సెప్టెంబర్ 22, 2026న హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల బంగారం ధర స్వల్పంగా పెరిగింది. 10 గ్రాములపై రూ.170 పెరగడంతో 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,54,750కి చేరింది. ఇక 22 క్యారెట్ల బంగారం ధర కూడా పెరిగింది. 10 గ్రాములపై రూ.150 పెరగడంతో 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,41,850గా నమోదైంది.
మరోవైపు వెండి ధర మాత్రం తగ్గింది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, వరంగల్, నిజామాబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడపలో కిలో వెండి ధర రూ.5,000 తగ్గింది. దీంతో కిలో స్వచ్ఛమైన వెండి ధర రూ.2,55,000గా ఉంది. గ్రాము వెండి ధర దాదాపు రూ.255 వద్ద కొనసాగుతోంది.