19 నుంచి 55 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన భారతీయ పౌరులు ఈ పథకంలో పెట్టుబడి పెట్టొచ్చు. కనిష్ట బీమా మొత్తం రూ. 10,000, గరిష్ఠ బీమా మొత్తం రూ. 10 లక్షలు ఉంటుంది. నెలవారీ, త్రైమాసిక, అర్ధవార్షిక లేదా వార్షికంగా ప్రీమియం చెల్లించవచ్చు. ఉదాహరణకు మీరు 19 ఏళ్ల వయస్సులో ఈ పాలసీ తీసుకుంటే, 55 ఏళ్ల వరకు నెలకు రూ. 1,515 చెల్లించాల్సి ఉంటుంది.