ట్ పీటర్ డైమండిస్, ఆర్టిస్ట్ జెఫ్ కూన్స్, సెల్ఫ్-హెల్ప్ గురు జే శెట్టి, US మాజీ సెక్రటరీ ఆఫ్ స్టేట్ జాన్ కెర్రీ, కెనడియన్ మాజీ ప్రధాని స్టీఫెన్ హార్పర్, కిమ్ కర్దాషియాన్, ఖోలే కర్దాషియాన్ తదితరులు అనంత్‌ అంబానీ- రాధికా మర్చంట్‌ల వివాహ అతిథుల జాబితాలో ఉన్నారు. ఇక దేశంలోని సినీ, రాజకీయ ప్రముఖుల జాబితా అయితే చాంతాడంత ఉంది. 

Latest Videos

click me!