అయితే బ్యాంక్ ఖాతా నుంచి వ్యాలెట్ నుంచి లావా దేవీలు చేసే వారు మాత్రం ఎలాంటి కన్వీనియన్స్ ఫీజును చెల్లించాల్సిన పనిలేదని కంపెనీ తెలిపింది. ఇదిలా ఉంటే ఫోన్‌పే, పేటీఎం వంటి దాదాపు అన్ని పేమెంట్ సంస్థలు ఛార్జీలు వసూలు చేయడం ప్రారంభించాయి. మొబైల్ రీఛార్జ్ చేసే వారి నుంచి ప్లాట్‌ఫామ్ ఫీజు పేరుతో రూపాయి వరకు వసూలు చేస్తున్న విషయం తెలిసిందే.
కాగా 2024 ఆర్థిక సంవత్సరంలో, యుపీఐ లావాదేవీల ప్రాసెసింగ్ కోసం ఫిన్‌టెక్ కంపెనీలు కలిపి సుమారు రూ. 12,000 కోట్లు వ్యయం చేసినట్లు PwC విశ్లేషణ పేర్కొంది. ఈ కారణంగా, కంపెనీలు ఆదాయ మార్గాలను అన్వేషిస్తున్నాయి. 2020లో భారత ప్రభుత్వం రూ. 2,000లోపు యూపీఐ లావాదేవీలకు మర్చంట్ డిస్కౌంట్ రేట్ (MDR) మాఫీ విధానాన్ని అమలు చేసింది. ప్రభుత్వమే ఈ ఖర్చును భరిస్తున్నా, వినియోగదారుల నుంచి ప్రత్యక్ష ఆదాయం పొందడం ఈ ప్లాట్‌ఫారమ్‌లకు సవాలుగా మారింది.