బంగారం కొనేవారికి గుడ్ న్యూస్.. 9 వేలు దిగోచ్చిన పసిడి ధర.. నేడు 10గ్రా ధర ఎంతంటే ?

First Published Aug 20, 2021, 2:43 PM IST

నేడు  శుక్రవారం దేశీయ మార్కెట్‌లో గోల్డ్ ఫ్యూచర్స్ ధర పెరిగింది. ఎం‌సి‌ఎక్స్ లో గోల్డ్ ఫ్యూచర్స్ 0.15 శాతం పెరిగి 10 గ్రాములకు రూ. 47,240 కి చేరుకుంది. వెండి   కిలోకు రూ. 62,186 వద్ద స్థిరంగా ఉంది. బంగారం ధర గత సంవత్సరం గరిష్ట స్థాయి (10 గ్రాములకు రూ. 56,200)నుండి ఇప్పటికీ రూ .8960 తగ్గింది.

 గ్లోబల్ మార్కెట్లో బంగారం ధర నేడు ఔన్స్ కి 1,780.43 డాలర్లుగా ఉండగా, వెండి ధర ఔన్సు కి 0.1 శాతం పెరిగి 23.725 డాలర్లకు చేరుకుంది. డాలర్ ఇండెక్స్ తొమ్మిది నెలల గరిష్ట స్థాయి 93.56 దగ్గర స్థిరపడింది.

వ్యాపారులు, పెట్టుబడిదారులు జాగ్రత్తగా ఉండండి

కరోనావైరస్  డెల్టా వేరియంట్  కేసులు పెరుగుతున్నందున ఆర్థిక పునరుద్ధరణను ఆలస్యం చేయగలవు కాబట్టి ఆసియాలో స్టాక్ మార్కెట్లు నేడు బలహీనంగా ఉన్నాయి. ఇలాంటి పరిస్థితిలో ప్రపంచ ఆర్థిక వృద్ధికి సంబంధించిన ఆందోళనల మధ్య వ్యాపారులు, పెట్టుబడిదారులు జాగ్రత్తగా ఉండాలి. ప్రపంచ ఆర్థిక పునరుద్ధరణ, డాలర్‌తో రూపాయి మారకం అస్థిరత విలువైన లోహం బంగారం ధరను ప్రభావితం చేస్తాయి.  

ఏప్రిల్-జూలైలో  ఆభరణాల ఎగుమతులు

ఏప్రిల్-జూలై 2021లో దేశ రత్నాలు, ఆభరణాల ఎగుమతులు 6.04 శాతం పెరిగి 12.55 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. 2019-20 కాలంలో ఎగుమతులు   11.8 బిలియన్ల డాలర్లుగా ఉంది. యుఎస్, చైనా, హాంకాంగ్ వంటి ప్రధాన ఎగుమతి మార్కెట్లలో కొనసాగుతున్న పునరుద్ధరణ ఎగుమతులను పెంచింది. జూలైలో దేశ ఎగుమతులు 18 శాతం పెరిగి 3.36 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయని జిజెఇపిసి నివేదించింది. గత ఏడాది  ఈ కాలంలో  3.87 బిలియన్ డాలర్లుగా ఉంది.  

చెన్నైలో ఈరోజు 22 క్యారెట్ల బంగారం ధర రూ.44,490ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 48,540గా ఉంది. 
ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,130ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.47,130ఉంది. 
ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,250ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,450ఉంది. 
కొలకత్తాలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,600 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,300ఉంది. 
బెంగుళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.44,100ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.48,100ఉంది. 
హైదరాబాదులో 22 క్యారెట్ల బంగారం ధర రూ 44,100గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 48,100ఉంది.
 

వెండి ధరల విషయానికి వస్తే నిన్న(19-08-2021 గురువారం) ప్రారంభ ధరలతో పోలిస్తే కేజీ వెండి రూ.800 తగ్గింది. ఈ రోజు(20-08-2021 శుక్రవారం) వెండి 10 గ్రాములు రూ.674గా ఉంది. ప్రస్తుతం కేజీ వెండి ధర రూ 67,400గా ఉంది. పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు (20-08-2021 శుక్రవారం) ఉదయం 6 గంటల సమయానికి ఉన్న ధరలు. స్థానిక పరిస్థితులు ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చు. 
 

click me!