Gold from Dubai: దుబాయ్ నుండి ఎంత బంగారం ఫ్లైట్‌లో ఇండియాకు తెచ్చుకోవచ్చు?

Published : Nov 20, 2025, 10:16 AM IST

Gold from Dubai: దుబాయ్ బంగారం చాలా స్వచ్ఛమైనదని అంటారు. అందుకే ఎంతో మంది దుబాయ్‌ నుంచి బంగారం ఇండియాకు తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తారు.  అయితే మన కస్టమ్స్ రూల్ ప్రకారం ఎంత బంగారం తీసుకురావచ్చో తెలుసుకోండి.

PREV
14
దుబాయ్ బంగారం

దుబాయ్ బంగారం ఎంతో స్వచ్ఛమైనది. అందుకే అక్కడికి వెళ్లే భారతీయులు కచ్చితంగా బంగారం తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తారు. దుబాయ్ వెళ్లి బంగారం కొనేందుకు ఇష్టపడతారు. అక్కడ ధరలు కూడా తక్కువగా ఉంటాయని అంటారు. మనదేశంలో 24 క్యారెట్ల బంగారం గ్రాముకు రూ.12,569 అయితే, దుబాయ్‌లో రూ.11,800 మాత్రమే ఉంటుంది. అంటే ఇండియా కంటే బంగారం ధర పదిశాతం తక్కువగా ఉంటుంది.

24
డ్యూటీ ఫ్రీ పరిమితి

పురుషులు దుబాయ్ నుంచి 20 గ్రాముల బంగారు ఆభరణాలు వేసుకుని రావచ్చు. దీనికి ఎలాంటి కస్టమ్స్ డ్యూటీ లేకుండా తెచ్చుకోవచ్చు. మహిళలు, పిల్లలు 40 గ్రాముల బంగారు ఆభరణాలు డ్యూటీ ఫ్రీ రహితంగా తీసుకురావచ్చు. ఇంతకుమించి ఎక్కువ బంగారం తీసుకొచ్చినట్లయితే కస్టమ్స్ డ్యూటీ చెల్లించాలి. 20 గ్రాముల నుంచి 50 గ్రాములు బంగారానికి 3 శాతం డ్యూటీ రుసుము చెల్లించాల్సి ఉంటుంది. 50 గ్రాములు నుంచి 100 గ్రాముల బంగారాన్ని తీసుకొస్తే 6 శాతం డ్యూటీ చెల్లించాల్సి ఉంటుంది. వంద గ్రాములకు పైగా బంగారం తీసుకొస్తే 10 శాతం డ్యూటీని చెల్లించాలి.

34
ఈ జాగ్రత్తలు తప్పనిసరి

దుబాయ్ లో బంగారం కొనుగోలు చేసినప్పుడు ఇన్వాయిస్, ప్యూరిటీ సర్టిఫికేట్ వంటివి తప్పకుండా తీసుకోండి. మీరు తీసుకురావాలనుకునే బంగారం మొత్తం మీద ఈ నియమాలకు లోబడి ఉందని ముందే తనిఖీ చేసుకోండి. భారత విమానాశ్రయంలో రెడ్ ఛానెల్ ద్వారా డిక్లరేషన్ తీసుకోవాలి. అవసరమైతే డ్యూటీ చెల్లించాలి. ప్రయాణానికి ముందు తాజా సమాచారం తనిఖీ చేయడం మంచిది.

44
కిలో బంగారం తేవచ్చు

దుబాయ్ నుంచి ఇండియాకు కిలో బంగారం కూడా తీసుకురావచ్చు. కానీ దీనికి సంబంధించి నియమాలు చాలా కఠినంగా ఉంటాయి. వీటిని నాణాలు లేదా కడ్డీల రూపంలోనే తీసుకురావాలి. అలాగే  36 శాతం సుంకం చెల్లించాల్సి ఉంటుంది. మీరు ఒక కిలో బంగారం కంటే ఎక్కువ తీసుకువస్తే, విమానాశ్రయంలోని రెడ్ ఛానల్‌లో అధికారులకు తెలియజేసి, అవసరమైన పన్నులు చెల్లించాలి.

Read more Photos on
click me!

Recommended Stories