Best Selfie Phones: సెల్ఫీలు, సెల్పీ రీల్స్ తీసుకునేందుకు ఇప్పటి యువత ఇష్టపడుతోంది. వారి కోసమే రూ.20 వేల లోపు బెస్ట్ సెల్ఫీ ఫోనుల గురించి ఇక్కడ ఇచ్చాము. బడ్జెట్ ధరలో వస్తున్న ఈ స్మార్ట్‌ఫోన్ల వివరాలు తెలుసుకోండి.
ఇండియన్ మార్కెట్లో మోటరోలా ఎప్పుడూ ట్రెండింగ్‌లోనే ఉంటుంది.
క్లీన్ ఆండ్రాయిడ్ ఎక్స్‌పీరియన్స్, బెస్ట్ కెమెరా దీని సొంతం.
ఇందులో 32 మెగాపిక్సెల్ హై-రిజల్యూషన్ ఫ్రంట్ కెమెరాను ఇచ్చారు.
గ్రూప్ సెల్ఫీల కోసం ఈ ఫోన్‌ను ప్రత్యేకంగా డిజైన్ చేశారు.
సెల్ఫీల కోసం ఫోన్ కొనేటప్పుడు మీరు ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఒకటుంది. సెల్ఫీలు తీసేటప్పుడు అపర్చర్, ప్రాసెసర్ కూడా చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. మంచి ప్రాసెసర్ ఉంటేనే ఫోటోలు ఎఫెక్టివ్‌గా వస్తాయి.