మీరు కూడా ఆన్‌లైన్ మోసాలకి గురయ్యారా..? వెంటనే ఈ నంబర్‌కు కాల్ చేయండి..

First Published Aug 20, 2021, 7:27 PM IST

 భారతదేశంలోని దాదాపు అన్ని బ్యాంకింగ్ సేవలు ఆన్‌లైన్‌ ద్వారా అందుబాటులోకి వచ్చాయి. మరోవైపు ఆన్‌లైన్‌ మోసాలు కూడా మరింత వేగంగా పెరుగుతున్నాయి. ప్రతిరోజూ  ఎవరో ఒకరు  ఆన్‌లైన్ మోసాలకు బలైపోతున్నారు కానీ సరైన అవగాహన లేకపోవడం వల్ల ప్రజలు సరైన సమయంలో   మోసాల గురించి ఫిర్యాదు చేయలేకపోతునారు. 

ఆన్‌లైన్ మోసాలను నిరోధించడానికి  ప్రజల  డబ్బును రక్షించడానికి హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ,  ఢిల్లీ పోలీసుల సైబర్ సెల్ చేతులు కలిపింది. హోం మంత్రిత్వ శాఖ, ఢిల్లీ పోలీసుల సైబర్ సెల్ ప్రజల భద్రత కోసం ఒక హెల్ప్‌లైన్ నంబర్‌ను ప్రారంభించింది, దీని ద్వారా  మీరు వెంటనే  ఆన్‌లైన్‌ మోసాలపై ఫిర్యాదు చేయవచ్చు.  

హోం మంత్రిత్వ శాఖ, ఢిల్లీ పోలీసుల సైబర్ సెల్  155260 అనే హెల్ప్‌లైన్‌ను ప్రారంభించింది. మీరు ఆన్‌లైన్ మోసాలకి గురైనట్లయితే వెంటనే ఈ నంబర్‌కు కాల్ చేయవచ్చు. ఢిల్లీ, రాజస్థాన్, ఉత్తరాఖండ్, ఛత్తీస్‌గఢ్, ఉత్తరప్రదేశ్, అస్సాం, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌లో ఈ హెల్ప్‌లైన్ నంబర్ 24x7 అందుబాటులో ఉంటుంది. ఇతర రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో  ఉదయం 10 నుండి సాయంత్రం 6 గంటల వరకు ఈ హెల్ప్‌లైన్ అందుబాటులో ఉంటుంది.

ఈ సైబర్ పోర్టల్

ఆన్లైన్ మోసాల సంఘటనలు పునరావృతం కాకుండా హోం మంత్రిత్వ శాఖ https://cybercrime.gov.in/, ఢిల్లీ పోలీసులు సైబర్ సెల్  సైబర్ పోర్టల్ 155260 హెల్ప్‌లైన్ నంబర్  పైలట్ ప్రాజెక్ట్ న గత సంవత్సరం నవంబరులో ప్రారంభమైంది కానీ ఇప్పుడు పూర్తిగా అమలులోకి వచ్చింది.  

 'సిటిజన్ ఫైనాన్షియల్ సైబర్ ఫ్రాడ్ రిపోర్టింగ్ సిస్టమ్' పేరుతో 55 బ్యాంకులు, ఇ-వాలెట్లు, ఇ-కామర్స్ సైట్‌లు, పేమెంట్ గేట్‌వేలు ఇతర సంస్థలతో ఇంటర్‌కనెక్ట్ ప్లాట్‌ఫారమ్‌తో ప్రజలకు సహాయపడుతుంది. ఈ ప్లాట్‌ఫారమ్ ద్వారా ఆన్‌లైన్ ఆర్థిక మోసాల నుండి బాధితులను చాలా తక్కువ సమయంలోనే  రక్షించవచ్చు.
 

వీలైనంత త్వరగా మోసాన్ని నివేదించండి

మీరు హెల్ప్‌లైన్ నంబర్ 155260కి కాల్ చేస్తే మొదట మీ పేరు, నంబర్, ఘటన జరిగిన సమయం అడుగుతారు. మీ ప్రాథమిక వివరాలను తీసుకున్నాకా బ్యాంకులు, ఈ-కామర్స్  సంబంధిత పోర్టల్,  డాష్ బోర్డుకు ఫార్వార్డ్ చేయబడుతుంది. అలాగే బాధితుడి బ్యాంకుకు సమాచారం షేర్ చేయబడుతుంది. వీలైనంత త్వరగా మోసాన్ని నివేదించండి. మీరు  https://cybercrime.gov.in/లో కూడా ఫిర్యాదు చేయవచ్చు.
 

click me!