ఎస్‌బి‌ఐ కస్టమర్లకు హెచ్చరిక! వీలైనంత త్వరగా ఈ పని చేయండి లేదంటే..?

Ashok Kumar   | Asianet News
Published : Aug 20, 2021, 01:46 PM IST

న్యూఢిల్లీ: ఆధార్ కార్డ్ అనేది ఇప్పటి వరకు ఒక గుర్తింపు కార్డు మాత్రమే. కానీ ఇప్పుడు అతి ముఖ్యమైన డాక్యుమెంట్‌గా మారింది. బ్యాంకు ఖాతాల నుండి ప్రభుత్వ పథకాల వరకు ప్రతిచోటా ఆధార్ కార్డు అవసరం. అంతేకాకుండా ఆధార్ లేనిది ఇప్పుడు పెద్ద ఆర్థిక లావాదేవీలు సాధ్యం కాదు.

PREV
15
ఎస్‌బి‌ఐ కస్టమర్లకు హెచ్చరిక! వీలైనంత త్వరగా ఈ పని చేయండి లేదంటే..?

 ప్రభుత్వం అందించే ప్రయోజనాలను కూడా మీరు కోల్పోవచ్చు. దేశంలో అతిపెద్ద ప్రభుత్వ యాజమాన్య బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బి‌ఐ)  తాజాగా మరోసారి కస్టమర్లను హెచ్చరించింది. ఎస్‌బీఐలో ఖాతాలు ఉన్న వారు ఆధార్‌తో పాన్‌ కార్డును లింక్‌ చేసుకోవాలని సూచించింది. ఆధార్ కార్డుకు సంబంధించిన పనిని సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని కస్టమర్లను కోరింది.
 

25
బ్యాంకింగ్ సేవలను ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆస్వాదించవచ్చు

ఎస్‌బి‌ఐ  బ్యాంక్ కస్టమర్లను పాన్ కార్డులతో ఆధార్‌తో లింక్ చేయాలని కోరింది. ఖాతాకు సంబంధించి ఎలాంటి ఇబ్బందిలు కలగకుండా ఉండాలంటే  కస్టమర్లకు వెంటనే ఆధార్‌తో పాన్‌ని లింక్ చేయాలని సూచిస్తున్నాము. ఇలా చేస్తే ఎలాంటి ఇబ్బంది లేకుండా బ్యాంకింగ్ సేవలను ఆస్వాదించవచ్చు, ”అని ఎస్‌బి‌ఐ ట్వీట్ ద్వారా తెలిపింది.

35
పాన్‌ను ఆధార్‌ తో లింక్‌ చేయడానికి చివరి తేదీ

పాన్‌ను ఆధార్‌ తో లింక్‌ చేయడానికి చివరి తేదీ సెప్టెంబర్ 30. నిర్ణీత సమయంలో మీరు పాన్‌తో ఆధార్‌ని లింక్ చేయకపోతే, మీ పాన్ కార్డ్ డియాక్టివేట్ చేయబడుతుంది. పాన్ కార్డును ఆధార్‌తో లింక్ చేయడం ఆదాయ పన్ను తప్పనిసరి చేసింది. గతంలో సి‌బి‌డి‌టి పాన్ కార్డును ఆధార్ కార్డుకు లింక్ చేయడానికి గడువును తేదీ జూన్ 30 వరకు ఇచ్చింది. కానీ తర్వాత ఆ తేదీని పొడిగించింది. మీరు మీ పాన్ కార్డును ఆధార్‌తో లింక్ చేయకపోతే, సెక్షన్ 234హెచ్ కింద గరిష్టంగా రూ .1,000 వరకు జరిమానా విధించవచ్చు. అందువల్ల, అన్ని బ్యాంకులు కస్టమర్లను పాన్‌తో ఆధార్‌ని లింక్ చేయాలని సూచిస్తున్నాయి.

45
ఆన్‌లైన్‌లో   పాన్‌కార్డును ఆధార్‌తో లింక్‌ చేయడం ఎలా..?

మొదట ఆదాయపు పన్ను శాఖ incometaxindiaefiling.gov.in అధికారిక వెబ్‌సైట్‌ను తెరవండి.

ఆ తర్వాత హోం పేజీలో పాన్ కార్డు, ఆధార్ కార్డ్ నంబర్, ఆధార్ కార్డ్ మీద ఉన్న మీ పేరు  ఎంటర్ చెయ్యాలి
 తర్వాత ఐ అగ్రీ టు వాలిడేట్ మై ఆధార్ డీటేయిల్స్ విత్ UIDAI అనే బటన్ మీద్ క్లిక్ చేయాలి.
దాని కింద చూపిస్తున్న క్యాప్చా కోడ్ సరిగ్గా టైప్ చేసి లింక్ ఆధార్ మీద క్లిక్ చేయాలి.

55
మీరు ఎస్‌ఎం‌ఎస్ ద్వారా కూడా లింక్ చేయవచ్చు

మీరు ఎస్‌ఎం‌ఎస్ ద్వారా కూడా మీ పాన్ ని ఆధార్‌తో లింక్ చేయవచ్చు. దీని కోసం మీరు ఎస్‌ఎం‌ఎస్ లో UIDPN క్యాపిటల్ లెటర్‌లో టైప్ చేయాలి. తరువాత మీ 12 అంకెల ఆధార్ నంబర్‌ను టైప్ చేయండి ఇప్పుడు స్పేస్ ఇచ్చి   10 అంకెల పాన్ నంబర్‌ను టైప్ చేయండి.  తరువాత 567678 లేదా 56161 కు ఎస్‌ఎం‌ఎస్ పంపండి.

click me!

Recommended Stories