Delhi palace: నెహ్రు ఇల్లును కొనేశాడు, ఇప్పుడు ఢిల్లీ రాజభవంతిని కొనేస్తున్నాడు.. ఎవరు ఈ వ్యక్తి?

Published : Apr 01, 2026, 03:04 PM IST

Delhi palace: ఢిల్లీలో భారీ రాజభవనాన్ని కొనేందుకు ఒక వ్యక్తి సిద్ధపడ్డాడు. గతంలో ఇతను నెహ్రూ నివసించిన భవనాన్ని కొనుగోలు చేశాడు. అతను ఎవరో, ఏం వ్యాపారం చేస్తాడో తెలుసుకునేందుకు ఎక్కువ మందికి ఆసక్తి ఉంది. అతనెవరో తెలుసుకోండి. 

PREV
14
ఢిల్లీలో భారీ ఇల్లు అమ్మకం

మన దేశ రాజధాని ఢిల్లీలో భారీ రియల్ ఎస్టేట్ డీల్ జరగబోతున్నట్టు సమాచారం. ఉత్తరాఖండ్‌కు చెందిన తేహ్రీ గఢ్వాల్ రాజ కుటుంబానికి చెందిన మహారాజా మనుజేంద్ర షాకు ఢిల్లీలో విలాసవంతమైన భవనం ఉంది. దీని విలువ రూ. 1000 కోట్లకు విక్రయించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. లుటియన్స్ ఢిల్లీ ప్రాంతంలో ఉన్న ఈ బంగ్లా దేశంలోనే అత్యంత ఖరీదైన నివాసాల్లో ఒకటిగా సాధించింది. ఇప్పటివరకు ఢిల్లీలో ఇంత భారీ ధరకు ఇల్లు అమ్ముడు పోవడం చాలా అరుదుగా జరిగింది.

24
ఖరీదైన ప్రాంతంలో ఉన్న ఇల్లు

ఈ బంగ్లా ఎంతో ప్రత్యేకమైనది. ఇది సుమారు 3.2 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించారు. ఢిల్లీలోని భగవాన్ దాస్ రోడ్‌లో ఉన్న ఈ ప్రాపర్టీ అత్యంత ప్రీమియం ప్రాంతంగా చెప్పుకునే లుటియన్స్ బంగ్లా జోన్‌లో ఉంది. ఈ ప్రాంతంలో దేశంలోని ప్రముఖ రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, విదేశీ రాయబారులు నివసిస్తుంటారు. అందువల్ల ఇక్కడి ఆస్తులకు చాలా డిమాండ్ ఉంటుంది. ఈ బంగ్లా కేవలం ఒక ఇల్లు మాత్రమే కాదు.. చరిత్రకు సాక్ష్యంగా నిలిచిన విలువైన ఆస్తిగా చెప్పుకుంటారు. పాతకాలపు నిర్మాణ శైలి, విశాలమైన తోటలు, సౌకర్యాలు ఈ బంగ్లాను మరింత ప్రత్యేకంగా మారుస్తున్నాయి.

34
ఎవరు కొంటున్నారు?

ఇక ఈ బంగ్లాను కొనుగోలు చేయబోయే వ్యక్తి ఎవరు? అంత ఆస్తిపరుడు ఎవరు? అనే సందేహాలు వస్తాయి. తెలిసిన సమాచారం ప్రకారం ఢిల్లీకి చెందిన ఫుడ్ అండ్ బేవరేజ్ రంగానికి చెందిన ఒక ప్రముఖ వ్యాపారవేత్త ఈ ప్రాపర్టీని కొనుగోలు చేయడానికి ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది. అయితే అతని పేరు ఇంకా బయటికి వెల్లడించలేదు. ఇదే వ్యాపారవేత్త గతంలో భారత తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ నివసించిన ఇంటిని కూడా సుమారు రూ.1100 కోట్లకు కొనుగోలు చేయడానికి ఒప్పందం చేసుకున్నారు. దీంతో ఈ వ్యక్తి ఢిల్లీలో అత్యంత ఖరీదైన, చారిత్రక ప్రాపర్టీలను కొంటున్నాడని తెలుస్తోంది.

44
ఇదే ఖరీదైన ఇల్లు

ప్రస్తుతం ఈ భారీ డీల్ చివరి దశకు చేరుకున్నట్టు తెలుస్తోంది. చట్టపరంగా కొనుగోలుదారుడి తరఫున ఒక లా ఫర్మ్ పబ్లిక్ నోటీసు జారీ చేసి, ఎవరైనా ఈ ఆస్తిపై హక్కులు ఉన్నట్లయితే తమ అభ్యంతరాలు తెలియజేయాలని కోరింది. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాతే డీల్ అధికారికంగా పూర్తవుతుంది. ఈ ఒప్పందం పూర్తి అయితే ఢిల్లీలో ఇప్పటివరకు నమోదైన అత్యంత ఖరీదైన బంగ్లా డీల్‌గా నిలిచే అవకాశం ఉంది. ఇప్పటి వరకు రూ.500 నుంచి రూ.600 కోట్ల మధ్యే పెద్ద డీల్స్ జరిగాయి. అయితే ఈ రూ.1000 కోట్ల డీల్ ఢిల్లీ రియల్ ఎస్టేట్ మార్కెట్ విలువను మరింత పెంచేస్తుంది.

Read more Photos on
click me!

Recommended Stories