Sukanya samriddhi yojana: మీ బిడ్డ కోసం సుకన్య సమృద్ధి యోజన మొదలుపెట్టారా? ఎంత వడ్డీ వస్తుందో తెలుసా?

Published : Sep 20, 2025, 01:04 PM IST

సుకన్య సమృద్ధి యోజన (Sukanya Samriddhi yojana) ఆడపిల్లల కోసం మొదలుపెట్టినది. ఆడపిల్లల చదువుకు, పెళ్లికి భరోసా ఇచ్చేందుకు దీన్ని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది.  ఆడపిల్లల ఉజ్వల భవిష్యత్తు కోసం ప్రభుత్వం అందిస్తున్న ఒక చిన్న పొదుపు పథకం. 

PREV
16
సుకన్య సమృద్ధి యోజన

ఇంట్లో ఆడపిల్లల భవిష్యత్తుకు, ఆర్ధిక భద్రత అందించేందుకు పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారా? దానికి ఉత్తమ పథకం సుకన్య సమృద్ధి యోజన (SSY). ఇది  నమ్మకమైన పథకం. ఆడపిల్లల చదువు, పెళ్లి కోసం ఆర్థికంగా సిద్ధమవడానికి ఈ పథకం ఎంతగానో ఉపయోగపడుతుంది. 

26
సుకన్య సమృద్ధి యోజన అంటే ఏమిటి?

సుకన్య సమృద్ధి యోజన అనేది 'బేటీ బచావో, బేటీ పఢావో' ప్రచారంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ఒక చిన్న పొదుపు పథకం. ఈ పథకాన్ని 2015లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఇది ఆడపిల్లలకు ఎంతగాన ఉపయోగపడే పథకం.

36
ప్రస్తుత వడ్డీ రేటు (జూలై - సెప్టెంబర్ 2025)

సంవత్సరానికి 8.2% (చక్రవడ్డీ పద్ధతిలో)

ఈ రేటు ఇతర పొదుపు పథకాల కన్నా ఎక్కువ. దీర్ఘకాలిక పెట్టుబడికి ఇది చాలా లాభదాయకం. 

46
సుకన్య సమృద్ధి యోజన పథకం వల్ల ప్రయోజనాలు
  1. సెక్షన్ 80C కింద ₹1.5 లక్షల వరకు పన్ను మినహాయింపు ఉంటుంది.
  2. వడ్డీ, మెచ్యూరిటీ మొత్తంపై పన్ను ఉండదు.
  3. అధిక వడ్డీ రేటును అందిస్తుంది. 
  4. బ్యాంక్ FDల కన్నా ఈ పథకంలోనే రాబడి ఎక్కువ. 
  5. ప్రభుత్వ హామీ కూడా ఉంటుంది.
  6. కేంద్ర ప్రభుత్వ పథకం కాబట్టి పెట్టుబడికి పూర్తి భద్రత ఉంటుంది.
  7. కేవలం ₹250తో దీన్ని ప్రారంభించవచ్చు.
  8. ఏడాదికి ₹1.5 లక్షల వరకు పెట్టుబడి పెట్టొచ్చు.
  9. కూతురి చదువుకు ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది.
  10. కూతురికి 18 ఏళ్లు నిండాక ఖాతాలోని 50% డబ్బు చదువు కోసం తీసుకోవచ్చు. 
56
ఖాతా తెరవడానికి కావాల్సిన పత్రాలు
  1. జనన ధృవీకరణ పత్రం – మీ కూతురి వయస్సు రుజువు కోసం
  2. తల్లిదండ్రుల గుర్తింపు కార్డు – ఆధార్ కార్డ్ / పాన్ కార్డ్ / పాస్‌పోర్ట్
  3. చిరునామా రుజువు – కరెంట్ బిల్ / టెలిఫోన్ బిల్ / నివాస ధృవీకరణ
  4. పాస్‌పోర్ట్ సైజు ఫోటోలు – తల్లిదండ్రులు, కూతురివి 
66
ఎవరు అర్హులు?
  1. కూతురి వయస్సు 10 ఏళ్ల లోపు ఉండాలి.
  2. తల్లిదండ్రులు లేదా సంరక్షకులు ఈ ఖాతాను తెరవొచ్చు.
  3. ఒక కుటుంబంలో ఇద్దరు ఆడపిల్లల పేరు మీదే ఖాతాలు తెరవచ్చు. మూడో ఆడపిల్లకు అర్హత ఉండదు. కానీ కవల పిల్లలకు మాత్రం మినహాయింపు ఉంటుంది.
  4. బ్యాంక్ లేదా దగ్గర్లోని పోస్టాఫీసులో ఖాతా తెరవొచ్చు.
Read more Photos on
click me!

Recommended Stories