ఉద్యోగులందరూ ఐటీఆర్ (ITR) ఫైల్ చేసే ఉంటారు. పన్ను చెల్లింపుదారులంతా కచ్చితంగా ఇంకమ్ టాక్స్ రిటర్న్ సబ్మిట్ చేయాలి. ఇది సబ్మిట్ చేయడం వల్ల మీరు కొంత డబ్బును రిఫండ్ పొందే అవకాశం ఉంది.
ఆదాయపు పన్ను రిటర్న్ దాఖలు సమయం ముగిసిపోయింది. సెప్టెంబర్ 16నే ఆఖరు తేదీగా ప్రకటించారు. పన్ను చెల్లింపుదారులంతా ఐటిఆర్ ఫైల్ చేశారు. అయితే ఐటిఆర్ ఫైల్ చేశాక రిఫండ్ కోసమే అందరూ ఎదురు చూస్తూ ఉంటారు. ఆ డబ్బు బ్యాంకు ఖాతాలో ఎప్పుడు వస్తుందా అని ఆలోచిస్తారు. ఆదాయపు పన్ను నిబంధన ప్రకారం ఐటిఆర్ దాఖలు చేశాక రిఫండ్ ఎప్పుడు వస్తుందో తెలుసుకోండి.
24
ఎన్ని రోజులకు రీఫండ్?
ఆదాయపు పన్ను శాఖ చెబుతున్న ప్రకారం మీరు ఐటిఆర్ దాఖలు చేశాక మూడు నుండి నాలుగు వారాలపాటు వేచి ఉండాల్సి వస్తుంది. అంటే దాదాపు ఒక నెలపాటు మీరు ఓపిక పట్టాలి. ఆ తర్వాతే రీఫండ్ మీ బ్యాంకు ఖాతాలో పడుతుంది. ఈ సమయం ఈ నెల రోజులపాటు సెక్షన్ 143(1) కింద ఆదాయపు పన్ను శాఖ అంతర్గతంగా దర్యాప్తు చేస్తుంది. తక్కువ మొత్తంలో ఉన్న రీఫండ్లు త్వరగా వచ్చేస్తాయి. కానీ ఎక్కువ మొత్తంలో ఉన్న రిఫండ్ లకు మాత్రం ఎక్కువ సమయం పడుతుంది.
34
రీఫండ్ రాకపోతే
ఐటిఆర్ రిఫండ్ ఆలస్యంగా రావడానికి లేదా మీకు రాకపోవడానికి అనేక కారణాలు ఉంటాయి. పన్ను చెల్లింపు దారులు కచ్చితంగా ఈ-వెరిఫికేషన్ చేసుకోవాలి. అది మర్చిపోయినా కూడా రీఫండ్ రాదు. అలాగే మీకు ఒకటి కన్నా ఎక్కువ ఆదాయ వనరులు ఉన్నా కూడా ఐటిఆర్ ను ఎలాంటి లోపాలు లేకుండా సబ్మిట్ చేయాలి. అందులో లోపాలు ఉన్న ఆదాయపు పన్ను శాఖ రీఫండ్ ఆపేస్తుంది. అలాగే మీకు నోటీసులు పంపిస్తుంది. అలాగే తప్పు బ్యాంకు వివరాలు అందించినా కూడా రీఫండ్ రావడం కష్టం.
ముందుగా ఆదాయపు పన్ను అధికారిక వెబ్ సైట్ అయిన https://eportal.incometax.gov.in/iec/foservices/లోకి ప్రవేశించండి. అక్కడ మీ పాన్ కార్డు, పాస్ వర్డ్ తో లాగిన్ అవ్వండి. అయితే పాన్ కార్డు.. ఆధార్ కార్డుతో కచ్చితంగా లింక్ చేసి ఉండాలి. అలా లాగిన్ అయిన తర్వాత మీ పాన్ వివరాలు, పాస్వర్డ్ వివరాలు ఇవ్వండి. రిటర్న్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి మీరు సబ్మిట్ చేసిన రిటర్న్ లను చూడండి. అక్కడ మీ ఐటీ రిటర్న్ రిఫండ్ స్టేటస్ ఎంతవరకు వచ్చిందో తెలుస్తుంది.