జెఫ్ బెజోస్ స్పేస్ రాకెట్‌: ఇందులో ప్రయాణించాలంటే ఫిట్నెస్ తో పాటు ఎంత ఖర్చు అవుతుందో తెలుసా..?

Ashok Kumar   | Asianet News
Published : Jul 21, 2021, 02:15 PM IST

ప్రపంచంలోని అత్యంత ధనవంతుడైన జెఫ్ బెజోస్ అంతరిక్షంలో ప్రయాణించి సరికొత్త చరిత్ర సృష్టించాడు. అతను బ్లూ ఆరిజిన్ కంపెనీ న్యూ షెపర్డ్ క్యాప్సూల్ నుండి సముద్ర మట్టానికి 106 కిలోమీటర్ల ఎత్తుకు ప్రయాణించాడు. ఇందుకు మొత్తం 10 నిమిషాల 10 సెకన్ల సమయం పట్టింది. 

PREV
16
జెఫ్ బెజోస్ స్పేస్ రాకెట్‌: ఇందులో ప్రయాణించాలంటే ఫిట్నెస్ తో పాటు ఎంత ఖర్చు అవుతుందో తెలుసా..?

జెఫ్ బెజోస్  ఈ ప్రయాణం తరువాత అంతరిక్ష పర్యాటక రంగం  కొత్త మార్గాలు తెరుచుకొనున్నాయి. ఇలాంటి సమయంలో ఈ ఫ్లయిట్  ని ఎలా సందర్శించవచ్చు అనే ప్రశ్నలు తలెత్తాయి. దీని కోసం ఒక వ్యక్తి ఎంత ఫిట్‌గా ఉండాలి, ఒక సీటు కోసం ఎంత డబ్బు ఖర్చు చేయవచ్చు..?  వాటి గురించి తెలుసుకోండి...

26

వీరిని బెజోస్ బృందంలో చేర్చారు
 జెఫ్ బెజోస్‌తో పాటు అతని తమ్ముడు మార్క్ బెజోస్, 82 ఏళ్ల మహిళ వాలీ ఫంక్, 18 ఏళ్ల యువ ఆలివర్ డామన్ ఉన్నారు. అయితే బ్లూ ఆరిజిన్  ఫ్లయిట్ లో ప్రయాణించడానికి అవసరమైన ప్రమాణాలను వీరందరూ  సాధించారు. 
 
36

ఫ్లయిట్ ప్రయాణానికి ఈ ప్రమాణాలు అవసరం
 కంపెనీ వెబ్‌సైట్‌లో ఇచ్చిన సూచనల ప్రకారం ఒక వ్యక్తి న్యూ షెపర్డ్ నుండి అంతరిక్షంలోకి ప్రయాణించడానికి కనీసం 18 సంవత్సరాలు నిండి ఉండాలి. ప్రయాణీకులు 5 అడుగుల నుండి 6 అడుగుల 4 అంగుళాల పొడవు ఉండాలి. వారి బరువు 110 పౌండ్ల నుండి 223 పౌండ్ల మధ్య ఉండాలి అంటే 50 కిలోల నుండి 100 కిలోల మధ్య. 

46

అంతేకాకుండా సంబంధిత వ్యక్తి ఒకటిన్నర నిమిషాల్లో అంటే 90 సెకన్లలో ఏడు సార్లు మెట్లు ఎక్కడం, దిగడం చేయడం ద్వారా  ఫిట్‌నెస్‌ను చూపించాల్సి ఉంటుంది. అలాగే, 15 సెకన్లలో మీ సీట్ బెల్ట్ వేసుకోవడం, తీయడం నేర్చువాలి. ఇంకా ఫ్లయిట్ లో సుమారు ఒకటిన్నర గంటల పాటు గడపవలసి ఉంటుంది.

56

ఒక్కరికీ ఛార్జీ ఎంత ?
సమాచారం ప్రకారం, బ్లూ ఆరిజిన్ సంస్థ ఈ ఫ్లయిట్ ఛార్జీల సమాచారం వెల్లడించలేదు. అయితే, కొంతకాలం క్రితం ఈ ఫ్లయిట్ సీట్ల కోసం కంపెనీ వేలం వేసినప్పుడు, ఒక వ్యక్తి 28 మిలియన్ డాలర్లు అంటే సుమారు 209 కోట్ల రూపాయలకు వేలంలో పొందాడు. అయితే, షెడ్యూల్‌లోని కొన్ని సమస్యల కారణంగా మొదటి వెళ్లే ప్రణాళికను జెఫ్ బెజోస్ వాయిదా వేశారు. తరువాత బ్లూ ఆరిజిన్  తదుపరి ప్రణాళికలో అంతరిక్షంలోకి ప్రయాణించారు.

66

అపోలో మిషన్ కంటే జెఫ్ బెజోస్  సంపద ఎక్కువ
జెఫ్ బెజోస్ ప్రస్తుతం ప్రపంచంలో అత్యంత ధనవంతుడు. నికర విలువ ప్రకారం, జెఫ్ బెజోస్  ప్రస్తుత సంపద అపోలో మిషన్ కోసం ఖర్చు చేసిన మొత్తం కంటే ఎక్కువ. జెఫ్ బెజోస్ ప్రస్తుతం 200 బిలియన్ డాలర్ల నికర విలువను కలిగి ఉన్నారు. అయితే, ఈ ఆస్తి అపోలో మిషన్ కోసం చేసిన మొత్తం ఖర్చు కంటే ఎక్కువ అని విశ్లేషకులు చెబుతుంటారు. నాసా ప్రకారం, 1973లో అపోలో మిషన్ కోసం మొత్తం 19.4 బిలియన్లు ఖర్చు చేశారు, అంటే నేటి ప్రకారం సుమారు 118.7 బిలియన్ డాలర్లు. ముఖ్యమైన విషయం ఏమిటంటే, బ్లూ ఆరిజిన్ ఏదో ఒక రోజు చంద్రుడిపైకి చేరుకోవాలని ఆశిస్తున్నారు, కాని ఇందుకోసం వారికి చాలా డబ్బు అవసరం.
 
click me!

Recommended Stories