Top 5 Budget Cars: రూ.6 లక్షల లోపు వచ్చే టాప్ 5 ఫ్యామిలీ కార్లు ఇవిగో, లగ్జరీగా కనిపిస్తాయి

Published : Mar 29, 2026, 11:49 AM IST

Top 5 Budget Cars: భారత్‌లో మధ్యతరగతి, ఎగువ మధ్య తరగతి వారే ఎక్కువ. వారు కారు కొనేందుకు ఎక్కువ ఖర్చు పెట్టలేరు. అలాంటి వారికి రూ.6 లక్షల లోపు వచ్చే బడ్జెట్‌లో కార్లు ఇవిగో. ఇవి టాప్ 5 ఫ్యామిలీ బడ్జెట్ కార్లు.

PREV
15
మారుతి సుజుకి ఆల్టో

మనదేశంలో 'బడ్జెట్ రాజా'గా పేరుగాంచిన కారు ఆల్టో.  మొదటిసారి కారు కొనేవారికి ఇప్పటికీ ఇదే మొదటి ఛాయిస్. దీని ధర సుమారు కేవలం రూ.3.99 లక్షల నుంచే మొదలవుతుంది. 1.0-లీటర్ పెట్రోల్ ఇంజిన్‌తో వచ్చే ఈ కారు, లీటరుకు 24.39 కి.మీ. మైలేజీ ఇస్తుంది. దీని మెయింటెన్స్  చేయడం కూడా చాలా సులువు,  ఖర్చు తక్కువ అవుతుంది.

25
రెనాల్ట్ క్విడ్

తక్కువ బడ్జెట్‌లో ఉండే అత్యంత స్టైలిష్ కారు  ఇది. దీని ప్రారంభ ధర సుమారు రూ.4.70 లక్షలు. ఈ కారులో అదిరే ఫీచర్లు కూడా ఉన్నాయి.   8-అంగుళాల టచ్‌స్క్రీన్, రివర్స్ కెమెరా వంటి లగ్జరీ ఫీచర్లు ఉన్నాయి. దీని లుక్ స్పోర్టీగా ఉంటుంది. యువతకు ఇది బాగా నచ్చుతుంది.

35
మారుతి సుజుకి ఎస్-ప్రెస్సో

తక్కువ బడ్జెట్‌లో మీకు మినీ SUV లాంటి లుక్ తో కారు కావాలంటే ఎస్ ప్రెస్సో కారు కొనుక్కోవడమే బెటర్. ఎత్తుపల్లాల రోడ్లపై ఇది చాలా చక్కగా ప్రయాణిస్తుంది. దీని ధర సుమారు రూ.4.26 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. మంచి స్పేస్, డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ వంటి ఆధునిక ఫీచర్లతో ఈ కారు వస్తుంది.

45
టాటా టియాగో

చిన్న ఫ్యామిలీకి సరిపోయే బుజ్జి కారు ఇది.  భద్రతాపరంగా కూడా  టాటా టియాగో మంచి కారు అని చెప్పుకోవాలి. 4-స్టార్ సేఫ్టీ రేటింగ్ ఉన్న ఈ కారు ధర రూ.5.65 లక్షల నుంచి మొదలవుతుంది. ఈ కారులో హర్మాన్ మ్యూజిక్ సిస్టమ్ వంటి హై-ఎండ్ ఫీచర్లను కూడా కలిగి ఉంది.

55
మారుతి సుజుకి సెలెరియో

బెస్ట్ మైలేజ్ కావాలనుకునే వారికి ఈ కారు అదిరిపోయే ఛాయిస్. సెలెరియో  కారు  లీటరుకు 26.68 కి.మీల వరకు మైలేజ్ ఇస్తుందని కంపెనీ చెబుతోంది. దీని ఇంటీరియర్ విశాలమైన స్థలంతో తయారుచేశారు. దీని ధర సుమారు రూ.5.37 లక్షల నుంచి ప్రారంభమవుతుంది.

Read more Photos on
click me!

Recommended Stories