Check Bounce: అప్పు ఇచ్చేటప్పుడు చెక్ తీసుకుని ఈ తప్పు చేస్తే కోర్టులో మీ కేసు నిలవదు..

Published : Mar 29, 2026, 09:00 AM IST

Check Bounce: మీరు ఎవరికైనా అప్పు ఇచ్చి, వారు ఇచ్చిన చెక్ బౌన్స్ అయ్యిందా.? చెక్ బౌన్స్ కేసును ఎలా ఫైల్ చేయాలి? నిందితుడికి ఎలాంటి శిక్షలు పడతాయి.? వంటి పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి. 

PREV
15
చెక్ బౌన్స్ కేసు నోటీసు పంపడం నుంచి..

చెక్ బౌన్స్ అనేది ఈ రోజుల్లో చాలా మంది ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య. అప్పుగా ఇచ్చిన డబ్బును తిరిగి పొందే క్రమంలో ఎవరైనా చెక్ ఇచ్చి, అది బ్యాంకులో బౌన్స్ అయితే, బాధితులు చట్టపరంగా ఆ డబ్బును ఎలా వసూలు చేసుకోవచ్చోనని అడ్వకేట్ వివరించారు.

25
చెక్ బౌన్స్ కేసు ఎప్పుడు ఫైల్ చేయాలి?

వ్యాలిడిటీ: చెక్ మీద ఉన్న తేదీ నుంచి మూడు నెలల వరకు దానికి వ్యాలిడిటీ ఉంటుంది. ఈలోపు దానిని బ్యాంకులో డిపాజిట్ చేయాలి.

రిటర్న్ మెమో: బ్యాంకులో అమౌంట్ లేక చెక్ రిటర్న్ అయినప్పుడు బ్యాంక్ వారు ఇచ్చే 'రిటర్న్ మెమో' అనేది కోర్టులో కీలకమైన సాక్ష్యం.

లీగల్ నోటీసు: చెక్ బౌన్స్ అయిన 30 రోజుల్లోపు అవతలి వ్యక్తికి లీగల్ నోటీసు పంపాలి. నోటీసు అందిన 15 రోజుల్లోపు వారు స్పందించకపోతే లేదా డబ్బు ఇవ్వకపోతే, ఆ తర్వాత 30 రోజుల్లోపు కోర్టులో ఫిర్యాదు చేయాలి.

35
ముఖ్యమైన జాగ్రత్తలు

సిగ్నేచర్, తేదీ: చెక్ మీద ఉన్న సంతకం అవతలి వ్యక్తిదే అయి ఉండాలి. ఒకవేళ సంతకం మారినా లేదా ఫోర్జరీ చేసినా అది క్రిమినల్ నేరం కిందకు వస్తుంది.

ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్స్: అప్పు ఇచ్చేటప్పుడు ఆన్‌లైన్ లేదా బ్యాంక్ ద్వారా డబ్బు పంపితే కోర్టులో నిరూపించడం చాలా సులభం అవుతుంది.

ఫోరెన్సిక్ ల్యాబ్: సంతకం విషయంలో గొడవ వస్తే, ఆ సంతకం ఎప్పుడు చేశారు అనే విషయాన్ని ఫోరెన్సిక్ ల్యాబ్ ద్వారా నిరూపించే అవకాశం ఉంది.

45
శిక్ష, జరిమానా

చెక్ బౌన్స్ కేసులో నేరం నిరూపితమైతే నిందితుడికి రెండేళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. అలాగే, చెక్ మీద ఉన్న అమౌంట్ కు రెట్టింపు జరిమానా విధించవచ్చు. దీనితో పాటు సివిల్ కోర్టులో మనీ రికవరీ సూట్ ఫైల్ చేసి వారి ఆస్తులను కూడా అటాచ్ చేయవచ్చు.

55
కాలపరిమితి ముఖ్యం

చెక్ బౌన్స్ కేసుల విషయంలో కాలపరిమితి అనేది చాలా ముఖ్యం. ఏ చిన్న అజాగ్రత్త వహించినా కేసు వీగిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి సరైన న్యాయవాది సలహాతో సకాలంలో స్పందించడం అవసరం.

Read more Photos on
click me!

Recommended Stories