ఆన్‌లైన్ షాపింగ్‌లో మోసాల పెరుగుదలపై కేంద్ర ప్రభుత్వం హెచ్చరిక జారీ చేసింది. నకిలీ లింకులు, ఫిషింగ్ మెసేజ్‌లకు లొంగిపోవద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు.
భారతదేశంలో ఆన్‌లైన్ షాపింగ్ వేగంగా పెరుగుతోంది. వినియోగదారులకు ఇది ఎంతో సౌకర్యాన్ని అందించినప్పటికీ, అదే స్థాయిలో మోసాలు కూడా పెరుగుతున్నాయి. లక్షల మంది ప్రజలు రోజూ డిజిటల్ ప్లాట్‌ఫార్మ్‌లలో కొనుగోళ్లకు మొగ్గుచూపుతుండటంతో, సైబర్ నేరస్థులు వాటిని లక్ష్యంగా చేసుకుంటూ కొత్త కొత్త మోసాలకు పాల్పడుతున్నారు.
27
'సైబర్ దోస్త్'
కేంద్ర హోంమంత్రిత్వ శాఖ 'సైబర్ దోస్త్' అవగాహన కార్యక్రమం ద్వారా ఒక ముఖ్యమైన హెచ్చరికను జారీ చేసింది. నకిలీ వెబ్‌సైట్లు, ఫిషింగ్ మెసేజ్‌లు, ఫేక్ ఆఫర్లు ద్వారా డేటా దొంగతనం జరుగుతోందని ప్రభుత్వ అధికారిక ప్రకటనలో పేర్కొన్నారు.
37
lనకిలీ వెబ్ సైట్లు ఎలా మోసం చేస్తున్నాయంటే...
అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ లాంటి ప్రసిద్ధ వెబ్‌సైట్లను పోలిన నకిలీ సైట్లు రూపొందించి, వినియోగదారులను మోసం చేస్తున్నారు. వినియోగదారులు తమ పేమెంట్ లేదా వ్యక్తిగత వివరాలను అందించగానే వారి ఖాతాలను హ్యాక్ చేసే ప్రమాదం ఉంటుంది.
కొంతమందికి “మీ ఆర్డర్ నిలిపివేశారు. “చెల్లింపు కోసం ఇక్కడ క్లిక్ చేయండి” వంటి మెసేజ్‌లు వస్తున్నాయి. ఇవి అసలైన సైట్లకు పోలి కనిపించే ఫేక్ లింకులతో ఉంటాయి. అవి నమ్మితే డబ్బు పోవడం ఖాయం.
57
గుర్తుంచుకోవాల్సిన సూచనలు:
అధికారిక వెబ్‌సైట్ల నుంచే షాపింగ్ చేయండి
HTTPS:// తో URL ప్రారంభమవుతుందో చూడండి
URLలో స్పెల్లింగ్ తప్పిదాలుంటే అనుమానం కలిగించాలి
ఫోన్ లేదా ఇమెయిల్ ద్వారా వచ్చిన లింకులను క్లిక్ చేయవద్దు
అధిక రాయితీలతో వచ్చే డీల్స్‌పై నమ్మకంగా ఉండకండి
ఎవ్వరైనా OTP అడిగితే తెలియనివారితో పంచుకోకండి
67
మోసపోయారని అనుమానం ఉంటే:
వెంటనే 1930 నంబరుకు కాల్ చేయండి
లేదా cybercrime.gov.in వెబ్‌సైట్ ద్వారా ఫిర్యాదు చేయండి
సోషల్ మీడియా ప్రకటనలు కూడా మోసానికి కారణమవుతున్నాయి. తక్కువ ధరలకు వస్తువులు ఇవ్వనున్నట్లు ప్రకటించి, డెలివరీ లేకుండా డబ్బు దోచుకుంటున్నారు.
77
భద్రతతో కూడిన షాపింగ్ – తెలివైన వినియోగదారుల ఎంపిక
ఆన్‌లైన్ షాపింగ్ చేసేటప్పుడు ప్రతి అడుగులో జాగ్రత్త అవసరం. సైబర్ మోసాల నుండి రక్షించుకోవడానికి ప్రజలందరికీ డిజిటల్ అవగాహన తప్పనిసరి. ఒకవేళ మోసానికి గురైతే, వెంటనే స్పందించడం వల్ల నష్టాన్ని తగ్గించుకోవచ్చు.
భద్రతతో కూడిన షాపింగ్ – తెలివైన వినియోగదారుల ఎంపిక