Business Idea: ఉన్న ఊరిలో ఉంటూ వ్యాపారం చేయాలని చాలా మందికి ఉంటుంది. ఇందుకోసం రకరకాల మార్గాలను వెతుకుంటారు. అయితే కేవలం 100 గజాల స్థలం ఉన్నా మంచి లాభాలు ఆర్జించే ఇలాంటి ఒక బెస్ట్ బిజినెస్ ఐడియా గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు వచ్చే బెస్ట్ వ్యాపారాల్లో కొత్తిమీర పెంపకం ఒకటి. నిత్యవసర కూరగాయల్లో కొత్తిమీర ఒకటనే విషయం తెలిసిందే. కొత్తిమీరలో ఫైబర్, కాల్షియం, ఐరన్, విటమిన్లు, కేరోటిన్ వంటి పోషకాలు ఉంటాయి. దీంతో దేశమంతా కొత్తమీరకు డిమాండ్ ఉంటుంది. దీంతో ఎక్కడ సాగు చేసినా బిజినెస్‌కు ఎలాంటి ఢోకా ఉండదు. కొత్తిమీర పంట పూర్తిగా సిద్ధం కావడానికి 2.5–3 నెలలు పడుతుంది. అయితే విత్తనాలు వేసిన 30–40 రోజులకు ఆకులను కోసి అమ్మడం ద్వారా వెంటనే ఆదాయం మొదలవుతుంది.
25
ఎక్కడ సాగు చేస్తే మంచిది.?
కొత్తిమీరకు సమశీతోష్ణ వాతావరణం చాలా అనుకూలం. తేలికపాటి రేతి నేల, ఎరువు కలిసిన ఎర్ర నేల రెండూ సరిగ్గా పనిచేస్తాయి. శీతాకాలం, వేసవి ప్రారంభం—ఈ రెండు సీజన్లు అధిక దిగుబడి ఇచ్చే కాలాలుగా చెప్పొచ్చు. చలికాలంలో పొగమంచు రాకుండా, వేసవిలో నేరుగా గాఢ ఎండ పడకుండా జాగ్రత్తలు తీసుకుంటే పంట నాణ్యత బాగుంటుంది.
35
100 గజాల్లో కొత్తిమీర సాగు ఎలా చేయాలి?
100 గజాలు అంటే సుమారు 900 చ.అడుగులు. ఇంత స్థలంలో చిన్న స్థాయి వ్యవసాయం ప్రారంభించాలనుకునే వారికి ఇది పర్ఫెక్ట్ మోడల్. ఇందుకోసం ముందుగా నేలను బాగా దున్నుకోవాలి. ఆ తర్వాత సహజ ఎరువులు లేదా కంపోస్ట్‌లను ఉపయోగించాలి. అనంతరం కొత్తిమీర విత్తనాలను శుద్ధి చేసి వరుసలుగా విత్తాలి. రోజూ కొద్దికొద్దిగా నీళ్లు పట్టాలి. పురుగుల నివారణకు నేచురల్ స్ప్రేలు ఉపయోగిస్తే మంచిది.
విత్తనాలకు సుమారు రూ. 150 నుంచి రూ. 200 వరకు అవుతుంది. ఎరువులకు రూ. 500 వరకు అవుతుంది. ఇతర ఖర్చులకు రూ. 300 అవుతుంది. ఇలా మొత్తంగా చెప్పాలంటే 100 గజాల్లో కొత్తమీర సాగు చేయాలంటే రూ. 1000 వరకు అవుతుంది.
55
లాభం ఎంత వస్తుంది?
100 గజాల్లో కొత్తిమీర సాధారణంగా 60–90 కిలోల వరకు దిగుబడి ఇస్తుంది. అయితే సీజన్, నిర్వహణ ఆధారంగా లాభం మారుతూ ఉంటుంది. కొత్తిమీర ధర విషయానికొస్తే.. కిలో కొత్తి మీర సుమారు రూ. 50 నుంచి రూ. 100 వరకు ఉంటుంది. సగటున చూసుకుంటే 70 కిలోలకు రూ. 5 వేల వరకు ఆదాయం పొందొచ్చు. ఏడాదికి రూ. 60 వేల వరకు సంపాదించ వచ్చు.