Google Pixel 9a: గూగుల్ పిక్సెల్ 9ఎ ఫోన్ సమాచారం లీక్.. ఫీచర్లు ఎంత బాగున్నాయో చూడండి

Published : Feb 22, 2025, 10:00 AM IST

Google Pixel 9a: గూగుల్ పిక్సెల్ ఫోన్లకి ఒక ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంది. ఇప్పుడు పిక్సెల్ 9ఎ గురించి లీక్ అయిన సమాచారం ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది. కొత్త డిజైన్, అప్‌గ్రేడ్ చేసిన ఫీచర్ల గురించి సమాచారం లీకైయ్యింది. ఆ వివరాలు తెలుసుకుందాం రండి. 

PREV
15
Google Pixel 9a: గూగుల్ పిక్సెల్ 9ఎ ఫోన్ సమాచారం లీక్.. ఫీచర్లు ఎంత బాగున్నాయో చూడండి

లీక్ అయిన సమాచారం ప్రకారం పిక్సెల్ 9ఎ నాలుగు రంగుల్లో మార్కెట్ లోకి రిలీజ్ అవుతుంది. గోల్డ్, బ్లూ, పింక్, బ్లాక్ రంగుల్లో ఈ ఫోన్ లభిస్తుంది. రంగులే కాకుండా ఫోన్ డిజైన్‌లో కూడా కొన్ని మార్పులు ఉంటాయట. ముఖ్యంగా కెమెరా విషయంలో కొత్త విధానం తీసుకొచ్చినట్లు సమాచారం.

25

లీకైన సమాచారం ప్రకారం పిక్సెల్ 9ఎ లో పెద్ద 5,100mAh బ్యాటరీ ఉంటుంది. ఇది పిక్సెల్ ఫోన్లంటిలోనూ ఎక్కువ కెపాసిటీ కలిగిన బ్యాటరీ అవుతుంది. పెద్ద బ్యాటరీ కారణంగా ఫోన్ మందం పెరుగుతుంది. కాబట్టి కెమెరా విషయంలో గూగుల్ మార్పులు చేయాలని చూస్తోంది. బార్ స్టైల్ కెమెరాకు బదులుగా ఫ్లష్ కెమెరా ఫిట్ చేస్తారని సమాచారం. ఇదే జరిగితే ఫోన్ లుక్‌ మరింత అందంగా ఉంటుంది.

35

పిక్సిల్ 9ఎ లో 6.28 ఇంచ్ స్క్రీన్ ఉంటుంది. ఈ స్క్రీన్ బ్రైట్‌నెస్ 2,700 నిట్స్ వరకు ఉంటుందని అంటున్నారు. HDR బ్రైట్‌నెస్ 1,800 నిట్స్ ఉంటుంది. స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 120 Hz, టచ్ సెన్సిటివిటీ 240 Hz ఉంటుంది. దీనివల్ల స్క్రీన్ క్వాలిటీ బాగుంటుంది. గూగుల్ టెన్సర్ G4 చిప్, 8GB RAM ఈ ఫోన్‌లో ఉంటాయి. దీనివల్ల ఫోన్ పనితీరు మెరుగుపడుతుంది.

45

పిక్సిల్ 9ఎ కెమెరాలో కొన్ని మార్పులు ఉండొచ్చని సమాచారం. 48 MP మెయిన్ కెమెరా, 13 MP అల్ట్రా వైడ్ లెన్స్ ఉండొచ్చు. ఫ్రంట్ కెమెరా 13 MP ఉంటుంది. గూగుల్ పాపులర్ కెమెరా ఫీచర్లయిన సూపర్ రెస్ జూమ్, ఆస్ట్రోఫోటోగ్రఫీ, నైట్ సైట్ వంటివి కూడా ఉంటాయి. ఈ లీక్స్ అన్నీ నిజమైతే పిక్సిల్ 9ఎ బెస్ట్ ఫీచర్స్ తో మార్కెట్ లోకి వస్తుందన్న మాట. దీని ధర రూ.43,300 నుంచి రూ.52,000 వరకు ఉంటుందని సమాచారం. అయితే ఇండియాలో దీని ధర కొంచెం మారే అవకాశాలు కూడా ఉన్నాయి.

55

మార్చి నెలలో ఈ ఫోన్ విడుదల కావొచ్చని తెలుస్తోంది. ఒకవేళ మార్చిలో విడుదల కాకపోతే మే నెలలో జరిగే గూగుల్ I/O ఈవెంట్‌లో విడుదల చేస్తారని సమాచారం.

click me!

Recommended Stories