బంగారం గురించి ఈ వార్త వింటే మహిళలకు ఉల్లి కోయకుండానే కన్నీళ్లు రావడం ఖాయం..త్వరలోనే తులం పసిడి ఎంతంటే..?

First Published Jan 4, 2023, 1:28 PM IST

ఇది మహిళలకు కన్నీళ్లు పెట్టించే  వార్త  ఎందుకంటే బంగారం ధరలు రోజురోజుకు ఆకాశాన్ని తాకుతున్నాయి. కొత్త సంవత్సరం బంగారం ధరలు  భారీగా పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే  24 క్యారెట్ల తులం (10  గ్రాములు) బంగారం ధర 54,000 దాటింది.

అతి త్వరలోనే పసిడి ధర ఏకంగా 60 వేలు దాటే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.  దీనికి కారణం లేకపోలేదు.  ఎందుకంటే పెరుగుతున్న కరోనా కేసులు ప్రపంచ మార్కెట్లను కలవరపెడుతున్నాయి ముఖ్యంగా చైనా లో కరోనా కేసుల ఒక్కసారిగా ఉధృతి పెరిగింది.  గతంలో కరోనా కేసులు పెరిగినప్పుడు కూడా పసిడి ధరలు జోరందుకున్నాయి. 
 

బంగారానికి కరోనా కేసులకు ఒక విచిత్రమైన బంధం ఉంది. ఎప్పుడైతే కరోనా కేసులు పెరుగుతాయో, అప్పుడు ప్రపంచ మార్కెట్లలో కలవరం మొదలవుతుంది. స్టాక్ మార్కెట్ల నుంచి  మదుపుదార్లు తమ సంపదను  సేఫ్ పెట్టుబడి అయినా బంగారం వైపు తరలిస్తారు.  బంగారం ధర మార్కెట్ లో పుంజుకోవడం సహజం. బంగారం ధరలు పెరగడం వెనక అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితులే అసలు కారణం. ఎప్పుడైతే స్టాక్ మార్కెట్లు పతనం అవుతాయో,  అప్పుడు బంగారం ధరలు పెరుగుతాయి.
 

ఉక్రెయిన్ రష్యా యుద్ధం ఇంకా కొనసాగడం కూడా,  బంగారం ధరలు పెరగడానికి ఒక కారణంగా కనిపిస్తోంది.  అలాగే అమెరికా మార్కెట్లో ద్రవ్యోల్బణం, ఉద్యోగాల కోత కారణంగా బంగారం ధరలు వరుసగా పెరుగుతున్నాయి.  అయితే బంగారం ధరలు దేశీయంగా పెరగడానికి కేంద్ర ప్రభుత్వం విధించే ఎక్సైజ్ డ్యూటీ లు, జీఎస్టీ, స్థానిక పన్నులు కూడా ఒక కారణంగా తెలుస్తోంది. 

2020 సంవత్సరం లో పసిడి ధరలు ఉవ్వెత్తున ఎగిశాయి. 10 గ్రాముల బంగారం ధర ఏకంగా 56 వేల మార్కును తాకింది. అయితే అక్కడి నుంచి సుమారు రెండు సంవత్సరాల పాటు  పసిడి ధరలు పెద్దగా పెరగలేదు.  50 నుంచి 53 వేల మధ్యలోపసిడి ధరలు కొనసాగుతూ వచ్చాయి.  అయితే ఈ సంవత్సరం మాత్రం బంగారం ధరలు భారీగా పెరిగే అవకాశం ఉందని  నిపుణులు చెబుతున్నారు.  బంగారం ధరలు  ప్రస్తుతం ప్రతిరోజు పెరుగుతున్నాయి.  ఇదే స్థాయిలో బంగారం ధరలు పెరుగుతూ పోతే, అతి త్వరలోనే  పసిడి ధర, 10 గ్రాములకు గానూ అరవై వేలు దాటే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. పరిస్థితి మరింత దిగజారితే,  పసిడి ధర తులం రూ.  70 వేల వరకు పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. 
 

బంగారం ధరలు అధికంగా పెరగటంతో భారతీయుల్లో ఆందోళన నెలకొంది.  ఎందుకంటే భారతీయులకు బంగారానికి అవినాభావ సంబంధం ఉంది.  ప్రత్యేకంగా దక్షిణ భారతదేశానికి చెందిన వారు బంగారం అధికంగా కొనుగోలు చేస్తారు.  కేరళ, తమిళనాడు, ఆంధ్ర ప్రదేశ్, కర్ణాటక, తెలంగాణల్లో దాదాపు 75 శాతం మార్కెట్ ఉంటుంది. 
 

దక్షిణ భారతీయుల్లో కటిక పేదరికం లో ఉన్నప్పటికీ కాసు బంగారమైన ఉంచుకునేందుకు ఇష్టపడతారు. దీనికి కారణం వారు బంగారాన్ని సురక్షితమైన పెట్టుబడిగా పరిగణిస్తారు,బంగారాన్ని చెడు సమయాల నుండి రక్షించే  ఆస్తిగా దక్షిణ భారతీయులు భావిస్తుంటారు. అందుకే బంగారం కొనేందుకు ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంటారు. బంగారాన్ని సొంతం చేసుకోవడం చాలా తెలివైన ఎంపికగా పరిగణిస్తుంటారు. 
 

click me!