Long Range Electric Cars: లాంగ్ డ్రైవ్ కి వెళ్లేందుకు బెస్ట్ ఎలక్ట్రిక్ కార్లు ఇవే! ధర కూడా తక్కువే

Published : Feb 21, 2025, 05:56 PM IST

Electric Car: ఎలక్ట్రిక్ కార్లంటేనే ఖరీదైన వాహనాలు అనుకుంటాం కదా.. కాని తక్కువ ధరలో ఎక్కువ దూరం ప్రయాణించే బెస్ట్ ఎలక్ట్రిక్ కార్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం రండి. 

PREV
15
Long Range Electric Cars: లాంగ్ డ్రైవ్ కి వెళ్లేందుకు బెస్ట్ ఎలక్ట్రిక్ కార్లు ఇవే! ధర కూడా తక్కువే

టాటా పంచ్ ఈవీ(Tata Punch EV)

2024లో అత్యధికంగా అమ్ముడైన వాహనం ఏంటో మీకు తెలుసా? టాటా మోటార్స్ నుంచి వచ్చిన సబ్ కాంపాక్ట్ SUV పంచ్. ఇప్పుడు పంచ్ లోనే ఎలక్ట్రిక్ వేరియంట్ కూడా వినియోగదారులను బాగా ఆకర్షిస్తోంది. పంచ్ ఈవీ రెండు బ్యాటరీ రకాల్లో అందుబాటులో ఉంది. 25 kWh వెర్షన్ 80 bhp, 315 Nm టార్క్‌ను అందిస్తూ 315 కి.మీ. పరిధిని ప్రయాణించగలదు. 35 kWh వెర్షన్ 120.69 bhp, 190 Nm టార్క్ తో  421 కి.మీ వరకు ప్రయాణించగలరు. ఈ కార్ల ధరలు రూ.9.99 లక్షల నుంచి రూ.14.29 లక్షల వరకు ఉన్నాయి. 

25

టాటా నెక్సాన్ ఈవీ(Tata Nexon EV)

పెట్రోల్, డీజిల్, సిఎన్‌జి, ఎలక్ట్రిక్ వేరియంట్‌లలో లభించే ఏకైక వాహనంగా మార్కెట్‌లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న టాటా నెక్సాన్.. అత్యధికంగా అమ్ముడవుతున్న కాంపాక్ట్ SUVలలో ఒకటి. ఈ ఎలక్ట్రిక్ వాహనం రెండు బ్యాటరీ ప్యాక్ ఎంపికలను అందిస్తుంది. 30 kWh వెర్షన్ 325 కి.మీ. రేంజ్ వరకు ప్రయాణిస్తుంది. 45 kWh వేరియంట్ 489 కి.మీ. వరకు ప్రయాణిస్తుంది. వీటి (ఎక్స్-షోరూమ్) ధరలు రూ.12.49 లక్షల నుంచి రూ.16.49 లక్షలు వరకు ఉన్నాయి. 

35

మహీంద్ర ఎక్స్‌యూవీ 400(Mahindra XUV400)

ప్రస్తుతం మార్కెట్ లో తక్కువ ధరకు లభిస్తున్న ఎలక్ట్రిక్ కార్లలో మహీంద్రా XUV400 ఒకటి. ఇది మార్కెట్లో 34.5 kWh, 39.4 kWh బ్యాటరీ ఎంపికలలో అందుబాటులో ఉంది. ఒకసారి ఛార్జ్ చేస్తే 34.5 kWh వేరియంట్ 375 కి.మీ. 39.4 kWh వెర్షన్ 456 కి.మీ వరకు ప్రయాణించగలదు. వీటి (ఎక్స్-షోరూమ్) ధరలు రూ.15.49 లక్షలు నుంచి రూ.17.69 లక్షల వరకు ఉన్నాయి. 

45

టాటా కర్వ్ ఈవీ(Tata Curvv EV)

టాటా కర్వ్ EV, ఒక స్టైలిష్ SUV. ఇది 2024లో మార్కెట్ లోకి వచ్చింది. దీని సొగసైన డిజైన్, ఆకట్టుకునే ఫీచర్ల కారణంగా మార్కెట్లో ఎక్కువగా అమ్ముడవుతోంది. ఇది 45 kWh, 55 kWh బ్యాటరీ వేరియంట్లలో లభిస్తుంది. 45 kWh వేరియంట్ 148 bhp, 215 Nm టార్క్‌ను అందిస్తుంది. ఒకసారి ఛార్జ్ చేస్తే 502 కి.మీ. దూరం ప్రయాణిస్తుంది. ఎక్కువ శక్తి, తక్కువ రేంజ్ కోరుకునే వారికి 55 kWh వెర్షన్ బాగుంటుంది. ఇది 165 bhp, 215 Nmని ఉత్పత్తి చేస్తుంది. ఇది ఏకంగా 585 కి.మీ. వరకు ప్రయాణించగలదు. మార్కెట్లో వీటి ధరలు రూ. రూ 17.49 లక్షలు నుంచి రూ 21.99 లక్షలు వరకు ఉన్నాయి. 

55

హ్యుందయ్ క్రెటా ఎలక్ట్రిక్(Hyundai Creta Electric)

EV విభాగంలో అత్యధికంగా అమ్ముడవుతున్న హ్యుందాయ్ క్రెటా 42 kWh, 51.4 kWh బ్యాటరీ ట్రిమ్‌లలో అందుబాటులో ఉంది. 42 kWh వేరియంట్ 133 bhp, 200 Nm టార్క్‌ను అందిస్తుంది. ఇది ఒకసారి ఛార్జ్ చేస్తే 390 కి.మీ. వరకు ప్రయాణిస్తుంది. 51.4 kWh వెర్షన్ అయితే 169 bhp, 200 Nmని శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఇది 473 కి.మీ. వరకు ప్రయాణిస్తుంది. వీటి ధరలు రూ.17.99 లక్షల నుంచి రూ.24.38 లక్షలు వరకు ఉన్నాయి.

click me!

Recommended Stories