Business Ideas: మహిళలు ఇంటివద్ద ఉంటూనే రెండు గంటలు కష్టపడితే చాలు, నెలకు రూ. 50 వేలు సంపాదించే బిజినెస్ ఇదే..

First Published Jan 4, 2023, 12:01 PM IST

మహిళలు బిజినెస్ చేయాలని ప్లాన్ చేస్తున్నారా అయితే,  ఓ చక్కటి బిజినెస్ ఐడియా తో మీ ముందుకు వచ్చాను మీ ఖాళీ సమయాన్ని వృధా చేసుకోకుండా కాస్త కష్టపడితే చాలు, ఈ బిజినెస్ ద్వారా మీరు ప్రతిరోజూ వేలల్లో ఆదాయం పొందే అవకాశం ఉంది. అది ఏంటో  ఇప్పుడు తెలుసుకుందాం. 

ప్రస్తుతం నగరాల్లో  బిజీ  బిజీ పనుల మధ్య,  ప్రతి ఒక్కరికి భోజనం చేయడమనేది ఒక సమస్యగా మారిపోయింది.  ముఖ్యంగా ఉద్యోగులు,  వ్యాపారస్తులు,  విద్యార్థులు సమయానికి భోజనం చేద్దాం సరైన మార్గం  లభించడంలేదు దీంతో ఏం చేయాలా అని ఆలోచిస్తూ ఉంటారు. హోటల్ రెస్టారెంట్ వంటి వాటిల్లో భోజనం చేయాలంటే ప్రతి రోజూ కుదరదు కనీసం 200 నుంచి 500 వరకు ఖర్చవుతుంది.  ప్రతిరోజు అంత ఖర్చు పెట్టి భోజనం చేయాలంటే సామాన్యులకు కుదరని పని.  దీన్నే మీరు ఒక వ్యాపార అవకాశంగా మార్చుకోవచ్చు. 
 

Those who do not spend money are born in this sign

మహిళలు తమ ఇంటి వద్ద ఉంటూనే రోజుకు రెండు మూడు గంటలు కష్టపడడం ద్వారా ఈ వ్యాపారం సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. మధ్యాహ్న భోజనం సప్లై చేయడం ద్వారా మీరు చక్కటి ఆదాయం పొందుతారు.  ముఖ్యంగా ఫ్యాక్టరీలు,  విద్యాసంస్థలు,  ఆఫీసులు,  మార్కెట్లు సమీపంలో మీరు కనీసం ఓ యాభై మందికి భోజనం ప్రిపేర్ చేసుకొని అందుబాటులో పెడితే చక్కటి ఆదాయం పొందే అవకాశం ఉంది.  
 

ముందుగా 50 మందికి సరిపడా భోజనానికి ప్రిపేర్ చేసుకునేందుకు మీకు ఏమేమి వస్తువులు కావాలో,  హోల్సేల్ మార్కెట్ నుంచి కొనుగోలు చేసుకోవాలి.  అదేవిధంగా కూరగాయలను కూడా బల్క్ ఆర్డర్ ద్వారా పొందాలి. స్ట్రీట్ సైడ్ ఫుడ్ స్టాల్ పెట్టుకోవడం ద్వారా  అద్దెలు కలిసి వస్తాయి.  కానీ స్థానిక మున్సిపాలిటీ నుంచి పర్మిషన్ తీసుకోవాలి. మారుతీ వ్యాన్ లాంటిది ఏర్పాటు చేసుకుంటే మంచిది. ఒక సహాయకుని కూడా పెట్టుకోవాలి.  ముందుగా మీరు ఎంపిక చేసుకున్న ప్రాంతంలో  20 మందికి సరిపడా భోజనం అందుబాటులో ఉంచాలి. ఒకవేళ మీరు ఏర్పాటు చేసుకున్న భోజనం పూర్తి అయ్యి మీకు డబ్బు వచ్చినట్లయితే, మరొక రోజు పది ప్లేట్లు పెంచుకోవాలి.  అలా 50 ప్లేట్లకు  సరిపడా భోజనం సిద్ధం చేసుకోవాలి. తద్వారా మీరు  ప్రతిరోజు ఫిక్స్డ్ ఆదాయం పొందే వీలుంది. 
 

ఒక ప్లేట్ భోజనం ధర  ఉదాహరణకు రూ.70 ఫిక్స్ చేసుకుంటే, మీకు 50 ప్లేట్లకు గానూ 3500 వరకూ ఆదాయం వస్తుంది. ఖర్చులు, వాహనం ఖర్చు కనీసం రూ.2000 పోయినా, మీకు రోజుకు రూ.1500 వరకూ మిగులుతుంది. ఈ లెక్కన కనీసం 30 రోజులకు గానూ, కనీసం 45000 వరకూ ఆదాయం లభించే అవకాశం ఉంది. అయితే రుచి నాణ్యత మెయిన్ టెయిన్ చేస్తే, కనీసం వంద ప్లేట్ల వరకూ అమ్ముడు పోయే అవకాశం ఉంది.  డిమాండ్ ను బట్టి ప్లేట్ల సంఖ్యను పెంచుకోవాలి. నాన్ వెజ్ కర్రీలకు సెపరేట్ రేటు పెట్టుకోవాలి. ఉడికించిన కోడిగుడ్డుకు కూడా కనీసం రూ. 10 ధర నిర్ణయిస్తే మీకు అదనపు ఆదాయం లభిస్తుంది.     
 

click me!