1.2 లీటర్, నాలుగు సిలిండర్ పెట్రోల్ ఇంజిన్, ఐదు గేర్ స్పీడ్ కలిగిన హ్యుందాయ్ ఎక్స్‌టర్ అద్భుతమైన పనితీరును కనబరుస్తుంది. సాధారణంగా హ్యుందాయ్ ఎక్స్‌టర్ ఒక చిన్న SUV. కాని ఇందులో AMT వేరియంట్‌లోని ప్రతి మోడల్ రూ.10 లక్షల లోపే లభిస్తుంది.
ఇది వైర్‌లెస్ ఛార్జర్, LED హెడ్‌లైట్లు, 15 అంగుళాల అల్లాయ్ వీల్స్, సన్‌రూఫ్, ఆపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటో కనెక్టివిటీతో 8.0 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌తో వస్తుంది. మాన్యువల్ కంట్రోల్ కోసం ఎక్స్‌టర్ AMTలో ప్యాడిల్ షిఫ్టర్ ఆప్షన్ కూడా ఉంది.