ఫ్లిప్‌కార్ట్ వరుస భారీ డిస్కౌంట్ సేల్స్ నిర్వహిస్తూ వినియోగదారులను ఆకట్టుకుంటోంది. గణేష్ ఉత్సవాలు, దసరా నవరాత్రులు సందర్భంగా ప్రత్యేకంగా గ్రేట్ ఇండియా సేల్స్ నిర్వహించి ఫ్లిక్ కార్ట్ ఇప్పుడ మరో సరికొత్త సేల్స్ తో మార్కెట్లో సందడి చేస్తోంది. భారీ ఆఫర్లు ప్రకటించి వినియోగదారులను ఆకట్టుకుంటోంది.
ఫ్లిప్‌కార్ట్ బిగ్ దీపావళి సేల్ 2024 అక్టోబర్ 21 నుండి అక్టోబర్ 31 వరకు జరుగుతుంది. ఈ సేల్‌లో ఎలక్ట్రానిక్స్ వస్తువులపై భారీ డిస్కౌంట్లు లభిస్తాయి. ఆపిల్, సామ్‌సంగ్, రియల్‌మీ, ఒప్పో, నథింగ్, మోటరోలా వంటి స్మార్ట్‌ఫోన్ బ్రాండ్‌లు తమ మొబైల్‌లను తక్కువ ధరకు అందిస్తున్నాయి. కూపన్ డిస్కౌంట్లు, ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లు, బ్యాంక్ ఆఫర్‌లు వంటి అదనపు ప్రయోజనాలు కూడా ఉన్నాయి.
ఐఫోన్ 16 డిస్కౌంట్
మీరు ఐఫోన్ 16 కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? అయితే ఫ్లిప్‌కార్ట్ బిగ్ దీపావళి సేల్ లో మంచి డిస్కౌంట్ తో లభిస్తోంది. ఐఫోన్ 16లోని వివిధ మోడల్స్ ధరలు రూ.79,900 నుంచి రూ.1,44,900 మధ్య ఉన్నాయి. ఫ్లిప్‌కార్ట్ బిగ్ దీపావళి సేల్ లో ప్రత్యేకమైన తగ్గింపుతో పాటు ఎస్‌బిఐ, మాస్టర్ కార్డ్ కలిగిన వారు 10% తక్షణ తగ్గింపు పొందవచ్చు. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు మరో 5% క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. ఉత్పత్తి పేజీలలో అందుబాటులో ఉన్న ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లను కూడా వినియోగదారులు ఉపయోగించుకోవచ్చు. పేర్కొన్న అమ్మకపు ధరలలో ఈ అదనపు ప్రయోజనాలు కూడా ఉంటాయి.
ఐఫోన్ 16 సిరీస్ సెప్టెంబర్‌లో భారతదేశంలో విడుదలైంది. ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ 256 GB వేరియంట్ ధర రూ.1,44,900. అయితే ప్రస్తుతం జరుగుతున్న ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో వినియోగదారులు ఈ మొబైల్‌ను రూ.1,30,410కి కొనుగోలు చేయవచ్చు. సెప్టెంబర్ 2023లో విడుదలైన ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ 128 GB మోడల్ ధర రూ.1,34,900 ఉంది. ఈ వెర్షన్ ప్రస్తుతం రూ.1,23,999కి లభిస్తోంది.
iPhone 16 సిరీస్‌లోనే పలు మోడళ్లను మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. iPhone 16, iPhone 16 Plus, iPhone 16 Pro, iPhone 16 Pro Max వేటికవే ప్రత్యేక ధరను కలిగి ఉన్నాయి. మీ రిక్వైర్ మెంట్ ను బట్టి రూ.79,900 లభించే ఫోన్ కూడా ప్రత్యేకమైన డిస్కౌంట్ లో పొందవచ్చు.
అలాగే పాత ఐఫోన్ 13, 128GB వేరియంట్, రూ.79,900 ధరకు ఇప్పుడు రూ.49,990కి లభిస్తోంది. దీపావళి సేల్‌లో టాబ్లెట్‌లపై కూడా అనేక ఆఫర్‌లు ఉన్నాయి. ఫ్లిప్‌కార్ట్ బిగ్ దీపావళి సేల్ 2024లో ఆపిల్ ఐప్యాడ్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌తో పోల్చదగిన ధరలో లభిస్తుంది.
రూ.20,000 లోపు బడ్జెట్ ఉన్నవారికి ఫ్లిప్‌కార్ట్ ఆపిల్ ఐప్యాడ్ 9వ తరం టాబ్లెట్‌ను అందిస్తోంది. ఈ ఆఫర్‌లో బ్యాంక్ ఆఫర్‌లు, నో కాస్ట్ EMI ఎంపికలు ఉన్నాయి. ఇది కొనుగోలుదారులకు అద్భుతమైన ఎంపిక అని చెప్పొచ్చు. ఆపిల్ ఐప్యాడ్ ధర రూ.30,999. అయితే 64 GB వేరియంట్ ప్రస్తుతం రూ.19,999కి లభిస్తోంది. అలాగే SBI క్రెడిట్ కార్డ్ ద్వారా చెల్లించినప్పుడు రూ.2,500 అదనపు తగ్గింపు లభిస్తుంది.
ఇవి కాకుండా Phone 15, iPhone 15 Plus, iPhone 15 Pro, iPhone 15 Pro Max, Vivo x 100, OPPO Reno 11, Xiaomi 14 CIVI, Infinix Note 40 5G, Pixel 7a, Moto Edge 40, POCO C55, Samsung Galaxy S24 5G, Motorola g04s ఫోన్లు కూడా ఎక్స్ ఛేంజ్ ఆఫర్లలో భారీ తగ్గింపుతో లభిస్తున్నాయి. అవసరమైన వారు ఫ్లిక్ కార్ట్ అఫీషియల్ వెబ్ సైట్ లో పూర్తి వివరాలు పరిశీలించండి.