పాన్ కార్డుతో ఆధార్‌ లింకింగ్ కి జూన్ 30 డెడ్ లైన్.. లేదంటే మీ కార్డు పనిచేయదు..

First Published Jun 25, 2021, 1:16 PM IST

న్యూ ఢీల్లీ: మీ పాన్ కార్డును ఇప్పటికీ  ఆధార్ కార్డుతో అనుసంధానించలేదా..? అయితే జాగ్రత్త అనేక ఆర్థిక పరిణామాలు ఉండవచ్చు. పాన్ కార్డును ఆధార్‌తో అనుసంధానించడం ఆదాయపు పన్ను శాఖ తప్పనిసరి చేసింది. కాబట్టి మీరు ఇంకా మీ పాన్ కార్డును ఆధార్‌తో లింక్ చేయకపోతే, అప్రమత్తంగా ఉండండి.
 

పాన్ కార్డ్ హోల్డర్లు తమ ఆధార్ కార్డుతో లింక్ చేయకపోతే జూలై 1 నుండి అధిక పన్ను మినహాయింపును సోర్స్ (టిడిఎస్) పొందవలసి ఉంటుంది. అయితే పాన్ కార్డును ఆధార్ కార్డుతో అనుసంధానించడానికి చివరి తేదీ జూన్ 30.ఆదాయపు పన్ను నిబంధనలు 1962లోని సెక్షన్ 206AA, రూల్ 114AAA (3) ప్రకారం, ప్రజలు పాన్ కార్డును ఆధార్ కార్డుతో లింక్ చేయడంలో విఫలమైతే జూన్ 30 నాటికి అధిక టిడిఎస్ @20 శాతం వసూలు చేయబడుతుంది. అయితే టిడిఎస్ అధిక రేటు @20 శాతం ఫిక్సెడ్ డిపాజిట్, డివిడెండ్లపై వడ్డీ నుండి పొందిన ఆదాయాలపై తీసివేయబడుతుంది.
undefined
అలాగే ఈ గందరగోళాన్ని నివారించడానికి మీ పాన్ కార్డ్‌ను ఆధార్‌తో అనుసంధానించడం గురించి మీరు బ్యాంకింగ్ అధికారులకు అప్ డేట్ అందించాలి, తద్వారా వారు మీ పెట్టుబడులపై అధిక టిడిఎస్‌ను కట్ చేయరు. ఒకవేళ మీ టిడిఎస్‌ను అధిక రేటుతో కట్ చేస్తే ఆర్థిక సంవత్సరానికి మీ ఆదాయపు పన్ను రిటర్న్ (ఐటిఆర్) ను దాఖలు చేసే ముందు అదనపు టిడిఎస్ రిటర్న్ కోసం మీరు దరఖాస్తు చేసుకోవచ్చు.అలాగే మీరు పాన్‌ను ఆధార్‌తో అనుసంధానించడానికి గడువులోగా విఫలమైతే మీ పాన్ కార్డ్ పనిచేయకపోవటం లేదా ఆలస్య రుసుము చెల్లించాల్సి ఉంటుంది.
undefined
పాన్ కార్డును ఆధార్‌తో అనుసంధానించడానికి ఇంతకుముందు గడువు 31 మార్చి 2021. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్స్ (సిబిడిటి) పెర్మనెంట్ అక్కౌంట్ నెంబర్ (పాన్) కార్డును ఆధార్ కార్డుతో అనుసంధానించేందుకు గడువును 30 జూన్ 2021 వరకు అంటే మూడు నెలల వరకు పొడిగించింది. మీరు ఎస్‌ఎం‌ఎస్ ద్వారా, ఆదాయపు పన్ను శాఖ వెబ్‌సైట్ ద్వారా మరియు పాన్ సేవా కేంద్రాన్ని సందర్శించడం ద్వారా లింక్ చేయవచ్చు.
undefined
ఎస్‌ఎం‌ఎస్‌ ద్వారా లింక్ ఆధార్, పాన్ కార్డ్ లింకింగ్ ఎలా చేయాలంటేమీ ఫోన్‌లో పెద్ద అక్షరంలో UIDPAN అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ ఆధార్ నంబర్, పాన్ నంబర్‌ ఎంటర్ చేయండిఈ మెసేజ్ 567678 లేదా 56161 కు పంపండి.దీని తరువాత ఆదాయపు పన్ను శాఖ ఆధార్ నంబరుతో పాన్ నంబర్‌ అనుసంధానించే ప్రక్రియను ప్రారంభిస్తుంది.
undefined
ఆన్‌లైన్ ద్వారామీరు ఇంట్లో కూర్చుని ఆన్‌లైన్‌లో ఆధార్, పాన్ కార్డ్ లింక్ చేయవచ్చు. ఆదాయపు పన్ను శాఖ ఇ-ఫైలింగ్ పోర్టల్‌లో సేవల జాబితాలో 'లింక్ ఆధార్' ఆప్షన్ ఇచ్చారు. దీన్ని క్లిక్ చేసిన తరువాత కస్టమర్లు పేరు, పాన్ కార్డ్ నంబర్, ఆధార్ నంబర్ వంటి వివరాలను ఎంటర్ చేశాక కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. మీ మొబైల్ నంబర్‌కు ఓ‌టి‌పి కూడా వస్తుంది. ఓ‌టి‌పి ఎంటర్ చేసిన తరువాత వివరాలు ధృవీకరించబడతాయి తరువాత ఆధార్, పాన్ కార్డ్ లింక్ చేయబడుతుంది.
undefined
పాన్ సర్వీస్ కేంద్రంలోవినియోగదారులు పాన్ కార్డుతో ఆధార్ నంబర్‌ను మాన్యువల్‌గా లింక్ చేయాలనుకుంటే మీ సమీప ఈ-సేవా లేదా పాన్ కార్డ్ సర్వీస్ కేంద్రాన్ని సందర్శించడం ద్వారా చేసుకోవచ్చు. పాన్ కార్డ్, ఆధార్ కార్డుతో లింక్ చేయడానికి 'అనెక్చర్-ఐ' అనే ఫారమ్ నింపి సమర్పించాలి. దీనితో పాటు మీరు మీ పాన్, ఆధార్ కార్డు కాపీని సమర్పించాలి. ఆన్‌లైన్ సర్వీస్ లాగానే ఈ సౌకర్యం ఉచితం కాదు. దీనికి మీరు నిర్దేశించిన రుసుమును చెల్లించాలి.
undefined
click me!