Sukanya Samriddhi Yojana: సుకన్య సమృద్ధి, PPF వడ్డీ పెంపుపై ఉసూరుమనిపించిన కేంద్ర ప్రభుత్వం..

First Published Jun 30, 2022, 11:04 PM IST

PPF-Sukanya check interest rate: కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోని అనేక చిన్న మొత్తాల పొదుపు పథకాలపై చెల్లించే వడ్డీ పెరుగుతుందనే ఆశలపై నీళ్లు చల్లింది. ఆర్బీఐ రెపో రేట్లను పెంచి అనంతరం వివిధ బ్యాంకులు తమ ఫిక్స్ డ్ డిపాజిట్ వడ్డీ రేట్లను పెంచాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ఆర్థిక శాఖ సైతం చిన్న మొత్తాల పొదుపు పథకాల వడ్డీ రేట్లు పెంచుతుందని అంతా భావించారు. కానీ పెరుగుతున్న ద్రవ్యోల్బణం నేపథ్యంలో కేంద్రం యధాతథ స్థితి కొనసాగించనుంది. 

పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF), సుకన్య సమృద్ధి యోజన, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ (NSC) వంటి చిన్న పొదుపు పథకాల వడ్డీ రేట్లను కేంద్ర ప్రభుత్వం మార్చలేదు. అంటే జులై నుంచి సెప్టెంబర్ త్రైమాసికానికి వడ్డీ రేట్లు అలాగే ఉంటాయి. 
 

చిన్న మొత్తాల పొదుపు పథకాల వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పు లేకపోవడం ఇది వరుసగా తొమ్మిదో త్రైమాసికం. 2020-21 మొదటి త్రైమాసికం నుండి వడ్డీ రేటు సవరించలేదు. చిన్న పొదుపు పథకాలకు వడ్డీ రేట్లు త్రైమాసిక ప్రాతిపదికన నిర్ణయిస్తుంటారు. ఈ పథకాలకు చెందిన వడ్డీ రేట్లపై కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకుంటుంది.

ఏ పథకంపై ఎంత వడ్డీ నడుస్తోంది:

బాలికల కోసం సుకన్య స్మృద్ధి యోజనపై కేంద్ర ప్రభుత్వం ఏడాదికి 7.6 శాతం వడ్డీ ఇస్తోంది. అదే సమయంలో, PPF వార్షిక వడ్డీ రేటు 7.1 శాతం అందిస్తోంది. నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ (NSC)పై 6.8 శాతం వడ్డీ అందిస్తోంది. 
 

అదే సమయంలో,ఐదేళ్ల సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్ గురించి మాట్లాడినట్లయితే, 7.4 శాతం వడ్డీ అందిస్తోంది. పొదుపు డిపాజిట్లపై వడ్డీ రేటు సంవత్సరానికి 4 శాతంగా ఉంటుంది. అదే విధంగా, ఒక సంవత్సరం ఫిక్స్‌డ్ డిపాజిట్ పథకంపై వడ్డీ రేటు 5.5 శాతంగా ఉంది.

పోస్టాఫీస్ ఆర్‌డితో పాటు, ప్రభుత్వ చిన్న పొదుపు పథకాలలో పిపిఎఫ్, కిసాన్ వికాస్ పత్ర, సుకన్య సమృద్ధి మొదలైనవి ఉన్నాయి. ఈ పథకాలకు కేంద్ర ప్రభుత్వం గతంలో చెల్లించిన వడ్డీనే ఈ త్రైమాసికంలో కూడా చెల్లించనుంది. 
 

పోస్టాఫీస్ ఆర్‌డితో పాటు, ప్రభుత్వ చిన్న పొదుపు పథకాలలో పిపిఎఫ్, కిసాన్ వికాస్ పత్ర, సుకన్య సమృద్ధి మొదలైనవి ఉన్నాయి. ఈ పథకాలకు కేంద్ర ప్రభుత్వం గతంలో చెల్లించిన వడ్డీనే ఈ త్రైమాసికంలో కూడా చెల్లించనుంది. 

అధిక ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయడానికి RBI రెపో రేట్లను వరుసగా రెండుసార్లు 90 బేసిస్ పాయింట్లు పెంచింది. మే, జూన్‌లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) రెపో రేటును వరుసగా 40 బేసిస్ పాయింట్లు మరియు 50 బేసిస్ పాయింట్లు పెంచింది. అటు దేశంలోనే అతి పెద్ద బ్యాంకు అయిన SBI సైతం ఒక సంవత్సరం ఫిక్స్‌డ్ డిపాజిట్‌పై వడ్డీ రేటును పెంచింది. 
 

ఆర్బీఐ రెపోరేట్లను పెంచిన అనంతరం, SBI సహా  వివిధ బ్యాంకులు ఫిక్స్ డ్ డిపాజిట్లపై చెల్లించే వడ్డీని పెంచాయి. దీంతో చిన్న మొత్తాల పొదుపు పథకాలకు కూడా వడ్డీలు పెంచే వీలుందని అంతా భావించారు. కానీ కేంద్ర ఆయా పథకాల లబ్దిదారుల ఆశలపై నీళ్లు చల్లినట్లయ్యింది.  

click me!