Budget Earbuds: రూ.1500 లోపు అదిరిపోయే ఇయర్‌బడ్స్.. టాప్ 5 లిస్ట్ ఇదిగో

Published : Feb 23, 2025, 03:30 PM IST

బడ్జెట్లోనే సూపర్ ఆడియో ఎక్స్పీరియన్స్ కావాలా? అయితే రూ.1500 లోపు దొరికే ఈ 5 ఇయర్‌బడ్స్ వివరాలు ఓసారి పరిశీలించండి. ఒక్కో ఇయర్‌బడ్ ఒక్కో బెస్ట్ ఫీచర్ ని కలిగి ఉంది. మీరు ఎంచుకొనే బడ్జెట్‌కి తగ్గట్టుగానే ఆడియో క్వాలిటీ కూడా ఉంటుంది. ఈ ఇయర్ బడ్స్ వివరాలు తెలుసుకుందాం రండి. ​​​​​​​

PREV
15
Budget Earbuds: రూ.1500 లోపు అదిరిపోయే ఇయర్‌బడ్స్.. టాప్ 5 లిస్ట్ ఇదిగో

బోట్ ఎయిర్ డోప్స్(boAt Airdopes) 311 ప్రో..

ఎక్కువ బ్యాటరీ టైమ్, క్లారిటీ కాల్స్, గేమింగ్‌ కావాలనుకొనే వారికి ఇవి పర్ఫెక్ట్ గా ఉంటాయి. ఇందులో ఉన్న బ్యాటరీ 50 గంటల ప్లేటైమ్ ఇస్తుంది. లాంగ్ జర్నీలకు ఇవి బెస్ట్. కాల్ క్వాలిటీ విషయానికొస్తే ENx టెక్నాలజీ ఉపయోగించడం వల్ల సైలెంట్ ప్రదేశాల్లో కూడా క్లారిటీగా మాట్లాడొచ్చు.ఇందులో 50ms తక్కువ లేటెన్సీ వల్ల ఎలాంటి లాగ్ లేకుండా గేమింగ్ ఆడొచ్చు. ASAP ఛార్జింగ్, IWP టెక్నాలజీ, బ్లూటూత్ v5.3 తదితర స్పెషల్ ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి.

25

బౌల్ట్ ఆడియో(Boult Audio) Z40 ప్రో

ఈ ఇయర్‌బడ్స్ 100 గంటల బ్యాటరీ టైమ్ ఇస్తాయి. కాల్ క్వాలిటీ విషయానికొస్తే క్వాడ్ మైక్ ENC టెక్నాలజీ ఉపయోగించడం వల్ల బ్యాక్‌గ్రౌండ్ నాయిస్‌ తక్కువగా ఉంటుంది. అందువల్ల క్లారిటీగా మాట్లాడొచ్చు. 45ms తక్కువ లేటెన్సీ వల్ల గేమింగ్ లో ఆడియో, వీడియోకి మధ్య సింక్ బాగుంటుంది. 13mm బాస్ డ్రైవర్లు, డీప్ పవర్ఫుల్ సౌండ్ వస్తుంది. ప్రీమియం రబ్బర్ గ్రిప్ కేస్, ఫెదర్ టచ్ కంట్రోల్స్ వంటి స్పెషల్ ఫీచర్లు ఉన్నాయి.

35

రియల్ మి బడ్స్(realme Buds) T110 

ఈ ఇయర్ బడ్స్ కేవలం 10 నిమిషాల ఛార్జింగ్‌లో 120 నిమిషాల ప్లేటైమ్ ఇస్తాయి. ఇవి IPX5 వాటర్ రెసిస్టెన్స్ ని కలిగి ఉన్నాయి. ఇవి అవుట్‌డోర్ యూజ్‌కి బెస్ట్. అంటే బైక్ పై వెళుతున్నప్పుడు ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ఆడియో వినిపిస్తుంది. 88ms తక్కువ లేటెన్సీ, స్మూత్ ఆడియో సింక్ వల్ల గేమ్స్ ఆడేటప్పుడు మంచి అనుభూతి కలుగుతుంది. 10mm డైనమిక్ బాస్ డ్రైవర్లు డీప్ అండ్ పంచీ సౌండ్ ఇస్తాయి.​​​​​​ AI ENC టెక్నాలజీ, బ్లూటూత్ 5.4, గూగుల్ ఫాస్ట్ పెయిర్ వంటి స్పెషల్ ఫీచర్లు కూడా ఉన్నాయి.

45

నాయిస్ బడ్స్(Noise Buds) N1 ప్రో: 

మీరు డిస్టర్బెన్స్ లేని ఆడియో క్వాలిటీ కావాలా? అయితే నాయిస్ బడ్స్ ఈ ఫీచర్ ఉంది. 32dB వరకు యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఉండటం వల్ల బ్యాక్‌గ్రౌండ్ నాయిస్‌ను తగ్గిస్తుంది. మెటాలిక్, క్రోమ్ ఫినిష్ ఈ ఇయర్ బడ్స్ కి స్టైలిష్‌ లుక్ ఇచ్చాయి. బ్యాటరీ విషయానికొస్తే 60 గంటల వరకు నాన్  స్టాప్ గా వీటిని ఉపయోగించవచ్చు. ఇందులో 11mm డ్రైవర్లు ఉండటం వల్ల బ్యాలెన్స్‌డ్, డీప్ సౌండ్ ను మీరు ఆస్వాదించొచ్చు. 40ms అల్ట్రా లో లేటెన్సీ, క్వాడ్ మైక్ ENC వంటి స్పెషల్ ఫీచర్లు కూడా ఈ ఇయర్ బడ్స్ లో ఉన్నాయి.

 

55

బోట్ ఎయిర్ డోప్స్(boAt Airdopes) 141: 

ఈ ఇయర్ బడ్స్ లో 32dB ANC  నాయిస్ క్యాన్సిలేషన్ ఫీచర్ ఉంది. అందువల్ల బయటి సౌండ్ రాకుండా ఆపుతుంది. 10mm డ్రైవర్లు ఉండటం వల్ల బెస్ట్ boAt సిగ్నేచర్ సౌండ్, బ్యాలెన్స్‌డ్ సౌండ్ ఎక్స్పీరియన్స్ ను మీరు పొందొచ్చు. ఈ ఇయర్ బడ్స్ లో ENx టెక్నాలజీ, క్వాడ్ మైకులు ఉపయోగించడం వల్ల కాల్స్ క్లారిటీ ది బెస్ట్ గా ఉంటుంది. ఇవి IWP టెక్నాలజీ తో  42 గంటల బ్యాటరీ టైమ్ ఇస్తాయి.

ఈ ఇయర్‌బడ్స్ అన్నీ రూ.1500 లోపే మార్కెట్ లో వివిధ ఆన్ లైన్ ప్లాట్ ఫాంలలో లభిస్తాయి.

click me!

Recommended Stories