మనమందరం తరచూ రైళ్లలో ప్రయాణిస్తుంటాం. కాని ట్రైన్స్ లో ఉండే కొన్ని విషయాల గురించి అసలు పట్టించుకోం. రైళ్లలో ప్రయాణం ఎంత సౌకర్యంగా ఉంటుందో.. నిర్లక్ష్యంగా ఉంటే ప్రమాదాలకు కూడా అంతే ఛాన్స్ ఉంటుంది. ఇలా ప్రమాదాలు జరగకుండా రైల్వే శాఖ ఎన్నో ఏర్పాట్లు చేసింది. అలాంటి వాటి గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
భారతదేశంలో 1951లో రైల్వే వ్యవస్థ ప్రారంభమైంది. అప్పటి వరకు దేశవ్యాప్తంగా ఉన్న 42 వేర్వేరు రైల్వే కంపెనీలు కలిసి ఇండియన్ రైల్వేస్ ఏర్పడ్డాయి. అయితే అంతకు ముందే అంటే బ్రిటీష్ పరిపాలనలోనే రైల్వే వ్యవస్థ ఉండేది. 1835లో మద్రాస్‌లోని రెడ్ హిల్స్, చింతాద్రిపేట్ మధ్య రైల్వే ట్రాక్ నిర్మించారు. 1837లో దీన్ని ప్రారంభించారు. మొదటి ప్యాసింజర్ రైలును 1853లో ముంబై-థానే మధ్య నడిపారు. 1854లో తూర్పు భారతదేశపు మొదటి ప్యాసింజర్ రైలు కోల్‌కతా సమీపంలోని హౌరా నుండి హూగ్లీ వరకు నడిపారు. 1925లో మొదటి ఎలక్ట్రిక్ రైలును ముంబైలో ప్రారంభించారు.
ఇండియన్ రైల్వేస్ వేగంగా పురోగతి సాధిస్తోంది. ఇప్పటికే వందే భారత్, వందే మెట్రో వంటి రైళ్లతో రైల్వే శాఖ పరుగులు పెడుతోంది. త్వరలో బుల్లెట్ రైళ్లు కూడా దేశంలో పరుగులు పెట్టనున్నాయి. రైల్వే విస్తరణ ఇంత వేగంగా జరుగుతున్నందున టికెట్ బుకింగ్ సేవలను కూడా సులభతరం చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ లోనూ రైలు టికెట్ బుకింగ్ సేవలు మరింత సింపుల్ చేయడానికి చర్యలు చేపడుతున్నారు. ఇటీవలే భారత ప్రభుత్వం 6 వందే భారత్ రైళ్లను ప్రారంభించి రైల్వే సేవలను ప్రజలకు మరింత చేరువ చేసింది. ఇవి దేశంలోని 280 జిల్లాల మీదుగా రోజూ ప్రయాణించనున్నాయి.
ఇంత వేగంగా డవలప్ అవుతున్న రైళ్లలో మార్పులు కూడా చాలా వేగంగా జరుగుతున్నాయి. ఒకప్పుడు చెక్కపెట్టెల్లాంటి బోగీలు ఉండేవి. వాటి స్థానంలో ఇనుప బోగీలు రావడంతో ప్రయాణం మరింత సౌకర్యంగా, సురక్షితంగా మారింది.
ఇనుప బోగీల తయారీ, ఉపయోగం ప్రారంభమైయ్యాక రైళ్లలో ప్రయాణీకుల సౌకర్యార్థం బోగీలపై మూతలు ఏర్పాటు చేశారు. ఇవి లేకపోతే ప్రయాణం చాలా కష్టమవుతుంది.
రైలు పెట్టెల పైభాగంలో ఉన్న ఈ గుండ్రని మూతలు గాలి ప్రసరణ కోసం ఏర్పాటు చేస్తారు. రైలు పెట్టెల్లో కొన్నిసార్లు గాలి ఆడక ఉక్కిరిబిక్కిరి అవుతుంది. దీన్ని నివారించడానికి గాలి ప్రసరణ కోసం ఈ మూతలు ఉపయోగిస్తారు.
కొన్ని రైళ్ల పైకప్పులోని రంధ్రాలు చిన్నవిగా ఉంటాయి. రైలు లోపల ఉన్న వేడి గాలి ఈ రంధ్రాల ద్వారా బయటకు వెళుతుంది. కిటికీల ద్వారా కూడా వేడి గాలి బయటకు వెళ్తుంది.
భారతీయ రైల్వే ఆసియాలోనే రెండవ అతిపెద్ద రైలు నెట్‌వర్క్. ప్రపంచంలో నాల్గవ అతిపెద్ద రైల్వే నెట్‌వర్క్ కూడా. దాదాపు 8000 రైలు స్టేషన్లతో ఉన్న భారతీయ రైల్వే ప్రజల సౌకర్యానికి ప్రాధాన్యత ఇస్తుంది.
రైలులో ప్రయాణీకుల రద్దీ పెరిగినప్పుడు వేడి గాలి రైలులో ఆవరిస్తుంది. అలాంటి పరిస్థితుల్లో ఈ పైకప్పు వెంటిలేటర్ రంధ్రాల ద్వారా వేడి గాలిని బయటకు పంపుతుంది. దీనివల్ల రైలులో ఉష్ణోగ్రత నియంత్రణలో ఉంటుంది.
రైలులోని ఏసీ పెట్టెలు పూర్తిగా మూసివేసి ఉంటాయి. కిటికీలు మూసివేయడం వల్ల గాలి కూడా ప్రసరించదు. ఇక్కడ వేడి గాలికి కూడా వెళ్లడానికి చోటు ఉండదు. వేడి గాలి నిరంతరం వీస్తే అది మంటలు చెలరేగడానికి కూడా అవకాశం ఉంది. కాబట్టి ఈ గుండ్రని మూత ఉష్ణోగ్రతను నియంత్రించడంలో సహాయపడుతుంది. ఈ మూతలు వర్షాకాలంలో కూడా నీరు లోపలికి రాకుండా రూపొందించి ఏర్పాటు చేస్తారు.