Banks Merge: అతి త్వరలో ఈ నాలుగు బ్యాంకులు కనిపించవు, ఆ బ్యాంకు కస్టమర్లకు కష్టమే

Published : Nov 02, 2025, 03:29 PM IST

Banks Merge: బ్యాంకుల విలీనం అనేది అప్పుడప్పుడు ప్రభుత్వం చేస్తూనే ఉంది. ఇప్పుడు మరొకసారి మెగా విలీనానికి సిద్ధమవుతోంది. నీతి ఆయోగ్ సిఫార్సుతో కొన్ని బ్యాంకులు విలీనం చేయబోతోంది. 

PREV
14
బ్యాంకుల విలీనం

మనదేశంలో బ్యాంకింగ్ రంగం ఎంతో పెద్దది. పదుల సంఖ్యలో బ్యాంకులు ఉన్నాయి. ప్రభుత్వం మరోసారి బ్యాంకుల మెగా విలీనానికి సిద్ధమవుతోంది. నీతి ఆయోగ్ సిఫార్సులను అనుసరించే ఈ పని చేస్తోంది. చిన్న ప్రభుత్వ రంగ బ్యాంకులను పెద్దవాటిలో విలీనం చేయడానికి ప్రయత్నిస్తోంది. నివేదికల ప్రకారం ప్రస్తుతం ఉన్న బ్యాంకుల్లో నాలుగు బ్యాంకులు భవిష్యత్తులో కనిపించవు. ఆ బ్యాంకులు ఏంటో తెలుసుకోండి.

24
ఈ బ్యాంకులు కనిపించవు

ప్రభుత్వం తీసుకునే నిర్ణయం వల్ల నాలుగు ప్రభుత్వ రంగ బ్యాంకులు మూతపడనున్నాయి. దీనివల్ల ఆ బ్యాంకుల్లో ఖాతాలు ఉన్న వ్యక్తులు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. ఇప్పుడు ఈ బ్యాంకులను ఏదైనా పెద్ద బ్యాంకులలో విలీనం చేస్తారు. ఆ విలీనం చేసిన కొత్త బ్యాంకు కస్టమర్ గా మారేందుకు చెక్ బుక్ నుండి పాస్ బుక్ ల వరకు ఎన్నో మార్పులు చేయాల్సి వస్తుంది. అతి త్వరలో ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలను పెద్ద బ్యాంకులలో విలీనం చేసేందుకు సిద్ధమవుతున్నారు.

34
ఏ బ్యాంకులలో కలుపుతారు?

పైన చెప్పిన నాలుగు బ్యాంకులను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా వంటి పెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకులలో విలీనం చేయాలని ప్రభుత్వం కోరుకుంటుంది. భవిష్యత్తులో కూడా మిగతా అన్ని చిన్న బ్యాంకులను ఈ మూడు పెద్ద బ్యాంకుల్లో విలీనం చేయాలన్నది ప్రభుత్వ ఆలోచనగా తెలుస్తోంది. దీనివల్ల మనదేశంలో చాలా కొద్ది సంఖ్యలోనే బ్యాంకులు మిగులుతాయి.

44
విలీనం వల్ల కలిగే నష్టాలు, లాభాలు

చిన్న బ్యాంకులు అధికంగా ఉండడం వల్ల బ్యాంకింగ్ ఖర్చులు పెరిగిపోతాయి. బ్యాంకులు పై ఒత్తిడి కూడా పెరుగుతుంది. బ్యాంకింగ్ వ్యవస్థ బలోపేతం చేయాలంటే చిన్నచిన్న బ్యాంకులు అధిక శాతం ఉండకూడదు. ప్రపంచవ్యాప్తంగా వస్తున్న పోటీని తట్టుకోవడానికి ప్రభుత్వం ఇలా బ్యాంకులను అన్నింటినీ కలిపి పెద్ద బ్యాంకులుగా మార్చేందుకు సిద్ధపడుతోంది. చిన్న బ్యాంకులను.. పెద్ద బ్యాంకులలో విలీనం చేయడం వల్ల బ్యాంకింగ్ వ్యవస్థ బలోపేతం అవుతుందన్నది ప్రభుత్వాలోచన. అలాగే బ్యాంకులు ఇచ్చే రుణ సామర్థ్యం కూడా పెరుగుతుందని చెబుతోంది. గతంలో 2017 నుంచి 2020 మధ్య ప్రభుత్వం పది ప్రభుత్వరంగ బ్యాంకులను విలీనం చేసింది. ఇంతకుముందు బ్యాంకుల సంఖ్య 27 ఉండేది. ప్రస్తుతం 12కు తగ్గింది. ఈ 12 ను కూడా నాలుగు చేయాలన్నది ప్రభుత్వ ఆలోచన.

Read more Photos on
click me!

Recommended Stories